Today Rasi Phalalu: నేడు ఈ రాశులవారికి అదృష్టయోగం, పట్టిందల్లా బంగారమే!
Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 30.04.2026 గురువారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశి ఫలాలు
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
మేష రాశి ఫలాలు
దైవదర్శనాలు చేసుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. మిత్రులు, కుటుంబసభ్యుల నుంచి రుణ ఒత్తిడులు పెరుగుతాయి. ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.
వృషభ రాశి ఫలాలు
ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. ఇంటా బయటా బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. వ్యాపారాలలో భాగస్వాముల ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. ఉద్యోగాలలో ట్రాన్స్ ఫర్ సూచనలు ఉన్నాయి.
మిథున రాశి ఫలాలు
ముఖ్యమైన వ్యవహారాలలో ఆప్తుల సలహాలు తీసుకుంటారు. సమాజంలో పేరు కలిగిన వారితో పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక పురోగతి సాధిస్తారు.
కర్కాటక రాశి ఫలాలు
ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు పనికిరాదు. బంధుమిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి. చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది. దూర ప్రయాణాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. వృత్తి, ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వల్ల శారీరక శ్రమ పెరుగుతుంది.
సింహ రాశి ఫలాలు
సన్నిహితుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహన, భూ లాభాలు పొందుతారు. పాత బాకీలు వసూలవుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో ఆర్థిక పురోగతి కలుగుతుంది. ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి.
కన్య రాశి ఫలాలు
ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. చేపట్టిన పనులలో శ్రమ తప్పదు. సమయానికి చేతిలో డబ్బు ఉండదు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. దూర ప్రయాణాలలో అవాంతరాలు కలుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
తుల రాశి ఫలాలు
వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో అధికారులతో చర్చలు అనుకూలం. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధు మిత్రుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.
వృశ్చిక రాశి ఫలాలు
వృత్తి, వ్యాపారాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆప్తుల నుంచి అరుదైన ఆహ్వానాలు ఉంటాయి. అవసరానికి డబ్బు సహాయం లభిస్తుంది. నూతన వాహన సౌఖ్యం ఉంది. వ్యాపారాలు విస్తరిస్తాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.
ధనుస్సు రాశి ఫలాలు
ఇంటి విషయాల్లో స్వల్ప ఒత్తిడులు తప్పవు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ఆరోగ్యం మందగిస్తుంది. కొత్త అప్పులు చేస్తారు. ఊహించని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వ్యాపార, ఉద్యోగాలు కొంత నిరాశ కలిగిస్తాయి.
మకర రాశి ఫలాలు
విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతగా అనుకూలించవు. ముఖ్యమైన వ్యవహారాలలో అవరోధాలు కలుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి.
కుంభ రాశి ఫలాలు
ఇంటా బయటా ఆశ్చర్యం కలిగించే విషయాలు తెలుస్తాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత పురోగతి సాధిస్తారు.
మీన రాశి ఫలాలు
విలువైన వస్తు, వాహనాలు కొనుగోలు చేస్తారు. భూ వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. శుభకార్యాలకు ఆహ్వానాలు అందుకుంటారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. ఉద్యోగాలు అనుకూలం.

