Today Rasi Phalalu: నేడు ఈ రాశివారు చేయని పనికి నిందలు మోయాల్సి వస్తుంది!
Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 10.01.2025 శనివారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశి ఫలాలు
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
మేష రాశి ఫలాలు
సోదరులతో మాటపట్టింపులు కలుగుతాయి. చేపట్టిన పనులలో స్వల్ప అవరోధాలుంటాయి. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. వాహన ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి.
వృషభ రాశి ఫలాలు
డబ్బు వ్యవహారాలు కలిసివస్తాయి. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు అభివృద్ధి బాటలో పయనిస్తాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.
మిథున రాశి ఫలాలు
అవసరానికి చేతికి డబ్బు అందుతుంది. మిత్రుల నుంచి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. దూరప్రాంతాల బంధు మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కర్కాటక రాశి ఫలాలు
ముఖ్యమైన వ్యవహారాలలో శ్రమ అధికమవుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో మరింత గందరగోళ పరిస్థితులుంటాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి. దూరపు బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. సంతాన ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి.
సింహ రాశి ఫలాలు
ఉద్యోగాలలో చేయని పనికి నిందలు మోయాల్సి వస్తుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. వృతా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇంటా బయటా సమస్యలు మరింత పెరుగుతాయి. ఆరోగ్యం సహకరించక ఇబ్బంది పడతారు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.
కన్య రాశి ఫలాలు
నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. నూతన కార్యక్రమాలు చేపట్టి విజయం సాధిస్తారు. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నాయి. వృత్తి, వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది.
తుల రాశి ఫలాలు
ఉద్యోగాలలో ఇతరుల నుంచి ఊహించని సమస్యలు ఎదుర్కొంటారు. వ్యాపార వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దూర ప్రయాణాలు అంతగా కలిసిరావు. స్ధిరాస్తి సంబంధిత వ్యవహారాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు.
వృశ్చిక రాశి ఫలాలు
కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు అందుతాయి. సమాజంలో ప్రముఖుల పరిచయాలు కొంత ఉత్సాహం కలిగిస్తాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. అన్ని వైపుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు.
ధనుస్సు రాశి ఫలాలు
వ్యాపార, ఉద్యోగాలు సమస్యాత్మకంగా మారుతాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. కుటుంబ బాధ్యతలు పెరిగి ఒత్తిడి అధికమవుతుంది. అనుకున్న సమయానికి డబ్బు అందక ఇబ్బంది పడతారు. బంధు మిత్రుల నుంచి ఊహించని మాటలు వినాల్సి వస్తుంది.
మకర రాశి ఫలాలు
కుటుంబ సభ్యులతో చర్చలు లాభసాటిగా సాగుతాయి. నూతన రుణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు అధిగమిస్తారు. దీర్ఘ కాలిక రుణ సమస్యల నుంచి బయటపడతారు. స్థిరాస్తి వివాదాలకు సంబంధించి కీలక సమాచారం అందుతుంది.
కుంభ రాశి ఫలాలు
నిరుద్యోగులు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. బంధు మిత్రుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార విస్తరణకు అవరోధాలు తొలగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. ఆర్థిక ఇబ్బందులను అధిగమించి ముందుకు సాగుతారు. చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు.
మీన రాశి ఫలాలు
ఉద్యోగులు అధికారుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది. దీర్ఘకాలిక రుణ ఒత్తిడులు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. దూర ప్రయాణాల వల్ల శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి.

