MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Astrology
  • Today Rasi Phalalu: ఈ రాశుల వారు జీవిత భాగస్వామి విషయంలో జాగ్రత్తగా ఉండాలి!

Today Rasi Phalalu: ఈ రాశుల వారు జీవిత భాగస్వామి విషయంలో జాగ్రత్తగా ఉండాలి!

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 23.05.2025 శుక్రవారానికి సంబంధించినవి.

2 Min read
Author : Kavitha G
Published : May 23 2025, 05:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
మేష రాశి ఫలాలు
Image Credit : Asianet News

మేష రాశి ఫలాలు

చేపట్టిన పనుల్లో శ్రమకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాట పడతాయి. సన్నిహితుల నుంచి కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఉద్యోగంలో అనుకూలత పెరుగుతుంది. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212
వృషభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృషభ రాశి ఫలాలు

ప్రముఖుల నుంచి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. బంధు మిత్రుల రాకతో ఇంట్లో సందడి వాతావరణం ఉంటుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. స్థిరాస్తి వృద్ధి చెందుతుంది. వృత్తి, వ్యాపారాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. నిరుద్యోగులకు అనుకూలం. 

312
మిథున రాశి ఫలాలు
Image Credit : Asianet News

మిథున రాశి ఫలాలు

బంధువులతో కొన్ని విషయాల్లో మాట పట్టింపులు వస్తాయి. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. కీలక వ్యవహారాల్లో అవాంతరాలు వస్తాయి. వృథా ఖర్చులు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగులు అధికారుల ఆగ్రహానికి గురవుతారు. రుణ ప్రయత్నాలు కలిసిరావు.

412
కర్కాటక రాశి ఫలాలు
Image Credit : Asianet News

కర్కాటక రాశి ఫలాలు

దూర ప్రయాణాల్లో ఇబ్బందులు వస్తాయి. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి.

512
సింహ రాశి ఫలాలు
Image Credit : Asianet News

సింహ రాశి ఫలాలు

పాత మిత్రుల సహాయంతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. పిల్లల చదువు, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాల్లో సొంత నిర్ణయాలు తీసుకోవడం మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు.

612
కన్య రాశి ఫలాలు
Image Credit : Asianet News

కన్య రాశి ఫలాలు

చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో పెట్టుబడులు సకాలంలో అందవు. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగాల్లో ఇతరులతో ఊహించని వివాదాలు వస్తాయి. కొత్త అప్పులు చేయకపోవడం మంచిది.

712
తుల రాశి ఫలాలు
Image Credit : Asianet News

తుల రాశి ఫలాలు

చేపట్టిన పనుల్లో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. కొన్ని వ్యవహారాల్లో ఆప్తుల సలహాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగులు శుభవార్తలు వింటారు. స్థిరాస్తి క్రయ విక్రయాల్లో లాభాలు అందుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.

812
వృశ్చిక రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృశ్చిక రాశి ఫలాలు

దైవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో నష్టాలు వస్తాయి. చేపట్టిన పనుల్లో అవరోధాలు కలిగిన సకాలంలో పూర్తిచేస్తారు. ఇంటా బయట పని ఒత్తిడి పెరుగుతుంది. జీవిత భాగస్వామి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వ వ్యవహారాల్లో విమర్శలు ఎదురవుతాయి.

912
ధనుస్సు రాశి ఫలాలు
Image Credit : Asianet News

ధనుస్సు రాశి ఫలాలు

ఆర్థికంగా గందరగోళ పరిస్థితులుంటాయి. బంధు మిత్రుల ఆదరణ పెరుగుతుంది. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులు పనితీరుతో అందరిని ఆకట్టుకుంటారు.

1012
మకర రాశి ఫలాలు
Image Credit : Asianet News

మకర రాశి ఫలాలు

సోదరులతో వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. వ్యాపార, ఉద్యోగాల్లో సమస్యలను అధిగమించి దైర్యంగా ముందుకు సాగుతారు. చాలకాలంగా పూర్తి కానీ పనులు పూర్తవుతాయి. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

1112
కుంభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

కుంభ రాశి ఫలాలు

నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి. ఉద్యోగాల్లో బాధ్యతలు పెరుగుతాయి. కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. మిత్రులతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి కాక నిరాశ కలుగుతుంది.

1212
మీన రాశి ఫలాలు
Image Credit : Asianet News

మీన రాశి ఫలాలు

కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. దూర ప్రయాణాలు ఆకస్మికంగా వాయిదా పడుతాయి. వృత్తి ఉద్యోగాల్లో తోటివారి ప్రవర్తన బాధ కలిగిస్తుంది. నూతన వ్యాపారాల ప్రారంభానికి చేసే ప్రయత్నాలు విఫలం అవుతాయి.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac signs: ఈ రాశుల అబ్బాయిలు.. తమ భార్యలను ప్రతి నిమిషం అనుమానిస్తారు..!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి నూతన గృహ, వాహన యోగం.. అనుకూల ఫలితాలు!
Related Stories
Recommended image1
Zodiac Signs: ఈ 5 రాశులపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎక్కువ.. వీరికి డబ్బు కష్టాలు ఉండవు!
Recommended image2
Zodiac Signs: ఈ 4 రాశుల అమ్మాయిలకి మంచి భర్తలు వస్తారు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved