MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Today Rasi Phalalu: ఈ రాశి వారికి దాయాదులతో స్థిరాస్తి గొడవలు తప్పవు!

Today Rasi Phalalu: ఈ రాశి వారికి దాయాదులతో స్థిరాస్తి గొడవలు తప్పవు!

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 21.06.2025 శనివారానికి సంబంధించినవి.

3 Min read
Author : Kavitha G
Published : Jun 21 2025, 05:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
మేష రాశి ఫలాలు
Image Credit : Asianet News

మేష రాశి ఫలాలు

మేష రాశి వారికి ఉద్యోగంలో పని ఒత్తిడి పెరిగి విశ్రాంతి లభించదు. చేపట్టిన పనుల్లో అవరోధాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలు మరింత నిరాశ కలిగిస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. నిరుద్యోగులకు అంతగా కలిసిరాదు. కుటుంబ వాతావరణం గంధరగోళంగా ఉంటుంది.

212
వృషభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృషభ రాశి ఫలాలు

వృషభ రాశివారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. కొన్ని ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సలహాలు కలిసివస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఉద్యోగంలో వివాదాలు సర్దుమణుగుతాయి. ప్రశాంత వాతావరణం ఉంటుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. కుటుంబ వాతావరణం సందడిగా ఉంటుంది. 

Related Articles

Related image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారు రాత్రికి రాత్రే ధనవంతులవుతారు!
Related image2
Birth Date: ఈ 3 తేదీల్లో పుట్టినవారు రెండో పెళ్లి చేసుకునే అవకాశాలు ఎక్కువ!
312
మిథున రాశి ఫలాలు
Image Credit : Asianet News

మిథున రాశి ఫలాలు

మిథున రాశివారు కొన్ని ఆలోచనలను ఆచరణలో పెడతారు. ఇంట్లో పెళ్లి ప్రస్తావన వస్తుంది. బంధుమిత్రులు నుంచి శుభవార్తలు అందుతాయి. నూతన వస్తు, వాహన లాభాలు పొందుతారు. వృత్తి, వ్యాపారాల్లో ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

412
కర్కాటక రాశి ఫలాలు
Image Credit : Asianet News

కర్కాటక రాశి ఫలాలు

కర్కాటక రాశివారికి సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. ఆకస్మికంగా ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఈ రాశివారు ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు కూడా అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. దానివల్ల విశ్రాంతి ఉండదు. పిల్లల చదువు, ఉద్యోగం విషయాల్లో కొంత నిరుత్సాహం తప్పదు. వృథా ఖర్చులను అదుపు చేసుకోవడం మంచిది.

512
సింహ రాశి ఫలాలు
Image Credit : Asianet News

సింహ రాశి ఫలాలు

సింహ రాశివారు చేపట్టిన వ్యవహారాల్లో అవరోధాలు ఉంటాయి. బంధుమిత్రులతో మాట పట్టింపులుంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో మరింత ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం అస్సలు మంచిది కాదు. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. వారు మరింత కష్టపడాల్సి ఉంటుంది. కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది. 

612
కన్య రాశి ఫలాలు
Image Credit : Asianet News

కన్య రాశి ఫలాలు

కన్య రాశి వారికి నేడు (శనివారం) మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. పిల్లల చదువు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి. కొన్ని వ్యవహారాల్లో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తిచేస్తారు. పాత మిత్రుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో నష్టాలు భర్తీ చేస్తారు. ఉద్యోగులకు శుభవార్తలు అందుతాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అందుకోసం కొంత ఖర్చు చేస్తారు.

712
తుల రాశి ఫలాలు
Image Credit : Asianet News

తుల రాశి ఫలాలు

తుల రాశివారు ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. వాహన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అనుకొన్న సమయానికి పనులు పూర్తి కావు. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. బంధు మిత్రులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారులు.. వచ్చిన అవకాశాలు చేజారిపోకుండా చూసుకోవాలి. వాటి ద్వారా భవిష్యత్తులో లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఉద్యోగం విషయంలో ఉన్నతాధికారులతో ఊహించని సమస్యలు కలుగుతాయి.

812
వృశ్చిక రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృశ్చిక రాశి ఫలాలు

వృశ్చిక రాశివారు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. వారితో కలిసి శుభకార్యాలకు హాజరవుతారు. దైవ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో మంచి ఫలితాలను పొందుతారు. ఉద్యోగులకు శ్రమకు తగ్గ ఫలితం దక్కుతుంది. అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. .

912
ధనుస్సు రాశి ఫలాలు
Image Credit : Asianet News

ధనుస్సు రాశి ఫలాలు

ధనుస్సు రాశివారికి ఇంటా బయట ఊహించని సమస్యలు ఎదురవుతాయి. చేపట్టిన కార్యక్రమాల్లో స్వల్ప వివాదాలు ఉంటాయి. దాయాదులతో స్థిరాస్తి వివాదాలు తప్పవు. జాగ్రత్తగా ఉండటం మంచిది. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగ వాతావరణం నిరుత్సాహ పరుస్తుంది. దూర ప్రయాణాల వల్ల ఖర్చు, శారీరక శ్రమ పెరుగుతుంది. డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.  

1012
మకర రాశి ఫలాలు
Image Credit : Asianet News

మకర రాశి ఫలాలు

మకర రాశి వారికి వృత్తి, వ్యాపారాల్లో లాభాలు రావచ్చు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధు మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు రాజీ చేసుకుంటారు. ఉద్యోగ బాధ్యతలను తోటివారి సహాయంతో సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. నిరుద్యోగులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి.

1112
కుంభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

కుంభ రాశి ఫలాలు

కుంభ రాశివారు అనుకున్న పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. మిత్రులతో సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.  

1212
మీన రాశి ఫలాలు
Image Credit : Asianet News

మీన రాశి ఫలాలు

మీన రాశివారికి నేడు (శనివారం) అంతగా కలిసి రాకపోవచ్చు. ఈ రాశివారికి కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో అవాంతరాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్యపరుస్తుంది. దీర్ఘ కాలిక అప్పుల ఒత్తిడి పెరుగుతుంది. ఫలితంగా శారీరక, మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగంలో సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. 

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
ఆధ్యాత్మిక విషయాలు
రాశి ఫలాలు
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Birth Stars: ఈ 5 నక్షత్రాల్లో పుట్టినవారు మహా ముదుర్లు.. మాటలతో మాయ చేసేస్తారు!
Recommended image2
Baba Vanga: ఈ 4 రాశులవారికి త్వరలో ధన యోగం, కోటీశ్వరులు అవ్వడం ఖాయం
Recommended image3
Shukra Gochar: మార్చిలో ఈ 2 రాశుల వారి జీవితం మార‌నుంది.. నాలుగు సార్లు శుక్ర గ‌హ సంచారం
Related Stories
Recommended image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారు రాత్రికి రాత్రే ధనవంతులవుతారు!
Recommended image2
Birth Date: ఈ 3 తేదీల్లో పుట్టినవారు రెండో పెళ్లి చేసుకునే అవకాశాలు ఎక్కువ!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved