MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు ఇతరుల వ్యవహారాలలో తలదూర్చడం మంచిది కాదు!

Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు ఇతరుల వ్యవహారాలలో తలదూర్చడం మంచిది కాదు!

Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 16.08.2026 ఆదివారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

2 Min read
Author : Kavitha G
Published : Aug 16 2026, 05:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
నేటి రాశి ఫలాలు
Image Credit : AI

నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
మేష రాశి ఫలాలు
Image Credit : Asianet News

మేష రాశి ఫలాలు

ప్రముఖులతో చర్చలకు అనుకూలమైన రోజు. వృత్తి, వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాలు అనుకూలంగా సాగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు.

Related Articles

Related image1
Venus Retrograde: సొంత రాశిలో శుక్రుడి వక్ర గమనం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు!
Related image2
Naga Panchami 2026: నాగ పంచమి వేళ ఈ 5 రాశులవారికి డబ్బే డబ్బు.. అదృష్టం మొత్తం వీరిదే!
313
వృషభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృషభ రాశి ఫలాలు

చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు తప్పవు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. ఆకస్మిక ధన వ్యయ సూచనలు ఉన్నాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలు అంతగా రాణించవు. వ్యాపారాలలో కీలక సమయంలో నిర్ణయాలు తీసుకోలేరు.

413
మిథున రాశి ఫలాలు
Image Credit : Asianet News

మిథున రాశి ఫలాలు

ఆర్థిక ఇబ్బందులు బాధిస్తాయి. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి అధికమవుతుంది. కుటుంబ బాధ్యతలు మరింత చికాకు పరుస్తాయి. బంధుమిత్రులతో చిన్నపాటి వివాదాలు తప్పవు. నిరుద్యోగులకు నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఉద్యోగాలలో కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి.

513
కర్కాటక రాశి ఫలాలు
Image Credit : Asianet News

కర్కాటక రాశి ఫలాలు

బంధు మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. ముఖ్యమైన పనులలో అవరోధాలు కలిగినా అధిగమించి ముందుకు సాగుతారు. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు లాభిస్తాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. ఉద్యోగాలలో ఆలోచించి ముందుకు సాగడం మంచిది.

613
సింహ రాశి ఫలాలు
Image Credit : Asianet News

సింహ రాశి ఫలాలు

కీలక సమయంలో బంధు మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలలో పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు అనుకూలం.

713
కన్య రాశి ఫలాలు
Image Credit : Asianet News

కన్య రాశి ఫలాలు

దీర్ఘకాలిక రుణ బాధలు తొలగుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కుటుంబ విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది.

813
తుల రాశి ఫలాలు
Image Credit : Asianet News

తుల రాశి ఫలాలు

రుణ దాతల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. మానసిక సమస్యలు చికాకు పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేయడం మంచిది. వ్యాపార, ఉద్యోగాలలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి.

913
వృశ్చిక రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృశ్చిక రాశి ఫలాలు

చేపట్టిన పనులు శ్రమతో కానీ పూర్తి కావు. ఆత్మవిశ్వాసంతో వివాదాల నుంచి బయటపడతారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపారాలలో ఇబ్బందులు ఎదురైనా అధిగమించి లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయం బాగుంటుంది.

1013
ధనుస్సు రాశి ఫలాలు
Image Credit : Asianet News

ధనుస్సు రాశి ఫలాలు

ఇతరుల వ్యవహారాలలో తలదూర్చడం మంచిది కాదు. మీ ఆలోచనలు కుటుంబ సభ్యులకు నచ్చవు. చేపట్టిన పనులు మధ్యలో నిలిపివేస్తారు. ఆర్థిక ఇబ్బందులు బాధిస్తాయి. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది.

1113
మకర రాశి ఫలాలు
Image Credit : Asianet News

మకర రాశి ఫలాలు

చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. దాయాదులతో భూ సంబంధిత వివాదాలు కొలిక్కి వస్తాయి. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. ఉద్యోగాలలో వివాదాలు పరిష్కరించుకుంటారు. వృత్తి, వ్యాపారాలు అనుకూలం.

1213
కుంభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

కుంభ రాశి ఫలాలు

చేపట్టిన పనులు నత్తనడకన సాగుతాయి. వృథా ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వ్యాపార భాగస్వాములతో చిన్నపాటి వివాదాలు తప్పవు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఉద్యోగాలలో అధికారులతో వివాదాలు కలిగే సూచనలు ఉన్నాయి.

1313
మీన రాశి ఫలాలు
Image Credit : Asianet News

మీన రాశి ఫలాలు

అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కొన్ని వ్యవహారాలలో ఇతరుల సహయ సహకారాలు అందుతాయి. ఆదాయం బాగుంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూల ఫలితాలనిస్తాయి. సంతాన విద్యా విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Naga Panchami 2026: నాగ పంచమి వేళ ఈ 5 రాశులవారికి డబ్బే డబ్బు.. అదృష్టం మొత్తం వీరిదే!
Recommended image2
Sun Transit: సెప్టెంబర్ లో 4 రాశులకు తిరుగులేని రాజయోగం, పట్టిందల్లా బంగారమే..
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి బంధువుల నుంచి అందిన ఒక వార్త నిరుత్సాహం కలిగిస్తుంది!
Related Stories
Recommended image1
Venus Retrograde: సొంత రాశిలో శుక్రుడి వక్ర గమనం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు!
Recommended image2
Naga Panchami 2026: నాగ పంచమి వేళ ఈ 5 రాశులవారికి డబ్బే డబ్బు.. అదృష్టం మొత్తం వీరిదే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved