- Home
- Astrology
- Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు భార్యను విపరీతంగా ప్రేమిస్తారు.. కానీ బయటకు చెప్పరు!
Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు భార్యను విపరీతంగా ప్రేమిస్తారు.. కానీ బయటకు చెప్పరు!
కొంతమంది ప్రేమను మాటల్లో చూపిస్తారు. ఇంకొంతమంది చేతల్లో చూపిస్తారు. కొందరు భార్యను ప్రాణంగా ప్రేమించినా, ఆ ప్రేమను మాత్రం బయటకు చెప్పుకోరు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏ తేదీల్లో పుట్టినవారు భార్యపై ప్రేమ ఉన్నా.. బయటపెట్టరో ఇక్కడ తెలుసుకుందాం.

Birth Dates of Caring Husbands
జ్యోతిష్య శాస్త్రం, సంఖ్యా శాస్త్రం ప్రకారం జన్మ తేదీ.. మన స్వభావాన్ని, భావాలను వ్యక్తపరచే విధానాన్ని చాలా లోతుగా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా కొంతమంది పురుషులు.. భార్యను ప్రాణంగా ప్రేమించినా, ఆ ప్రేమను మాటలతో గానీ, చేతలతో గానీ బయటకు చెప్పలేని స్వభావం కలిగి ఉంటారు. వీరి ప్రేమ నిశ్శబ్దంగా ఉంటుంది. కానీ బలంగా ఉంటుంది. ఏ తేదీల్లో పుట్టినవారిలో ఈ లక్షణం ఎక్కువగా ఉంటుందో ఇక్కడ చూద్దాం.
ఏ నెలలో అయినా ఈ తేదీల్లో పుట్టినవారు..
సంఖ్యా శాస్త్రం ప్రకారం ఏ నెలలో అయినా 2, 4, 8, 11, 16, 20, 22, 26, 29 తేదీల్లో పుట్టినవారిలో ఈ లక్షణం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ తేదీల్లో పుట్టినవారు ప్రధానంగా చంద్రుడు, రాహు, శని ప్రభావంలో ఉంటారు. చంద్రుడు మనసుకు ప్రతీక అయితే, శని బాధ్యత, నిబద్ధతకు సూచిక. రాహు మాత్రం భావాలను లోపలే దాచుకునే స్వభావాన్ని ఇస్తాడు. అందుకే వీరు భార్యను ఎంతగా ప్రేమించినా వారితో తరచూ చెప్పరు. కానీ వారి ప్రేమ మాటల్లో కాదు, పనుల్లో కనిపిస్తుంది. భార్యకు ఏ అవసరం వచ్చినా ముందుండి చూసుకోవడం, కుటుంబ భవిష్యత్తు కోసం కష్టపడటం, ఆమెకు తెలియకుండానే ఆమె ఆనందం కోసం త్యాగాలు చేయడం వీరి ప్రేమకు నిజమైన రూపం.
2, 11 తేదీల్లో పుట్టినవారు
ఏ నెలలో అయినా 2, 11 తేదీలో పుట్టినవారు అత్యంత సున్నితమైన మనసు కలిగి ఉంటారు. భార్య బాధపడితే వీరి మనసు తట్టుకోలేదు. కానీ ఆ బాధను వారు బయటకు చూపించరు. భార్యకు భద్రత, మానసిక స్థిరత్వం ఇవ్వడమే తమ ప్రేమగా భావిస్తారు. వీరు ఎక్కువగా సైలెంట్ గా ఉండటం వల్ల భార్యకు కొన్నిసార్లు తనని పట్టించుకోవడం లేదనే సందేహం రావచ్చు. కానీ నిజానికి ఆమె ప్రతి చిన్న విషయాన్ని గమనించే వ్యక్తులు వీరే.
4, 8, 22 తేదీల్లో పుట్టినవారు
4, 8, 22 తేదీల్లో పుట్టినవారిపై శని ప్రభావం ఎక్కువగా ఉండటంతో చాలా గంభీరంగా కనిపిస్తారు. ప్రేమంటే బాధ్యతగా భావిస్తారు. భార్యను విలువైందిగా చూస్తారు. కానీ ప్రేమను ప్రదర్శించడం బలహీనతగా భావిస్తారు. వీరు రొమాంటిక్ మాటలు చెప్పకపోయినా, కుటుంబానికి ఎలాంటి లోటు లేకుండా చూసుకోవడంలో మాత్రం రాజీపడరు. భార్య ఆరోగ్యం, గౌరవం, భద్రత వీరికి అత్యంత ముఖ్యమైనవి. వీరి ప్రేమ బయటకు కనిపించకపోయినా, జీవితాంతం తోడుగా నిలబడుతుంది.
16, 20, 26, 29 తేదీల్లో పుట్టినవారు
ఏ నెలలో అయినా 16, 20, 26, 29 తేదీల్లో పుట్టినవారు అంతర్ముఖ స్వభావం కలవారు. వీరు లోతైన భావోద్వేగాలను కలిగి ఉంటారు. కానీ వ్యక్తపరచడంలో వెనుకడుగు వేస్తారు. భార్యపై కోపం వచ్చినా ఎక్కువగా మాట్లాడరు, కానీ లోపల ఆలోచిస్తూ బాధపడతారు. భార్యను దూరం చేసుకోవాలనే ఆలోచన వీరికి అస్సలు ఉండదు. ప్రేమను మాటలకంటే చేతల ద్వారా చూపించాలి అనుకుంటారు.
వీరి ప్రేమ ఎలా ఉంటుందంటే
సంఖ్యా శాస్త్రం ప్రకారం ఈ తేదీల్లో పుట్టిన పురుషుల ప్రేమ చాలా నమ్మకమైంది. వీరు మోసం చేయడం, రెండో ఆలోచనలు పెట్టుకోవడం చాలా అరుదు. భార్యను తమ జీవిత భాగస్వామిగా మాత్రమే కాదు, తమ బాధ్యతగా భావిస్తారు. అందుకే వీరి ప్రేమలో ఎక్కువ హడావుడి ఉండదు, కానీ స్థిరత్వం ఉంటుంది. భార్యకు కష్ట సమయం వచ్చినప్పుడు వీరు మాటలతో కాదు, చేతలతో అండగా నిలబడతారు.

