MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Astrology
  • Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి శత్రువులు కుడా మిత్రులుగా మారి సహాయం చేస్తారు!

Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి శత్రువులు కుడా మిత్రులుగా మారి సహాయం చేస్తారు!

Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 11.05.2026 సోమవారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

2 Min read
Author : Kavitha G
Published : May 11 2026, 05:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
నేటి రాశి ఫలాలు
Image Credit : AI

నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
మేష రాశి ఫలాలు
Image Credit : Asianet News

మేష రాశి ఫలాలు

కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. భూ సంబంధిత కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

Related Articles

Related image1
Dream Astrology: పదే పదే ఈ కల వస్తే మీ జీవితం ఊహించని మలుపు తిరగడం ఖాయం!
Related image2
Weekly Horoscope: ఈ వారం 12 రాశుల్లో ఏ రాశివారికి శుభ ఫలితాలు ఉన్నాయో తెలుసా?
313
వృషభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృషభ రాశి ఫలాలు

ముఖ్యమైన వ్యవహారాలలో అవరోధాలు ఉన్నప్పటికీ సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. వృథా ఖర్చుల విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. సంతానానికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి.

413
మిథున రాశి ఫలాలు
Image Credit : Asianet News

మిథున రాశి ఫలాలు

ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యుల నుంచి అవసరానికి డబ్బు సహాయం అందక ఇబ్బంది పడతారు. ఉద్యోగాలలో ఇతరులతో వాదనకు వెళ్లకపోవడం మంచిది. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలించవు. దూర ప్రయాణాలు కలిసిరావు.

513
కర్కాటక రాశి ఫలాలు
Image Credit : Asianet News

కర్కాటక రాశి ఫలాలు

కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. అనుకున్న సమయానికి పనులు పూర్తిచేస్తారు. ఆదాయం బాగుంటుంది. సంఘంలో ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాలకు నూతన పెట్టుబడులు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది.

613
సింహ రాశి ఫలాలు
Image Credit : Asianet News

సింహ రాశి ఫలాలు

ఉద్యోగులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. బంధు మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. స్ధిరాస్తి వివాదాల పరిష్కారానికి చేసే ప్రయత్నాలు కలిసివస్తాయి. కొన్ని ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. శత్రువులు కుడా మిత్రులుగా మారి సహాయం చేస్తారు.

713
కన్య రాశి ఫలాలు
Image Credit : Asianet News

కన్య రాశి ఫలాలు

దీర్ఘకాలిక రుణాలు కొంత వరకు తీర్చగలుగుతారు. ఉద్యోగాలలో అంచనాలు అందుకుంటారు. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. కుటుంబ సభ్యులతో దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో గందరగోళ పరిస్థితుల నుంచి బయటపడతారు. వృత్తి, ఉద్యోగాలలో నూతన ఆలోచనలు ఆచరణలో పెడతారు.

813
తుల రాశి ఫలాలు
Image Credit : Asianet News

తుల రాశి ఫలాలు

కొన్ని వ్యవహారాలలో సన్నిహితులు మీ మాటతో విభేదిస్తారు. పని ఒత్తిడి అధికమై మానసిక ఆందోళనలు పెరుగుతాయి. వాహన ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి. వృత్తి, వ్యాపారాలలో శత్రు సమస్యలు పెరుగుతాయి. చేపట్టిన పనులు వాయిదా పడతాయి. ఉద్యోగాలలో శ్రమ పెరుగుతుంది.

913
వృశ్చిక రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృశ్చిక రాశి ఫలాలు

చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. వ్యాపార వ్యవహారాలలో ధైర్యంగా ముందుకు సాగుతారు. ఉద్యోగాలలో అధికారులతో చర్చలు అనుకూలిస్తాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.

1013
ధనుస్సు రాశి ఫలాలు
Image Credit : Asianet News

ధనుస్సు రాశి ఫలాలు

ఇతరులతో కొన్ని విషయాలలో విభేదాలు వస్తాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేయలేక వాయిదా వేస్తారు. నూతన వ్యాపార ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. ఆర్ధికంగా స్వల్ప నష్టాలు తప్పవు. వృత్తి, ఉద్యోగాలలో సహోద్యోగులతో మాటపట్టింపులుంటాయి. సంతాన ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.

1113
మకర రాశి ఫలాలు
Image Credit : Asianet News

మకర రాశి ఫలాలు

ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. దాయాదులతో భూ సంబంధిత వివాదాల నుంచి బయటపడతారు. బంధు మిత్రుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. ఇంటి పెద్దల సహాయంతో కొన్ని పనులు పూర్తిచేస్తారు. ఉద్యోగులు శుభవార్తలు వింటారు. ఆర్థికంగా పురోగతి ఉంటుంది.

1213
కుంభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

కుంభ రాశి ఫలాలు

వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆదాయం ఆశించినంత ఉండదు. ఇంటా బయటా ఊహించని ఖర్చులు ఎదురవుతాయి. డబ్బు పరంగా ఇతరులకు మాట ఇచ్చి ఇబ్బందిపడతారు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఉద్యోగాలలో కొంత నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. దైవ చింతన పెరుగుతుంది.

1313
మీన రాశి ఫలాలు
Image Credit : Asianet News

మీన రాశి ఫలాలు

అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. పాత ఋణాలు తీర్చడానికి కొత్త అప్పులు చేస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. సంతాన విద్యా విషయాల పట్ల శ్రద్ధ వహించాలి. ఉద్యోగాలలో మీ పని తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆత్మీయులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి!
Recommended image2
Shukra Gochar :సెప్టెంబర్ 11న స్వాతి నక్షత్రంలోకి శుక్రుడు..ఈ 3 రాశులకు పట్టిందల్లా బంగారమే
Recommended image3
Mercury Transit: కన్య రాశిలోకి బుధుడు.. ఈ 4 రాశులవారి అదృష్టం రెట్టింపు కావడం పక్కా!
Related Stories
Recommended image1
Dream Astrology: పదే పదే ఈ కల వస్తే మీ జీవితం ఊహించని మలుపు తిరగడం ఖాయం!
Recommended image2
Weekly Horoscope: ఈ వారం 12 రాశుల్లో ఏ రాశివారికి శుభ ఫలితాలు ఉన్నాయో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved