- Home
- Astrology
- Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి బంధువుల నుంచి అందిన ఒక వార్త నిరుత్సాహం కలిగిస్తుంది!
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి బంధువుల నుంచి అందిన ఒక వార్త నిరుత్సాహం కలిగిస్తుంది!
Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 15.08.2026 శనివారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశి ఫలాలు
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
మేష రాశి ఫలాలు
పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తిచేస్తారు. అవసరానికి సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి, ఉద్యోగాలలో సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు.
వృషభ రాశి ఫలాలు
ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితులతో వివాదాలు కలుగుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు కలిసిరావు.
మిథున రాశి ఫలాలు
సమాజంలో ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నూతన రుణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి.
కర్కాటక రాశి ఫలాలు
సంఘంలో పెద్దలతో పరిచయాలు విస్తృతమవుతాయి. ఉద్యోగులు శాలరీ విషయంలో శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. స్థిరాస్తి వ్యవహారాలలో సమస్యలు అధిగమిస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.
సింహ రాశి ఫలాలు
కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. చేపట్టిన వ్యవహారాలు మధ్యలో ఆగిపోతాయి. వ్యాపారాలలో సొంత ఆలోచనలు అంతగా కలిసిరావు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. మిత్రులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి, ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి.
కన్య రాశి ఫలాలు
దూరపు బంధువుల నుంచి కీలక విషయాలు తెలుస్తాయి. చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. నూతన రుణ యత్నాలు కష్టంతో పూర్తవుతాయి. బంధు మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపార వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. వృత్తి, ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి.
తుల రాశి ఫలాలు
కుటుంబ పెద్దలతో సందడిగా గడుపుతారు. బంధు మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. భూ క్రయ విక్రయాలలో విశేషమైన లాభాలు అందుతాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.
వృశ్చిక రాశి ఫలాలు
సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆప్తులతో దీర్ఘకాలిక వివాదాలు తీరి ఊరట చెందుతారు. అనుకున్న సమయానికి పనులు పూర్తిచేస్తారు. వృత్తి, వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.
ధనుస్సు రాశి ఫలాలు
సంతాన విద్యా విషయాలు నిరుత్సాహపరుస్తాయి. ఆర్థిక వ్యవహారాలు కొంత చికాకు పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. దైవ సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలలో ఊహించని సమస్యలు కలుగుతాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.
మకర రాశి ఫలాలు
ముఖ్యమైన వ్యవహారాలలో కొంత జాప్యం కలుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. బంధువుల నుంచి అందిన ఒక వార్త నిరుత్సాహం కలిగిస్తుంది. రుణ దాతల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వల్ల తగిన విశ్రాంతి ఉండదు.
కుంభ రాశి ఫలాలు
గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆత్మీయులతో కీలక విషయాల గురించి చర్చిస్తారు. బంధు మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. సోదరులతో స్ధిరాస్తి ఒప్పందాలు కుదురుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వృత్తి, ఉద్యోగాలలో అధికారుల సహాయం లభిస్తుంది.
మీన రాశి ఫలాలు
ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. రుణ సంబంధిత సమస్యల వల్ల ఒత్తిడి తప్పదు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. సంతాన ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో అంచనాలు అందుకోలేరు.

