MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Astrology
  • Astrology Predictions: జూన్ 24 నుంచి ఈ 3 రాశుల వారికి జాక్‌పాట్.. కెరీర్‌లో దూసుకెళ్తారంతే!

Astrology Predictions: జూన్ 24 నుంచి ఈ 3 రాశుల వారికి జాక్‌పాట్.. కెరీర్‌లో దూసుకెళ్తారంతే!

Astrology Predictions: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూన్ 24న శక్తివంతమైన శివ యోగం ఏర్పడనుంది. సూర్య, చంద్రులు ప్రత్యేకమైన స్థానాల్లోకి వచ్చినప్పుడు ఈ యోగం ఏర్పడుతుంది. ఈ యోగం కొన్ని రాశులవారి జీవితంలో సానుకూల మార్పులు తీసుకురానుంది. ఆ రాశులేవో చూడండి.

1 Min read
Author : Kavitha G
Published : Jun 10 2026, 01:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
జూన్ 24న శివయోగం
Image Credit : stockPhoto

జూన్ 24న శివయోగం

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల సంచారం వ్యక్తుల జీవితాల్లో ముఖ్యమైన మార్పులకు కారణమవుతుంది. ప్రతి గ్రహ స్థితి ఒక ప్రత్యేకమైన శక్తిని కలిగి ఉంటుంది. కెరీర్, ఆర్థిక పరిస్థితి, ఆరోగ్యం వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపుతుంది. అలాంటి అరుదైన, శక్తివంతమైన సమ్మేళనం ఈ జూన్ 24న ఏర్పడనుంది. అదే శివ యోగం. జ్యోతిష్య శాస్త్రంలో శివ యోగానికి చాలా ప్రాధాన్యం ఉంది. ఈ శుభయోగం కొన్ని రాశులవారికి అదృష్ట ద్వారాలు తెరవబోతోంది. మరి ఆ రాశులేవో చూసేయండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
మిథున రాశి
Image Credit : Pixabay

మిథున రాశి

శివ యోగం మిథున రాశివారి జీవితంలో మంచి మార్పులు తీసుకురానుంది. వ్యాపారులకు కొత్త ఒప్పందాలు కుదరడంతో వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగంలో ఉన్నవారి పనితీరు మెరుగుపడుతుంది. ఈ సమయంలో ఆరోగ్యం బాగుంటుంది. మరింత ఉత్సాహంగా ఉంటారు. స్నేహితుల సహాయంతో తక్కువ ధరకే విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కేరీర్ లో మంచి పురోగతి ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్న టైంకి పూర్తి చేసి మంచి లాభాలు అందుకుంటారు.

Related Articles

Related image1
Vipareeta Rajyogam: విపరీత రాజయోగంతో ఈ 4 రాశులవారి జాతకం మారడం పక్కా.. అదృష్టం మొత్తం వీరిదే!
Related image2
Birth Month: మీరు జూన్ లో పుట్టారా? అయితే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!
34
వృశ్చిక రాశి
Image Credit : our own

వృశ్చిక రాశి

వృశ్చిక రాశివారికి శివయోగం ఆర్థిక లాభాలను ఇస్తుంది. ఆదాయం కోసం కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. కుటుంబ అవసరాలను ఎప్పటికప్పుడు తీర్చగలుగుతారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. నూతన గృహ, వాహన యోగం ఉంది. ఈ సమయంలో ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. వ్యాపారాలు ఆశించిన స్థాయిలో రాణిస్తాయి. ఉద్యోగాలలో తోటివారి సహకారంతో టైంకి పనులు పూర్తి చేస్తారు. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. 

44
ధనుస్సు రాశి
Image Credit : Pixabay

ధనుస్సు రాశి

ధనుస్సు రాశివారికి శివయోగం శుభ ఫలితాలను ఇస్తుంది. ఒక ముఖ్యమైన పనిని పూర్తి చేయడానికి మీరు చేసే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. ఉద్యోగంలో మీ కృషికి ప్రశంసలు లభిస్తాయి. ఈ సమయంలో, మీకు దైవభక్తి పెరుగుతుంది. అనవసరమైన విషయాలకు దూరంగా ఉంటారు. విద్యార్థులు తమ చదువుపై మరింత శ్రద్ధ పెడతారు. వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రేమ జీవితంలో కూడా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆకస్మిక ధనలాభం.. ఉద్యోగాలలో పదోన్నతులు!
Recommended image2
Zodiac Signs: ఈ 5 రాశులవారు పగ తీర్చుకోవడంలో ఫస్ట్! అవమానాన్ని అస్సలు మర్చిపోరు!
Recommended image3
Venus Transit: సెప్టెంబర్ 11న రాహు నక్షత్రంలోకి శుక్రుడు.. ఈ 5 రాశుల వారికి అదృష్ట యోగం!
Related Stories
Recommended image1
Vipareeta Rajyogam: విపరీత రాజయోగంతో ఈ 4 రాశులవారి జాతకం మారడం పక్కా.. అదృష్టం మొత్తం వీరిదే!
Recommended image2
Birth Month: మీరు జూన్ లో పుట్టారా? అయితే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved