Today Rasi Phalalu: ఈ రాశివారికి జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లాభం!
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 18.07.2025 శుక్రవారానికి సంబంధించినవి.
- FB
- TW
- Linkdin
Follow Us

మేష రాశి ఫలాలు
బంధుమిత్రుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాల్లో నూతన పెట్టుబడులు అందుతాయి. మిత్రులతో ఆనందంగా గడుపుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగులకు అధికారుల అనుగ్రహం కలుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.
వృషభ రాశి ఫలాలు
వ్యాపారాలు, ఉద్యోగాల్లో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబసభ్యుల సలహాలు పాటిస్తారు. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. బంధువుల రాక ఆనందం కలిగిస్తుంది.
మిథున రాశి ఫలాలు
పిల్లల ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాల్లో నిరాశ పెరుగుతుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహ పరుస్తుంది. కొన్ని పనులు శ్రమతో కానీ పూర్తి కావు. వృథా ఖర్చులు ఉంటాయి.
కర్కాటక రాశి ఫలాలు
ఇంటా బయట పని ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాల్లో ఆటంకాలు ఉంటాయి. వ్యాపారాల్లో చికాకులు అధికమవుతాయి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమ పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది.
సింహ రాశి ఫలాలు
చేపట్టిన పనుల్లో విజయం దక్కుతుంది. ఆప్తుల నుంచి కీలక సమాచారం సేకరిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాల్లో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వాహన యోగం ఉంది.
కన్య రాశి ఫలాలు
చిన్ననాటి మిత్రుల నుంచి ఆర్థిక సహాయం లభిస్తుంది. వ్యాపారాల్లో సమస్యలు అధిగమిస్తారు. ఉద్యోగాల్లో పని భారం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు. సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుతాయి.
తుల రాశి ఫలాలు
కుటుంబ సభ్యుల విషయంలో ముఖ్యమైన నిర్ణయాల్లో ఆకస్మిక మార్పులు చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. ఆరోగ్యం విషయంలో వైద్య సంప్రదింపులు చేయాల్సి వస్తుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వ్యాపారాలు, ఉద్యోగాల్లో పని ఒత్తిడి అధికమవుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ముందుకు సాగవు.
వృశ్చిక రాశి ఫలాలు
బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ తప్పా ఫలితం కనిపించదు. సోదరులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి. చేపట్టిన వ్యవహారాల్లో అవరోధాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి.
ధనుస్సు రాశి ఫలాలు
జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లాభ సూచనలు ఉన్నాయి. ఆదాయం బాగుంటుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. చిన్న తరహా పరిశ్రమలకు కొత్త అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగులు పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మకర రాశి ఫలాలు
పాత అప్పులు తీర్చడానికి కొత్త అప్పులు చేస్తారు. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాల్లో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.
కుంభ రాశి ఫలాలు
మిత్రుల నుంచి వివాదాలకు సంబంధించి ముఖ్య విషయాలు తెలుస్తాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు విస్తృతం అవుతాయి. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు శాలరీ విషయంలో శుభవార్తలు అందుతాయి.
మీన రాశి ఫలాలు
ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తారు. వృత్తి వ్యాపారాల్లో శ్రమ ఫలిస్తుంది. ఆస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. చేపట్టిన పనులు చకచకా సాగుతాయి. ఉద్యోగులు ఉన్నత హోదాలు పొందుతారు. నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం కలుగుతుంది.