Today Rasi Phalalu: నేడు ఈ రాశివారు డబ్బు వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి!
Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 30.12.2025 మంగళవారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశి ఫలాలు
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
మేష రాశి ఫలాలు
వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి. కొత్త పనులు ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. డబ్బు వ్యవహారాలు కలిసివస్తాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగాలలో అధికారులతో చర్చలు సఫలం అవుతాయి.
వృషభ రాశి ఫలాలు
వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆప్తులతో విభేదాలు చికాకు కలిగిస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. రుణ ప్రయత్నాలు ఫలించవు. వృథా ఖర్చులు అధికమవుతాయి. చేపట్టిన వ్యవహారాలలో జాప్యం కలుగుతుంది.
మిథున రాశి ఫలాలు
సన్నిహితుల నుంచి విలువైన సమాచారం సేకరిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో పెద్దలతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. చిన్ననాటి మిత్రుల నుంచి డబ్బు సహాయం అందుతుంది.
కర్కాటక రాశి ఫలాలు
వ్యాపారాలలో స్థిరమైన ఆలోచనలు చేయలేక నష్టపోతారు. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం దక్కదు. మానసిక సమస్యలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో పరిస్థితులు ప్రతికూలంగా మారుతాయి. వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. రుణ భారం అధికమవుతుంది.
సింహ రాశి ఫలాలు
వృత్తి, వ్యాపారాలలో శ్రమ ఫలించి నూతన లాభాలు పొందుతారు. స్థిరాస్తి ఒప్పందాలు కలిసివస్తాయి. దీర్ఘకాలిక రుణాల బాధ తొలగుతుంది. ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు లాభసాటిగా సాగుతాయి. ప్రయాణాలలో నూతన వ్యక్తుల పరిచయాలు ఉత్సాహన్నిస్తాయి.
కన్య రాశి ఫలాలు
ముఖ్యమైన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. నిరుద్యోగులు నూతన అవకాశాలు పొందుతారు. మొండి బాకీలు వసూలవుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
తుల రాశి ఫలాలు
వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి. చేపట్టిన పనులు నత్తనడకన సాగుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. ఉద్యోగాలలో పనిభారం పెరుగుతుంది. డబ్బు వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది.
వృశ్చిక రాశి ఫలాలు
ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. అనవసర వస్తువులపై డబ్బు ఖర్చు చేస్తారు. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి.
ధనుస్సు రాశి ఫలాలు
వ్యాపారాల్లో అంచనాలు అందుకుంటారు. ఆత్మీయుల రాక ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగాలలో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వృత్తి, వ్యాపారాలలో భాగస్వాములతో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఆర్థికంగా ఆశించిన పురోగతి కలుగుతుంది.
మకర రాశి ఫలాలు
వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది. ఆప్తుల నుంచి ఆశించిన సహాయం అందుతుంది. ఆకస్మిక ధన వస్తు లాభాలు పొందుతారు.
కుంభ రాశి ఫలాలు
వ్యాపారాలు ఆశించిన రీతిలో లాభించవు. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. నిరుద్యోగులకు నిరాశ తప్పదు వృథా ఖర్చులు పెరుగుతాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది. సన్నిహితులతో డబ్బు వ్యవహారాలలో విభేదాలు కలుగుతాయి.
మీన రాశి ఫలాలు
బంధువులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు వస్తాయి. స్వల్ప ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఊహించని సమస్యలు తప్పవు. నూతన రుణాలు చేయాల్సి వస్తుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి.

