MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి సన్నిహితుల నుంచి ఊహించని డబ్బు సహాయం అందుతుంది!

Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి సన్నిహితుల నుంచి ఊహించని డబ్బు సహాయం అందుతుంది!

Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 23.04.2026 గురువారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. 

2 Min read
Author : Kavitha G
Published : Apr 23 2026, 05:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
నేటి రాశి ఫలాలు
Image Credit : AI

నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

213
మేష రాశి ఫలాలు
Image Credit : Asianet News

మేష రాశి ఫలాలు

చేపట్టిన పనులు నిదానంగా పూర్తిచేస్తారు. దైవ చింతన పెరుగుతుంది. బంధు మిత్రులతో సందడిగా గడుపుతారు. ఇంటా బయటా కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ఉద్యోగాలలో పై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.

Related Articles

Related image1
May Astrology Predictions: మే నెలలో అదృష్టం అంతా ఈ 5 రాశులదే.. మట్టిని ముట్టినా బంగారమే!
Related image2
Vastu Tips For Morning: ఉదయం నిద్ర లేవగానే అస్సలు చేయకూడని 5 పనులు ఇవే!
313
వృషభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృషభ రాశి ఫలాలు

వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వ్యాపార వ్యవహారాలలో సొంత ఆలోచనతో ముందుకు సాగడం మంచిది. చేపట్టిన పనులు వాయిదా వేయడం మంచిది. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఉద్యోగాలలో పనిభారం తప్పదు. విద్యార్థుల శ్రమకు తగిన ఫలితం కనిపించదు.

413
మిథున రాశి ఫలాలు
Image Credit : Asianet News

మిథున రాశి ఫలాలు

చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. సన్నిహితుల నుంచి ఊహించని డబ్బు సహాయం అందుతుంది. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కలిసివస్తాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి.

513
కర్కాటక రాశి ఫలాలు
Image Credit : Asianet News

కర్కాటక రాశి ఫలాలు

ఆర్థికంగా పురోగతి ఉంటుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. చేపట్టిన వ్యవహారాలు అప్రయత్నంగా పూర్తవుతాయి. ఇంటా బయటా అనుకూల పరిస్థితులు ఉంటాయి. వ్యాపారాలలో ఆశించిన అభివృద్ధి కలుగుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి.

613
సింహ రాశి ఫలాలు
Image Credit : Asianet News

సింహ రాశి ఫలాలు

ఆదాయం విషయంలో నిరాశ తప్పదు. ఉద్యోగాలలో చిన్నపాటి వివాదాలుంటాయి. వృత్తి, వ్యాపారాలలో కొత్త సమస్యలు ఎదురవుతాయి. చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

713
కన్య రాశి ఫలాలు
Image Credit : Asianet News

కన్య రాశి ఫలాలు

నూతన రుణ ప్రయత్నాలు కొంతవరకు కలిసివస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో ఆకస్మిక ట్రాన్స్ ఫర్ లు ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అధిగమించి ముందుకు సాగుతారు. బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు.

813
తుల రాశి ఫలాలు
Image Credit : Asianet News

తుల రాశి ఫలాలు

కుటుంబ సభ్యుల నుంచి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. పాతమిత్రుల కలయిక సంతోషం కలిగిస్తుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

913
వృశ్చిక రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృశ్చిక రాశి ఫలాలు

ఆప్తులతో సఖ్యతగా వ్యవహారిస్తారు. నూతన వస్త్రాభరణాలను కొనుగోలు చేస్తారు. బంధు మిత్రుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. నూతన ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

1013
ధనుస్సు రాశి ఫలాలు
Image Credit : Asianet News

ధనుస్సు రాశి ఫలాలు

మానసిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ సభ్యులతో ఊహించని కలహాలు కలుగుతాయి. దూర ప్రయాణాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధికమవుతాయి.

1113
మకర రాశి ఫలాలు
Image Credit : Asianet News

మకర రాశి ఫలాలు

ఆప్తుల నుంచి అందిన సమాచారం మానసికంగా బాధిస్తుంది. దూర ప్రయాణాలలో శ్రమ పెరుగుతుంది. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. పాత రుణాలు తీర్చడానికి కొత్త అప్పులు చేస్తారు. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి.

1213
కుంభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

కుంభ రాశి ఫలాలు

ఆప్తులతో ఆనందంగా గడుపుతారు. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. భూ సంబంధిత క్రయవిక్రయాలలో ఊహించని లాభాలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా ఉంటుంది. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది.

1313
మీన రాశి ఫలాలు
Image Credit : Asianet News

మీన రాశి ఫలాలు

చుట్టు పక్కల వారితో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా వ్యవహారించాలి. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకొని నష్టపోతారు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Tulsi Plant: ఇంట్లో తులసి మొక్క ఉందా? పక్కన ఈ మొక్కలు ఉంటే మీకే నష్టం..!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు శాలరీ విషయంలో శుభవార్తలు వింటారు..!
Recommended image3
May Astrology Predictions: మే నెలలో అదృష్టం అంతా ఈ 5 రాశులదే.. మట్టిని ముట్టినా బంగారమే!
Related Stories
Recommended image1
May Astrology Predictions: మే నెలలో అదృష్టం అంతా ఈ 5 రాశులదే.. మట్టిని ముట్టినా బంగారమే!
Recommended image2
Vastu Tips For Morning: ఉదయం నిద్ర లేవగానే అస్సలు చేయకూడని 5 పనులు ఇవే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved