MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు కోటీశ్వరులు కావడం ఖాయం! మీ తేదీ ఉందా?

Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు కోటీశ్వరులు కావడం ఖాయం! మీ తేదీ ఉందా?

సంఖ్యాశాస్త్రం ప్రకారం ప్రతి సంఖ్యకు ప్రత్యేక శక్తి, లక్షణాలు ఉంటాయి. కొన్ని తేదీల్లో పుట్టిన వారు చాలా అదృష్టవంతులు. వారు జీవితంలో కచ్చితంగా ధనవంతులు అవుతారని న్యూమరాలజీ చెబుతోంది. మరి ఏ తేదీల్లో పుట్టినవారు ఇంతటి అదృష్టాన్నికలిగి ఉంటారో చూద్దామా..

2 Min read
Author : Kavitha G
| Updated : Apr 03 2026, 03:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఏ తేదీల్లో పుట్టినవారు అదృష్టవంతులు?
Image Credit : our own

ఏ తేదీల్లో పుట్టినవారు అదృష్టవంతులు?

జ్యోతిష్య శాస్త్రంలో ఒక భాగమైన సంఖ్యాశాస్త్రం, కొన్ని అంకెలను చాలా అదృష్టమైనవిగా పరిగణిస్తుంది. 1 నుంచి 9 వరకు ఉన్న మూల సంఖ్యల ఆధారంగా వ్యక్తుల స్వభావం, కెరీర్, ప్రవర్తన, భవిష్యత్తు ఎలా ఉంటుందో అంచనా వేయచ్చు. సంఖ్యాశాస్త్రం ప్రకారం, ఏయే అంకెలు అదృష్టాన్ని, సంపదను తెచ్చిపెడతాయో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
మూలసంఖ్య 1
Image Credit : Getty

మూలసంఖ్య 1

సంఖ్యా శాస్త్రంలో మూలసంఖ్య 1ని అత్యంత శక్తివంతమైనదిగా భావిస్తారు. ఏ నెలలో అయినా 1, 10, 19, 28 తేదీల్లో పుట్టినవారి మూలసంఖ్య 1. ఈ సంఖ్యకు అధిపతి సూర్య భగవానుడు. గ్రహాలకు అధిపతి అయిన సూర్యుడు.. ఆత్మవిశ్వాసం, ఆరోగ్యం, గౌరవం, కీర్తిని ప్రసాదిస్తాడు. సూర్యుడి శక్తి వల్ల వీరికి నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ, సవాళ్లను ఎదుర్కొనే ధైర్యం ఉంటాయి. ఈ లక్షణాల వల్లే 1వ సంఖ్య వారు గొప్ప నాయకులుగా ఎదుగుతారు. ఉన్నత పదవులు పొంది, తక్కువ టైంలో ధనవంతులు అవుతారు.

34
మూలసంఖ్య 5
Image Credit : Getty

మూలసంఖ్య 5

మూల సంఖ్య 5కి అధిపతి బుధ గ్రహం. సంపద, వ్యాపారం, తెలివితేటలు, వాక్కుకు కారకుడు బుధుడు. ఏ నెలలో అయినా 5, 14, 23 తేదీల్లో పుట్టినవారి మూలసంఖ్య 5.  ఈ సంఖ్య కలిగినవారు కమ్యూనికేషన్‌లో చాలా నైపుణ్యం కలిగి ఉంటారు. వీరు చాలా తెలివైనవారు, ఏ పని చేసినా అందులో రాణిస్తారు. 5వ సంఖ్య ఉన్న వ్యక్తులు గొప్ప వ్యాపారవేత్తలుగా మారి, జీవితంలో అపారమైన విజయాన్ని సాధిస్తారు. తద్వారా భారీగా డబ్బు సంపాదిస్తారు.

44
మూలసంఖ్య 6
Image Credit : Freepik

మూలసంఖ్య 6

సంఖ్యాశాస్త్రంలో 6వ సంఖ్యను చాలా శుభప్రదంగా భావిస్తారు. ఈ సంఖ్యకు అధిపతి శుక్ర గ్రహం. సంపద, కీర్తి, వైభవం, గ్లామర్, ప్రేమకు శుక్రుడు కారకుడు. అందుకే 6వ సంఖ్యలో పుట్టినవారు అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు. ఏ నెలలో అయినా 6, 15, 24 తేదీల్లో పుట్టినవారి మూలసంఖ్య 6. పండితుల ప్రకారం వీరు చాలా త్వరగా ధనవంతులు అవుతారు. అందరూ వీరి పట్ల సులభంగా ఆకర్షితులవుతారు. వీరు విలాసవంతమైన జీవితాన్ని ఇష్టపడతారు, అలాంటి జీవితాన్నే పొందుతారు. ఇతరులతో మంచి సంబంధాలు ఏర్పరచుకోవడం వీరి బలం. ఈ నెట్‌వర్క్‌ వల్ల వీరికి మంచి అవకాశాలు వస్తాయి. డబ్బును ఆకర్షించే శక్తి వీరిలో సహజంగా ఉంటుందని సంఖ్యా శాస్త్రం చెబుతోంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఉద్యోగంలో కొత్త అవకాశాలు.. వ్యాపారంలో పురోగతి!
Recommended image2
Weekly Horoscope: ఈ వారం 4 రాశుల వారికి విపరీతంగా కలిసివస్తుంది! మీది ఏ రాశి?
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత ఆలోచనలు కలసిరావు!
Related Stories
Recommended image1
Rare Yogam: ఏప్రిల్‌లో 5 సార్లు అరుదైన యోగం.. ఈ 5 రాశులవారికి పట్టిందల్లా బంగారమే!
Recommended image2
Shani Dosham: శని దోషంతో బాధపడుతున్నారా? ఈ 5 పనులు చేస్తే మీ సమస్యలు తీరడం పక్కా!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved