MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Astrology
  • Today Rasi Phalalu: ఈ రాశివారు స్త్రీ సంబంధ విషయాల్లో జాగ్రత్తగా లేకపోతే నష్టాలు తప్పవు!

Today Rasi Phalalu: ఈ రాశివారు స్త్రీ సంబంధ విషయాల్లో జాగ్రత్తగా లేకపోతే నష్టాలు తప్పవు!

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 23.06.2025 సోమవారానికి సంబంధించినవి.

3 Min read
Author : Kavitha G
Published : Jun 23 2025, 05:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
మేష రాశి ఫలాలు
Image Credit : Asianet News

మేష రాశి ఫలాలు

మేషరాశి వారు ముఖ్యమైన పత్రాల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో డాక్టర్ ను సంప్రదించాల్సి వస్తుంది. ఈ రాశి వారికి ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి.  దైవ సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు. ఉద్యోగాలు కొంత మందకొడిగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. నిరుద్యోగ ప్రయత్నాలు పెద్దగా కలిసిరావు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212
వృషభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృషభ రాశి ఫలాలు

వృషభ రాశివారు వృత్తి, ఉద్యోగాల్లో అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత చికాకు కలిగిస్తుంది. ఈ రాశివారు దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తికావు. దానివల్ల కొంత నిరాశ కలుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు కూడా నిరుత్సాహపరుస్తాయి. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయటం అస్సలు మంచిది కాదు. బంధుమిత్రులతో వివాదాలు అయ్యే అవకాశం ఉంది.

312
మిథున రాశి ఫలాలు
Image Credit : Asianet News

మిథున రాశి ఫలాలు

మిథున రాశివారు స్త్రీ సంబంధ వ్యవహారాల్లో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ రాశి వారికి కొత్త విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. బంధు మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. ఇంటి వాతావరణం సందడిగా ఉంటుంది. వ్యాపారులకు అధికారులతో వివాదాలు కలగుతాయి. ఈ రాశివారికి వృత్తి, ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆదాయ మార్గాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

412
కర్కాటక రాశి ఫలాలు
Image Credit : Asianet News

కర్కాటక రాశి ఫలాలు

కర్కాటక రాశివారికి శత్రువులు కూడా మిత్రులుగా మారి.. సహాయ సహకారాలు అందిస్తారు. మొండి బాకీలు వసూలు అవుతాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఈ రాశివారికి సమాజంలోకి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. ఈ రాశివారికి వ్యాపారాలు లాభాలు కురిపిస్తాయి. నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. 

512
సింహ రాశి ఫలాలు
Image Credit : Asianet News

సింహ రాశి ఫలాలు

సింహ రాశివారు దైవ సేవా కార్యక్రమాలకు డబ్బు ఖర్చు చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఈ రాశివారు చిన్ననాటి మిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వ్యాపారాల్లో నూతన పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేయటం మంచిది. ఉద్యోగులకు కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.  

612
కన్య రాశి ఫలాలు
Image Credit : Asianet News

కన్య రాశి ఫలాలు

కన్య రాశివారికి దైవ సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. పని ఒత్తిడి పెరుగుతుంది. సమయానికి నిద్రాహారాలు ఉండవు. ఈ రాశివారు ఇతరులకు డబ్బు ఇచ్చే విషయంలో కొంత ఆలోచించి ముందుకు సాగడం మంచిది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. వ్యాపార విస్తరణకు తీసుకునే నిర్ణయాలు కొంత వ్యతిరేక ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగం విషయంలో అధికారులతో జాగ్రత్తగా ఉండాలి.

712
తుల రాశి ఫలాలు
Image Credit : Asianet News

తుల రాశి ఫలాలు

తుల రాశి వారికి ఇంటా బయట మీ మాటకు విలువ తగ్గుతుంది. జీవిత భాగస్వామితో మాటపట్టింపులు ఉంటాయి. ఈ రాశివారు నూతన కార్యక్రమాలు ప్రారంభించక పోవడం మంచిది. అన్నదమ్ములతో స్వల్ప వివాదాలు ఉంటాయి. వ్యాపార వ్యవహారాలు కొంత నిదానంగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. నిరుద్యోగ ప్రయత్నాలు సాధారణంగా సాగుతాయి.

812
వృశ్చిక రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృశ్చిక రాశి ఫలాలు

వృశ్చిక రాశివారు వృథా ఖర్చుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. కంటి సంబంధిత అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. దైవ చింతన పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులతో చర్చలు ఫలించవు. నిరుద్యోగ ప్రయత్నాలు కొంత మందకొడిగా సాగుతాయి. కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది. అనుకున్న టైంకి పనులు పూర్తికాక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

912
ధనుస్సు రాశి ఫలాలు
Image Credit : Asianet News

ధనుస్సు రాశి ఫలాలు

ధనుస్సు రాశి వారికి కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. వ్యాపారాల్లో నూతన లాభాలు అందుతాయి. నిరుద్యోగులకు అధికారుల అండదండలతో నూతన అవకాశాలు దక్కుతాయి. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది.

1012
మకర రాశి ఫలాలు
Image Credit : Asianet News

మకర రాశి ఫలాలు

మకర రాశివారికి నేడు(సోమవారం) అంతగా కలిసిరాకపోవచ్చు. డబ్బు పరంగా ఒడిదుడుకులు అధికమవుతాయి. దీర్ఘకాలిక రుణాల ఒత్తిడి పెరుగుతుంది. ఏ పని సరిగ్గా చేయలేరు. ప్రశాంతత ఉండదు. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులతో సమస్యలు ఎదురవుతాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన రుణాలు చేయకపోవడం మంచిది.

1112
కుంభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

కుంభ రాశి ఫలాలు

కుంభ రాశివారు రాజకీయ వర్గాల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. మిత్రుల నుంచి ఆశించిన ధన సహాయం అందుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఈ రాశివారికి ఉద్యోగంలో ఆశించిన మార్పులు ఉంటాయి. కుటుంబ సమస్యలు రాజీ చేసుకుంటారు. పాజిటివ్ గా ఉండేందుకు ప్రయత్నించడం మంచిది.

1212
మీన రాశి ఫలాలు
Image Credit : Asianet News

మీన రాశి ఫలాలు

మీన రాశివారు ప్రయాణాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. వ్యాపారాల్లో నూతన ప్రణాళికలు అమలు చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమతో గానీ పనులు పూర్తికావు. నిరుద్యోగులకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఉద్యోగంలో తోటివారితో వివాదాలకు దూరంగా ఉండాలి. ఆర్ధిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. 

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
ఆధ్యాత్మిక విషయాలు
రాశి ఫలాలు
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac signs: ఈ రాశుల అబ్బాయిలు.. తమ భార్యలను ప్రతి నిమిషం అనుమానిస్తారు..!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి నూతన గృహ, వాహన యోగం.. అనుకూల ఫలితాలు!
Related Stories
Recommended image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారు రాత్రికి రాత్రే ధనవంతులవుతారు!
Recommended image2
Birth Date: ఈ 3 తేదీల్లో పుట్టినవారు రెండో పెళ్లి చేసుకునే అవకాశాలు ఎక్కువ!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved