- Home
- Astrology
- Mercury Saturn: రేపటి రాత్రి నుండి ఈ మూడు రాశుల వారిపై ధన వర్షమే, బుధ శని సంచారంతో మాయాజాలం
Mercury Saturn: రేపటి రాత్రి నుండి ఈ మూడు రాశుల వారిపై ధన వర్షమే, బుధ శని సంచారంతో మాయాజాలం
బుధుడు, శని కలిసి అనేక రాశుల (Zodiac Signs) వారిని ప్రభావితం చేయనున్నారు. ముఖ్యంగా మూడు రాశుల వారికి ధన వర్షాన్ని కురిపించనున్నారు. ఆ మూడు రాశులు ఏవో తెలుసుకోండి.

బుధ శని సంచారం
సెప్టెంబర్ 17, 2025 రాత్రి 11:15 నిమిషాల నుండి మూడు రాశుల వారికి స్వర్ణ యుగం మొదలవుతుంది. బుధుడు, శని ఒకదానికొకటి 180 డిగ్రీల కోణంలో ఉంటాయి. అంటే ఈ రెండు గ్రహాలు ఒకదానికి ఒకటి తిరోగమనంలో ఉంటాయి. దీనివల్ల ద్రిక్ పంచాంగం ప్రకారం కొన్ని రాశుల వారికి విపరీతంగా కలిసి వచ్చే అవకాశం ఉంది.
బుధ శని ప్రత్యేకత
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వ్యాపారం, మాట, వృద్ధికి చిహ్నం బుధుడు. ఇక కర్మకు, న్యాయానికి సూచిక శని. వీరిద్దరి వల్ల మూడు రాశుల వారు రేపటి నుంచి ప్రత్యేక ప్రయోజనాలను పొందుతారు. వ్యాపారంలో ఉద్యోగంలో పురోధిగ్గతి కనిపిస్తుంది. ఆ మూడు అదృష్ట రాశులు ఎవరో తెలుసుకోండి.
మిధున రాశి
బుధుడు, శని సంచారం వల్ల అనేక శుభ ఫలితాలు వీరికి కలగనున్నాయి. పనిలో విజయాన్ని పొందుతారు. వ్యాపారంలో ఉన్నవారు లాభాలు సంపాదిస్తారు. మానసిక ప్రశాంతత దక్కుతుంది. ఇక ఉద్యోగస్తులు ఆర్థిక సంక్షోభం నుండి బయటపడతారు. మానసిక ఒత్తిడి చాలా వరకు తగ్గే అవకాశం ఉంది.
కన్యా రాశి
కన్యారాశి వారికి బుధుడు, శని సంచారం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఈ రాశి విద్యార్థులకు అంతా శుభప్రదంగా ఉంటుంది. బుధుడి వల్ల వీరిలో ఏకాగ్రత పెరుగుతుంది. చదువుపై దృష్టి పెడతారు. వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. చెడిపోయిన పనిని కూడా మీరు తిరిగి బాగుచేసుకుంటారు.
మకర రాశి
బుధుడు, శని కలయిక వల్ల మకర రాశి వారికి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగం చేస్తున్నవారికి పెద్ద బాధ్యతలు దక్కి అవకాశం ఉంది. అలాగే వారి కష్టాన్ని తగ్గ ప్రతిఫలం కూడా కలుగుతుంది. మీరు వైవాహిక జీవితం కూడా సంతోషంగా సాగుతుంది. మీకు తెలివితేటలు పెరుగుతాయి.