MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Astrology
  • Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆకస్మిక ధన లాభం.. ఆస్తి వివాదాలు పరిష్కారం!

Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆకస్మిక ధన లాభం.. ఆస్తి వివాదాలు పరిష్కారం!

Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 03.05.2026 ఆదివారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

2 Min read
Author : Kavitha G
Published : May 03 2026, 05:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
నేటి రాశి ఫలాలు
Image Credit : AI

నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
మేష రాశి ఫలాలు
Image Credit : Asianet News

మేష రాశి ఫలాలు

కుటుంబ సభ్యులతో శుభకార్యాల గురించి చర్చిస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

Related Articles

Related image1
Zodiac Signs: ఈ 4 రాశుల అమ్మాయిలు చాలా ఈజీగా ప్రేమలో పడిపోతారు.. అబ్బాయిలు చూస్కోండి!
Related image2
May Horoscope 2026: 12 రాశుల్లో మే నెల ఏ రాశివారికి అనుకూలంగా ఉందో తెలుసా?
313
వృషభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృషభ రాశి ఫలాలు

వృత్తి, వ్యాపారాలలో సొంత ఆలోచనలు కలిసిరావు. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగులు అధికారుల ఆగ్రహానికి గురికావల్సి వస్తుంది. చేపట్టిన పనులు మధ్యలో నిలిచి పోతాయి. సంతాన ఆరోగ్యం విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆర్థికంగా అనుకూలం.

413
మిథున రాశి ఫలాలు
Image Credit : Asianet News

మిథున రాశి ఫలాలు

ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. చేపట్టిన పనులలో జాప్యం తప్పదు. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఇంట్లో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వల్ల తగిన విశ్రాంతి ఉండదు. సంతానం విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది.

513
కర్కాటక రాశి ఫలాలు
Image Credit : Asianet News

కర్కాటక రాశి ఫలాలు

బంధు మిత్రులతో సంతోషంగా గడుపుతారు. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలలో మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు.

613
సింహ రాశి ఫలాలు
Image Credit : Asianet News

సింహ రాశి ఫలాలు

చేపట్టిన పనులు మందగిస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఇంటా బయటా చికాకులు పెరుగుతాయి. ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో అదనపు పనిభారం ఉంటుంది.

713
కన్య రాశి ఫలాలు
Image Credit : Asianet News

కన్య రాశి ఫలాలు

చేపట్టిన వ్యవహారాలలో ఆకస్మికంగా విజయం సాధిస్తారు. బంధు మిత్రులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. దీర్ఘకాలిక రుణ సమస్యల నుంచి బయటపడతారు. వృత్తి, ఉద్యోగాలలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.

813
తుల రాశి ఫలాలు
Image Credit : Asianet News

తుల రాశి ఫలాలు

దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం దక్కదు. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు. వృథా ఖర్చులు పెరుగుతాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. వృత్తి, ఉద్యోగాలు సాధారణం. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

913
వృశ్చిక రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృశ్చిక రాశి ఫలాలు

కుటుంబ సభ్యులతో దీర్ఘకాలిక వివాదాలు పరిష్కారమవుతాయి. నూతన వ్యక్తుల పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఉంటాయి. చేపట్టిన వ్యవహారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి.

1013
ధనుస్సు రాశి ఫలాలు
Image Credit : Asianet News

ధనుస్సు రాశి ఫలాలు

స్థిరాస్తి క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు. నిరుద్యోగులకు చాలాకాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది.

1113
మకర రాశి ఫలాలు
Image Credit : Asianet News

మకర రాశి ఫలాలు

బంధువులతో అకారణంగా మాటపట్టింపులు కలుగుతాయి. వృథా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయటం మంచిది. వ్యాపార వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకొని నష్టాలు ఎదుర్కొంటారు. చేపట్టిన పనులు శ్రమతో కానీ పూర్తికావు. ఉద్యోగాలలో గంధరగోళ పరిస్థితులు ఉంటాయి.

1213
కుంభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

కుంభ రాశి ఫలాలు

ఆర్థికంగా ఒడిదుడుకులు అధికం అవుతాయి. ఇంటా బయటా బాధ్యతలు మరింత చికాకు కలిగిస్తాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. సన్నిహితులతో కొన్ని వ్యవహారాలలో మాట పట్టింపులు వస్తాయి. నిరుద్యోగుల యత్నాలు ముందుకు సాగక నిరాశ కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప నష్ట సూచనలు ఉన్నాయి.

1313
మీన రాశి ఫలాలు
Image Credit : Asianet News

మీన రాశి ఫలాలు

మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Venus Transit: రాహువు నక్షత్రంలోకి శుక్రుడు.. ఈ 4 రాశులవారికి బ్యాడ్ టైమ్ స్టార్ట్!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి డబ్బు వ్యవహారాలలో జాగ్రత్త అవసరం!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆకస్మిక నిర్ణయాల వల్ల నష్టాలు తప్పవు!
Related Stories
Recommended image1
Zodiac Signs: ఈ 4 రాశుల అమ్మాయిలు చాలా ఈజీగా ప్రేమలో పడిపోతారు.. అబ్బాయిలు చూస్కోండి!
Recommended image2
May Horoscope 2026: 12 రాశుల్లో మే నెల ఏ రాశివారికి అనుకూలంగా ఉందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved