MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆకస్మిక ధనలాభం.. నిరుద్యోగులకు ఉద్యోగం!

Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆకస్మిక ధనలాభం.. నిరుద్యోగులకు ఉద్యోగం!

Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 30.09.2026 బుధవారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

2 Min read
Author : Kavitha G
Published : Sep 30 2026, 05:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
నేటి రాశి ఫలాలు
Image Credit : AI

నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
మేష రాశి ఫలాలు
Image Credit : Asianet News

మేష రాశి ఫలాలు

సన్నిహితులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు గతం కంటే పుంజుకుంటాయి. వృత్తి, ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. అధికారులతో చర్చలకు అనుకూల సమయం. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది.

313
వృషభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృషభ రాశి ఫలాలు

సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. నూతన వాహన యోగం ఉంది. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది.

413
మిథున రాశి ఫలాలు
Image Credit : Asianet News

మిథున రాశి ఫలాలు

ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. సన్నిహితులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

513
కర్కాటక రాశి ఫలాలు
Image Credit : Asianet News

కర్కాటక రాశి ఫలాలు

కొన్ని వ్యవహారాలు తలనొప్పి తెప్పిస్తాయి. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. బంధుమిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో మార్పులుంటాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి.

613
సింహ రాశి ఫలాలు
Image Credit : Asianet News

సింహ రాశి ఫలాలు

ఇంట్లో కొన్ని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి. నూతన వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్నిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి.

713
కన్య రాశి ఫలాలు
Image Credit : Asianet News

కన్య రాశి ఫలాలు

నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. చేపట్టిన పనులు శ్రమతో కానీ పూర్తి కావు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో సరైన టైంకి నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల నష్టాలు ఎదుర్కొంటారు.

813
తుల రాశి ఫలాలు
Image Credit : Asianet News

తుల రాశి ఫలాలు

వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. ఇంటా బయటా సఖ్యతగా వ్యవహరిస్తారు. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కీలక సమయంలో సన్నిహితులు సహాయం అందిస్తారు.

913
వృశ్చిక రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృశ్చిక రాశి ఫలాలు

కుటుంబ సభ్యులతో వివాదాలు తప్పవు. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇంటా బయటా చికాకులు అధికమవుతాయి. ఆలోచనల్లో నిలకడ లోపిస్తుంది. వ్యాపారాలలో భాగస్వాములతో భేదాభిప్రాయాలు కలుగుతాయి.

1013
ధనుస్సు రాశి ఫలాలు
Image Credit : Asianet News

ధనుస్సు రాశి ఫలాలు

ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో సమయానికి నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు. కొత్త పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు.

1113
మకర రాశి ఫలాలు
Image Credit : Asianet News

మకర రాశి ఫలాలు

దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి. ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. బంధు మిత్రులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు.

1213
కుంభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

కుంభ రాశి ఫలాలు

దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో అధికారులతో వివాదాలు తప్పవు. చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు.

1313
మీన రాశి ఫలాలు
Image Credit : Asianet News

మీన రాశి ఫలాలు

ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. దీర్ఘకాలిక అప్పులు తీర్చడానికి కొత్త అప్పులు చేస్తారు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగాలలో మార్పులుంటాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు తప్పవు. వృత్తి వ్యాపారాలలో ఎంత కష్టపడ్డా ఫలితం ఉండదు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి చాలాకాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు లభిస్తాయి!
Recommended image2
Birth Date: ఈ 4 తేదీల్లో పుట్టినవారు ఏ పని చేసినా త్వరగా సక్సెస్ అవుతారు!
Recommended image3
Zodiac Signs: ఈ రాశులవారికి 40 ఏళ్లు దాటాక రాజయోగం పడుతుంది, పట్టిందల్లా బంగారమే..!
Related Stories
Recommended image1
Birth Date: ఈ 4 తేదీల్లో పుట్టినవారు ఏ పని చేసినా త్వరగా సక్సెస్ అవుతారు!
Recommended image2
Money Vastu: ఎవరికైనా డబ్బులు ఇస్తున్నారా? ఈ వారాల్లో పొరపాటున కూడా ఇవ్వకూడదు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved