MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Astrology
  • Dream Astrology: పదే పదే ఈ కల వస్తే మీ జీవితం ఊహించని మలుపు తిరగడం ఖాయం!

Dream Astrology: పదే పదే ఈ కల వస్తే మీ జీవితం ఊహించని మలుపు తిరగడం ఖాయం!

Dream Astrology: సాధారణంగా మనకు వచ్చే కలలు.. కొన్నిసార్లు మనసుకు సంతోషాన్నిస్తాయి. మరికొన్నిసార్లు మనల్ని ఆలోచనల్లో పడేస్తాయి. స్వప్న శాస్త్రం ప్రకారం ఏ కలలు పదే పదే వస్తే జీవితంలో ఊహించని మార్పులు ఉంటాయో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.  

2 Min read
Author : Kavitha G
Published : May 08 2026, 05:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
స్వప్నశాస్త్రం ప్రకారం కలల అర్థాలు
Image Credit : Getty

స్వప్నశాస్త్రం ప్రకారం కలల అర్థాలు

మనిషి జీవితంలో కలలకు ప్రత్యేక స్థానం ఉంది. కొన్ని కలలు సాధారణంగా అనిపించినా, మరికొన్ని మనసులో ఎన్నో సందేహాలను కలిగిస్తాయి. ముఖ్యంగా ఒకే కల పదే పదే వస్తుంటే చాలామంది దాని వెనుక ఏదైనా సంకేతం ఉందేమో అని ఆలోచిస్తుంటారు. స్వప్న శాస్త్రం ప్రకారం కొన్ని కలలు భవిష్యత్తులో జరగబోయే సంఘటనలకు సూచనలుగా చెప్తారు. మరి ఏ కలలు పదే పదే వస్తే జీవితంలో పెద్ద మార్పులు ఉంటాయో ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
నీరు కనిపించే కలలు
Image Credit : Getty

నీరు కనిపించే కలలు

స్వప్న శాస్త్రం ప్రకారం నీరు కనిపించే కలలు పదేపదే వస్తే జీవితంలో భావోద్వేగ మార్పులు చోటుచేసుకోబోతున్నాయని అర్థం. స్వచ్ఛమైన నీరు కనిపిస్తే మంచి కాలం ప్రారంభమవుతుందని సూచన. మురికినీరు కనిపిస్తే కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని స్వప్న శాస్త్రం చెబుతోంది.

36
కింద పడిపోతున్నట్లు వచ్చే కలలు
Image Credit : Chat Gpt

కింద పడిపోతున్నట్లు వచ్చే కలలు

కొంతమందికి ఎత్తైన ప్రదేశం నుంచి కింద పడిపోతున్నట్లు కల పదే పదే వస్తుంది. ఈ కలను స్వప్న శాస్త్రంలో అస్థిరతకు సంకేతంగా భావిస్తారు. జీవితంలో తీసుకునే నిర్ణయాలపై భయం లేదా భవిష్యత్తుపై ఆందోళన ఉన్నప్పుడు ఇలాంటి కలలు వస్తాయట. అయితే ఇదే కల తరచుగా వస్తే త్వరలో జీవితంలో పెద్ద మార్పు రాబోతుందనే అర్థం కూడా ఉండొచ్చు. ఉద్యోగం, వ్యాపారం, సంబంధాలు లేదా ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకునే సూచనగా దీన్ని భావిస్తారు.

46
చనిపోయిన వ్యక్తులు వచ్చే కలలు
Image Credit : Ai generated

చనిపోయిన వ్యక్తులు వచ్చే కలలు

మరణించిన వ్యక్తులు కలలో పదేపదే కనిపించడం కూడా చాలా మందిని ఆందోళనకు గురిచేస్తుంది. స్వప్న శాస్త్రం ప్రకారం ఇలా కనిపించడం అంటే వారు ఏదైనా సందేశం ఇవ్వాలనుకుంటున్నారని సూచన. కొన్నిసార్లు ఇది కుటుంబంలో జరగబోయే మార్పులకు సంకేతమని కూడా పండితులు చెబుతున్నారు.

56
దేవళ్లు, ఆలయాలు కనిపించే కలలు
Image Credit : Generated by google gemini AI

దేవళ్లు, ఆలయాలు కనిపించే కలలు

పదే పదే దేవుళ్లు లేదా ఆలయాలు కనిపించే కలలు చాలా శుభప్రదం. ఇది జీవితంలో మంచి మార్పులు రాబోతున్నాయని, ఆర్థికంగా లేదా వ్యక్తిగతంగా ఎదుగుదల ఉంటుందని సూచన. స్వప్నశాస్త్రం ప్రకారం ఇలాంటి కలలు మనసుకు ధైర్యాన్ని ఇవ్వడమే కాకుండా ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్లాలని సంకేతమిస్తాయి. 

66
జర్నీ చేస్తున్నట్లు వచ్చే కలలు
Image Credit : Asianet News

జర్నీ చేస్తున్నట్లు వచ్చే కలలు

స్వప్న శాస్త్రం ప్రకారం.. తరచూ ప్రయాణం చేస్తున్నట్లు కలలు రావడం కూడా జీవితంలో మార్పులకు సూచన. ఇది కొత్త అవకాశాలు, కొత్త పరిచయాలు లేదా జీవితంలో కొత్త దిశ ప్రారంభాన్ని సూచిస్తుంది. ఉద్యోగ మార్పు, విదేశీ ప్రయాణం లేదా కొత్త సంబంధం ప్రారంభం కావచ్చు. అందుకే ఒకే కల పదేపదే వస్తే దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయకుండా, జీవిత పరిస్థితులను కూడా ఒకసారి పరిశీలించుకోవడం మంచిదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac Signs: జీవితాన్ని ఎంజాయ్ చేయడంలో ఈ 5 రాశులవారు టాప్! మీది ఏ రాశి?
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఈ నాలుగు రాశులవారికి విపరీతంగా కలిసివస్తుంది..!
Recommended image3
Weekly Horoscope: 12 రాశుల వారఫలాలు.. గ్రహాల మార్పుతో ఈ వారం ఏ రాశికి కలిసొస్తుందంటే?
Related Stories
Recommended image1
Grahan Yoga: గ్రహణ యోగం.. ఈ 4 రాశుల వారికి కష్టాలు, కన్నీళ్లు తప్పవు..!
Recommended image2
Dhana Yogam: మిథున రాశిలో ధనయోగం.. ఈ 5 రాశులవారి జాతకం మారిపోవడం పక్కా!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved