Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి చాలాకాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు లభిస్తాయి!
Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 29.09.2026 మంగళవారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశి ఫలాలు
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
మేష రాశి ఫలాలు
వృత్తి, వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. నూతన వ్యక్తుల పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలు మరింత అనుకూలంగా సాగుతాయి. రాజకీయ వర్గాల వారి నుంచి ఊహించని ఆహ్వానాలు అందుతాయి.
వృషభ రాశి ఫలాలు
స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి. బంధుమిత్రులతో చిన్నపాటి వివాదాలు తప్పవు. చేపట్టిన పనుల్లో అవాంతరాలు ఉంటాయి. వ్యాపార, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు వల్ల అప్పులు చేస్తారు. ఆరోగ్యం విషయంలో వైద్య సంప్రదింపులు చేయాల్సి వస్తుంది.
మిథున రాశి ఫలాలు
దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులు ముందుకు సాగక చికాకులు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి. బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఆస్తి వ్యవహారంలో పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది.
కర్కాటక రాశి ఫలాలు
భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. అధికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి డబ్బు సహాయం అందుతుంది. చేపట్టిన వ్యవహారాలు సానుకూలమవుతాయి.
సింహ రాశి ఫలాలు
ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఇతరులపై మీ అభిప్రాయాన్ని మార్చుకోవడం మంచిది. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.
కన్య రాశి ఫలాలు
చిన్ననాటి విషయాలు గుర్తుకువస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో మరింత పురోగతి సాధిస్తారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. బంధువుల రాక ఆనందం కలిగిస్తుంది. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.
తుల రాశి ఫలాలు
ఆధ్యాత్మక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి. చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమతో కానీ కొన్ని పనులు పూర్తి కావు.
వృశ్చిక రాశి ఫలాలు
వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. కొత్త విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ఆకస్మిక ధన, వస్తు లాభాలు పొందుతారు. దాయాదులతో భూ వివాదాలు పరిష్కారమవుతాయి. చిన్ననాటి మిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు.
ధనుస్సు రాశి ఫలాలు
చిన్ననాటి మిత్రుల కలయిక సంతోషాన్నిస్తుంది. వ్యాపార, ఉద్యోగాలు మరింత మెరుగ్గా ఉంటాయి. అనుకున్న పనులు అనుకున్న టైంకి పూర్తి చేస్తారు. ప్రయాణాల్లో కొత్త పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. నిరుద్యోగులకు చాలాకాలంగా ఎదురు చూస్తున్న అవకాశాలు లభిస్తాయి.
మకర రాశి ఫలాలు
ముఖ్యమైన పనులు మందగిస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. ఆరోగ్యం విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపార, ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి.
కుంభ రాశి ఫలాలు
ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వ్యాపార పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. ఇంటా బయటా కొందరి మాటలు మానసికంగా బాధిస్తాయి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి.
మీన రాశి ఫలాలు
ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. సన్నిహితులతో వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. శుభకార్యాల కోసం ఖర్చులు చేస్తారు.

