MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి

Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి

Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 23.03.2026 సోమవారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు.  

2 Min read
Author : Haritha Chappa
Published : Mar 23 2026, 05:35 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
మేష రాశి
Image Credit : Asianet News

మేష రాశి

మేష రాశి వారికి పెద్ద పేరున్న వ్యక్తుల నుంచి ప్రోత్సాహం అందుతుంది. అప్పు ఇచ్చిన వారి నుండి డబ్బును తిరిగి పొందే అవకాశం ఉంది. స్నేహితులతో మంచి సమయాన్ని గడుపుతారు. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

212
వృషభ రాశి
Image Credit : Asianet News

వృషభ రాశి

వృషభ రాశి వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. సహాయ సహకారాలు అందుతాయి. కాకపోతే అనుకున్న పనులు ఏవీ సఫలం కావు. కాస్త టెన్షన్ వాతావరణమే ఉంటుంది. ధ్యానం చేస్తే ఎంతో మంచిది.

Related Articles

Related image1
Kitchen Vastu: వంటగదిలో చెప్పులేసుకుని వంట చేస్తే జరిగే అనర్థాలు ఇవే
Related image2
Zodiac Signs: ఈ 4 రాశులలో పుట్టిన అమ్మాయిలు గయ్యాళి గంపలు, వీరితో పెట్టుకుంటే అంతే
312
మిథున రాశి
Image Credit : Asianet News

మిథున రాశి

దీర్ఘకాల ప్రయోజనాల కోసం స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్లలో పొదుపు చేస్తే మంచిది. దూర ప్రాంతాల నుండి అనుకోని వార్త అందే అవకాశం ఉంటుంది. అది మీలో ఉద్వేగాన్ని కలిగించవచ్చు. ఈరోజు మీరు ఆనందంగా ఉంటారు. మీ జీవిత భాగస్వామి మీకు స్పెషల్ సమయాన్ని కేటాయిస్తారు.

412
కర్కాటక రాశి
Image Credit : Asianet News

కర్కాటక రాశి

అనారోగ్యం కాస్త తగ్గుతుంది. ఇంటికి సంబంధించిన వస్తువులు ఖరీదైనవి కొంటారు. దీని వల్ల ఇబ్బంది పడతారు. కుటుంబ సభ్యులతో కొంతసేపు రిలాక్స్ అయ్యేలా గడపడం మంచిది. మీ జీవిత భాగస్వామితో మీరు ఆనందంగా గడుపుతారు.

512
సింహ రాశి
Image Credit : Asianet News

సింహ రాశి

ఈరోజు సింహ రాశి వారికి సంతోషకరమైన క్షణాలు వస్తాయి. పెట్టుబడుల నుంచి భవిష్యత్తు గురించి రహస్యంగా ఉంచితేనే మంచిది. మీ స్నేహితులు మంచి సలహాలను అందిస్తారు. కాకపోతే స్నేహితులతో కలిసి సమయాన్ని వృధా చేస్తారు.

612
కన్యా రాశి
Image Credit : Asianet News

కన్యా రాశి

కన్య రాశి వారి కుటుంబంతో గడుపుతూ ఉన్నా కూడా ఒంటరిగానే మిగిలిపోయిన భావనలో ఉంటారు. ఖర్చులు భయపెడుతూ ఉంటాయి. ఈ రాశికి చెందిన విద్యార్థులు టీవీలు, ఫోన్లు చూస్తూ సమయాన్ని వృధా చేస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది.

712
తులా రాశి
Image Credit : Asianet News

తులా రాశి

తులా రాశి వారికి సంకల్ప బలం ఎక్కువ. ఎటువంటి పరిస్థితులను ఈరోజు బయటపడి ప్రశంసలు పొందుతారు. ఒక ఉద్యోగ భరితమైన నిర్ణయం తీసుకొని సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బులు పొదుపు చేయాలనే ఆలోచన వస్తుంది. మీరు ఎంతో ఆనందంగా ఎంజాయ్ చేస్తారు ఈరోజు.

812
వృశ్చిక రాశి
Image Credit : Asianet News

వృశ్చిక రాశి

ఈ రాశి వారు తమ పిల్లల నుండి ఆర్థిక ప్రయోజాలను అందుకుంటారు. అందుకే ఆనందంగా ఉంటారు. ఏ రహస్య సమాచారాన్ని బయట పెట్టకుండా జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. పని ఒత్తిడి మీ వైవాహిక జీవితాన్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఈ రోజు ఆ ఒత్తిడి నుంచి మీరు బయటపడవచ్చు కూడా.

912
ధనస్సు రాశి
Image Credit : Asianet News

ధనస్సు రాశి

ధనస్సు రాశి వారు అతిగా ఖర్చులు పెట్టడాన్ని అదుపు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీకు ఇష్టమైన వారు మీ మీద అసహనాన్ని చూపిస్తారు. కోపం ప్రదర్శిస్తారు. మీరు అవసరమైన పనులు మళ్లీ మళ్లీ చేస్తూ సమయాన్ని వృధా చేస్తారు. కానీ మీరు చేసే పనికి ప్రశంసలు మాత్రం దక్కుతాయి.

1012
మకర రాశి
Image Credit : Asianet News

మకర రాశి

మకర రాశి వారు తమ అభిప్రాయాలను ధైర్యంగా బయటికి చెప్పాలి. మీరు ఆత్మవిశ్వాస లోపాన్ని అధిగమించాలి. లేకుంటే ఇది అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుంది. ఈరోజు డబ్బు సంబంధిత సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారు ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటే అనుకూలమైన ఫలితాలు వచ్చే రోజు ఇది.

1112
కుంభ రాశి
Image Credit : Asianet News

కుంభ రాశి

మిమ్మల్ని ఇబ్బంది పెట్టే భావోద్వేగాలను, కోరికలను అదుపులో ఉంచుకోవాలి. ఇంటి గురించి ఆలోచించి ఖర్చులు చేసుకోవాలి. ఈరోజు మీరు అన్ని పనులను పక్కనపెట్టి మీ జీవిత భాగస్వామితో సమయాన్ని గడుపుతారు.

1212
మీన రాశి
Image Credit : Asianet News

మీన రాశి

మీన రాశి వారు అనవసరంగా తమపై తాము నిందలు వేసుకోకూడదు. మనసులో ఉన్న సమస్యలన్నింటినీ బయటకు తోసేయండి. పని పైనే ధ్యాస పెట్టాలి. అయితే సహోద్యోగులతో ఉండేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఏషియానెట్ న్యూస్
ఆధ్యాత్మిక విషయాలు
Latest Videos
Recommended Stories
Recommended image1
AI Horoscope: ఓ రాశివారికి ఉద్యోగంలో ప్రమోషన్ గ్యారెంటీ
Recommended image2
Zodiac Signs: ఈ 4 రాశులలో పుట్టిన అమ్మాయిలు గయ్యాళి గంపలు, వీరితో పెట్టుకుంటే అంతే
Recommended image3
Kitchen Vastu: వంటగదిలో చెప్పులేసుకుని వంట చేస్తే జరిగే అనర్థాలు ఇవే
Related Stories
Recommended image1
Kitchen Vastu: వంటగదిలో చెప్పులేసుకుని వంట చేస్తే జరిగే అనర్థాలు ఇవే
Recommended image2
Zodiac Signs: ఈ 4 రాశులలో పుట్టిన అమ్మాయిలు గయ్యాళి గంపలు, వీరితో పెట్టుకుంటే అంతే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved