MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Today Rasi Phalalu: నేడు ఈ రాశివారికి జీవిత భాగస్వామితో గొడవలు తప్పవు!

Today Rasi Phalalu: నేడు ఈ రాశివారికి జీవిత భాగస్వామితో గొడవలు తప్పవు!

Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 17.02.2026 మంగళవారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. 

2 Min read
Author : Kavitha G
Published : Feb 17 2026, 05:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
నేటి రాశి ఫలాలు
Image Credit : AI

నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

213
మేష రాశి ఫలాలు
Image Credit : Asianet News

మేష రాశి ఫలాలు

నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

Related Articles

Related image1
Lucky Zodiac Signs: ఒకటి కాదు రెండు కాదు 12 శుభ యోగాలు, 4 రాజయోగాలు.. ఈ 3 రాశులవారి పంట పండినట్లే!
Related image2
Dream Astrology: కలలో ఈ జంతువులు కనిపిస్తే.. అదృష్టం, సంపద మీ సొంతం అయినట్లే !
313
వృషభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృషభ రాశి ఫలాలు

కుటుంబ వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలు చేసి మీ విలువ పెంచుకుంటారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో వివాదాలు కొలిక్కి వస్తాయి. దూర ప్రయాణాలు లాభిస్తాయి. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో ఆశించిన అభివృద్ధి కలుగుతుంది.

413
మిథున రాశి ఫలాలు
Image Credit : Asianet News

మిథున రాశి ఫలాలు

ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. బంధుమిత్రులతో డబ్బు వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండాలి. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు పూర్తికావు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. నిరుద్యోగుల యత్నాలు కలిసిరావు.

513
కర్కాటక రాశి ఫలాలు
Image Credit : Asianet News

కర్కాటక రాశి ఫలాలు

చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఇంట్లో కొందరి ప్రవర్తన ఇబ్బంది కలిగిస్తుంది. వృత్తి, ఉద్యోగాలలో నూతన ప్రోత్సహకాలు అందుకుంటారు. ఇతరుల నుంచి అవసరానికి సహాయం అందుతుంది. స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభిస్తాయి.

613
సింహ రాశి ఫలాలు
Image Credit : Asianet News

సింహ రాశి ఫలాలు

సోదరులతో స్థిరాస్తి వివాదాలు తొలగుతాయి. విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాలలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. బంధుమిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. సంతానం విద్యా విషయంలో శుభవార్తలు అందుతాయి.

713
కన్య రాశి ఫలాలు
Image Credit : Asianet News

కన్య రాశి ఫలాలు

ఆర్థిక వ్యవహారాలు మరింత ఇబ్బంది కలిగిస్తాయి. జీవిత భాగస్వామితో గొడవలు తప్పవు. ఇంట్లో చికాకులు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

813
తుల రాశి ఫలాలు
Image Credit : Asianet News

తుల రాశి ఫలాలు

ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో స్థిరమైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల నష్టపోతారు. నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వృథా ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది.

913
వృశ్చిక రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృశ్చిక రాశి ఫలాలు

సోదరుల సహాయంతో వివాదాల నుంచి బయటపడతారు. బంధుమిత్రుల రాక సంతోషం కలిగిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి.

1013
ధనుస్సు రాశి ఫలాలు
Image Credit : Asianet News

ధనుస్సు రాశి ఫలాలు

ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఇంటా బయటా కొందరి ప్రవర్తన ఆందోళన కలిగిస్తుంది. కుటుంబ వ్యవహారాలలో సొంత నిర్ణయాలు కలిసిరావు. ఆలయ సందర్శన చేసుకుంటారు. ఉద్యోగాలలో అధికారులతో అప్రమత్తంగా ఉండాలి.

1113
మకర రాశి ఫలాలు
Image Credit : Asianet News

మకర రాశి ఫలాలు

ఆర్థికంగా పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలలో స్థిరమైన ఆలోచనలు చేసి లాభపడతారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది.

1213
కుంభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

కుంభ రాశి ఫలాలు

చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు రావు. రుణ ప్రయత్నాలు కలిసిరావు. ఉద్యోగాలలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్యమైన పత్రాల విషయంలో జాగ్రత్త వహించాలి.

1313
మీన రాశి ఫలాలు
Image Credit : Asianet News

మీన రాశి ఫలాలు

ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధు మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
AI Horoscope: ఈ రోజు ఓ రాశివారికి గ్రహణ ప్రభావంతో సమస్యలు
Recommended image2
Dream Astrology: కలలో ఈ జంతువులు కనిపిస్తే.. అదృష్టం, సంపద మీ సొంతం అయినట్లే !
Recommended image3
Risk Zodiac Signs: రిస్క్ తీసుకోవడమంటే ఈ రాశులకు ఎంతిష్టమో, సక్సెస్ కూడా అవుతారు
Related Stories
Recommended image1
Lucky Zodiac Signs: ఒకటి కాదు రెండు కాదు 12 శుభ యోగాలు, 4 రాజయోగాలు.. ఈ 3 రాశులవారి పంట పండినట్లే!
Recommended image2
Dream Astrology: కలలో ఈ జంతువులు కనిపిస్తే.. అదృష్టం, సంపద మీ సొంతం అయినట్లే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved