Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి చాలాకాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు వస్తాయి!
Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 29.11.2026 ఆదివారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశి ఫలాలు
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
మేష రాశి ఫలాలు
బంధు మిత్రుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. వృత్తి, వ్యాపారాలు ఆశించిన స్థాయిలో ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి.
వృషభ రాశి ఫలాలు
కుటుంబ సభ్యుల ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. ముఖ్యమైన పనులలో అవరోధాలు కలుగుతాయి. వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలలో అధికారుల నుంచి సమస్యలు తప్పవు. మిత్రులతో కలహా సూచనలు ఉన్నాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి.
మిథున రాశి ఫలాలు
నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలలో ఇబ్బందులు అధిగమించి లాభాలు అందుకుంటారు. చిన్ననాటి మిత్రులతో పాత జ్ఞాపకాలు పంచుకుంటారు. నిరుద్యోగుల ప్రయత్నాలు కలసివస్తాయి.
కర్కాటక రాశి ఫలాలు
ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. నిరుద్యోగులకు చాలాకాలంగా ఎదురు చూస్తున్న అవకాశాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సన్నిహితుల నుంచి కీలక విషయాలు తెలుస్తాయి.
సింహ రాశి ఫలాలు
ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. దూర ప్రయాణాలు వాయిదా పడుతాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తప్పవు. వ్యాపారాలు కొంత మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో మార్పులుంటాయి. ఇంటా బయటా సమస్యలు చికాకు పరుస్తాయి. దైవ సంబంధిత కార్యక్రమాలలో ఆసక్తిగా పాల్గొంటారు.
కన్య రాశి ఫలాలు
కుటుంబ సభ్యులతో మాటపట్టింపులుంటాయి. ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు కలుగుతాయి. సంతాన విద్యా విషయాలలో కొంత శ్రద్ధ వహించాలి.
తుల రాశి ఫలాలు
రాజకీయ సభా సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు. సంతాన శుభకార్యాల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఆర్థికంగా పురోగతి కలుగుతుంది. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి.
వృశ్చిక రాశి ఫలాలు
వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. మిత్రుల నుంచి విందు వినోదాది కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనుల్లో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు.
ధనుస్సు రాశి ఫలాలు
పుణ్యక్షేత్రాల దర్శనం చేసుకుంటారు. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. దూరప్రయాణాలలో అవరోధాలు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధికమవుతాయి. బంధు మిత్రుల నుంచి ఊహించని మాటలు వినాల్సి వస్తుంది.
మకర రాశి ఫలాలు
డబ్బు సంబంధిత వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టాలు తప్పవు. నిరుద్యోగుల ప్రయత్నాలు మందగిస్తాయి. బంధు మిత్రులతో కీలక వ్యవహారాల గురించి చర్చిస్తారు.
కుంభ రాశి ఫలాలు
ఆదాయ మార్గాలు పెరుగుతాయి. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో అదనపు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. దైవ సేవా కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభిస్తాయి.
మీన రాశి ఫలాలు
దాయాదులతో ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. గృహ నిర్మాణ పనులు వాయిదా వేస్తారు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. దైవ చింతన పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో శ్రమ అధికమవుతుంది.











