Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి జీవిత భాగస్వామితో గొడవలు తప్పవు!
Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 15.04.2026 బుధవారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశి ఫలాలు
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
మేష రాశి ఫలాలు
భూ క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలలో అవరోధాలు తొలగుతాయి. సేవా కార్యక్రమాలు నిర్వహించి మీ విలువ మరింత పెంచుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి.
వృషభ రాశి ఫలాలు
కుటుంబ సభ్యుల ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. దీర్ఘకాలిక వివాదాల నుంచి కొంతవరకు బయటపడతారు. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారుల నుంచి విమర్శలు ఎదుర్కొంటారు.
మిథున రాశి ఫలాలు
రుణ దాతల ఒత్తిడి వల్ల మానసిక సమస్యలు కలుగుతాయి. కీలక వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన పనులు చాలా కష్టం మీద పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నిరుద్యోగులకు నిరాశ తప్పదు.
కర్కాటక రాశి ఫలాలు
సమాజంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. సంతాన విద్యా విషయాలు సంతృప్తి కలిగిస్తాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఉద్యోగాలలో తోటివారితో సఖ్యతగా వ్యవహరిస్తారు.
సింహ రాశి ఫలాలు
చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు. నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలు అనుకున్న విధంగా పూర్తిచేస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు కలిసివస్తాయి. వృత్తి, వ్యాపారాలలో యత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి.
కన్య రాశి ఫలాలు
ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలలో శ్రమ పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు మందగిస్తాయి. వృత్తి, వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.
తుల రాశి ఫలాలు
దూర ప్రయాణాలలో అవరోధాలు కలుగుతాయి. రుణదాతల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటా బయటా కొందరి ప్రవర్తన వల్ల మానసిక ప్రశాంతత లోపిస్తుంది. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం నిరుత్సాహపరుస్తుంది.
వృశ్చిక రాశి ఫలాలు
సన్నిహితులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. దీర్ఘకాలిక వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సోదరుల నుంచి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ఉద్యోగులకు పనిభారం నుంచి ఉపశమనం లభిస్తుంది.
ధనుస్సు రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ వాతావరణం కొంత గంధరగోళంగా ఉంటుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కలిసిరావు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు చికాకు కలిగిస్తాయి.
మకర రాశి ఫలాలు
సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. చేపట్టిన వ్యవహారాలలో ఆకస్మిక విజయం సాధిస్తారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో నూతన ఆలోచనలు ఆచరణలో పెట్టి లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో ఆశించిన అవకాశాలు అందుతాయి.
కుంభ రాశి ఫలాలు
దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలలో ఊహించని మార్పులు ఉంటాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. జీవిత భాగస్వామితో అకారణంగా వివాదాలు కలుగుతాయి. ఉద్యోగాలలో ప్రతికూల వాతావరణం ఉంటుంది. వృథా ఖర్చులు చేదాటుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.
మీన రాశి ఫలాలు
ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగవుతుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. వృత్తి, వ్యాపారాలలో నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. ఉద్యోగులు అధికారుల అనుగ్రహం పొందుతారు.

