MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Astrology
  • Lucky Zodiac Signs: గ్రహాల అనుకూల సంచారం.. ఈ 6 రాశులవారికి ఊహించని రాజయోగం, ఉన్నత పదవులు!

Lucky Zodiac Signs: గ్రహాల అనుకూల సంచారం.. ఈ 6 రాశులవారికి ఊహించని రాజయోగం, ఉన్నత పదవులు!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మే నుంచి జూలై వరకు కొన్ని గ్రహాల సంచారం.. 6 రాశులవారికి అనుకూలంగా జరగనుంది. వారికి వ్యక్తిగత జీవితాల నుంచి వ్యాపారాల వరకు ఊహించని శుభ ఫలితాలు రానున్నాయి. మరి ఆ అదృష్ట రాశులేవో, అందులో మీ రాశి ఉందో ఓసారి చెక్ చేసుకోండి.

2 Min read
Author : Kavitha G
Published : Apr 28 2026, 03:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
మేష రాశి వ్యాపారాల్లో విజయం
Image Credit : our own

మేష రాశి- వ్యాపారాల్లో విజయం

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూలై వరకు గురువు, రాహువు, శుక్రుడు, సూర్యుడి అనుకూల సంచారంతో పాటు అధిపతి అయిన కుజుడి బలం వల్ల మేష రాశివారికి మేలు జరుగుతుంది. తక్కువ శ్రమతో ఉన్నత స్థానాలు అందుకుంటారు. ఉద్యోగాల్లో తమ నైపుణ్యాలతో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ఆస్తి సంబంధిత సమస్యలు తొలగిపోయి, వాటి విలువ కూడా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో విజయం సాధిస్తారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
వృషభ రాశి- భారీ లాభాలు
Image Credit : our own

వృషభ రాశి- భారీ లాభాలు

గురువు, శని, రాహువు, కుజుడి బలం పెరగడం వల్ల ఈ రాశి వారు అత్యంత సంపన్నులుగా మారే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో తమ సత్తా చాటుకొని ఉన్నత పదవులు పొందుతారు. షేర్లు, స్పెక్యులేషన్ల ద్వారా భారీ లాభాలు పొందే సూచనలున్నాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. విదేశాల నుంచి కూడా డబ్బు సంపాదించే అవకాశం ఉంది.

Related Articles

Related image1
Birth Stars: ఈ నక్షత్రాల్లో పుట్టినవారు కెరీర్‌లో టాప్.. వీళ్లను ఎవరూ ఆపలేరు!
Related image2
Zodiac Signs: ఈ 5 రాశులవారు ఈ రంగు డ్రెస్సులు వేసుకోవడం అస్సలు మంచిదికాదు.. ఎందుకో తెలుసా?
36
కర్కాటక రాశి- ఆస్తి లాభం
Image Credit : AI

కర్కాటక రాశి- ఆస్తి లాభం

కర్కాటక రాశి వారికి కుజుడు, గురువు, శుక్రుడు, శని గ్రహాలు అనుకూలంగా ఉండటంతో మే ద్వితీయార్ధం నుంచి పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆర్థికంగా, వృత్తిపరంగా అనేక శుభ పరిణామాలు ఉంటాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. విలువైన ఆస్తులు చేతికొస్తాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఆదాయం, ఆస్తుల విలువ గణనీయంగా పెరుగుతుంది.

46
తుల రాశి- మంచి గుర్తింపు
Image Credit : our own

తుల రాశి- మంచి గుర్తింపు

శని, రాహువు, గురువు, బుధుడు, కుజుడి అనుగ్రహం వల్ల జూలై నాటికి ఈ రాశి వారు సామాన్యులు కూడా ధనవంతులు అయ్యే అవకాశం ఉంది. ఉన్నత హోదాలో ఉన్నవారితో పరిచయాలు పెరుగుతాయి. సొంత ఇంటి కల నెరవేరుతుంది. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ పెరిగి, వేగంగా పురోగతి సాధిస్తారు. షేర్లు, స్పెక్యులేషన్ల ద్వారా మంచి లాభాలు పొందుతారు.

56
వృశ్చిక రాశి- లక్ష్మీ కటాక్షం
Image Credit : our own

వృశ్చిక రాశి- లక్ష్మీ కటాక్షం

ఈ రాశికి అధిపతి అయిన కుజుడితో పాటు, జూన్ నుంచి గురు బలం, రవి బలం కూడా తోడవడంతో ఈ రాశి వారికి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. వరుసగా రెండుసార్లు ధన యోగాలు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నత స్థానాలు పొందుతారు. వ్యాపారాలు బిజీగా సాగుతాయి. జీవనశైలిలో మార్పు వస్తుంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు వస్తాయి. ఉన్నత కుటుంబంలో వివాహ సంబంధం కుదురుతుంది.

66
మకర రాశి- పట్టిందల్లా బంగారం
Image Credit : Getty

మకర రాశి- పట్టిందల్లా బంగారం

శని, శుక్ర, గురు గ్రహాలు మకర రాశి వారిపై ఏడాది పొడవునా అనుగ్రహం కురిపిస్తాయి. ముఖ్యంగా మే నెల నుంచి వీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆదాయం భారీగా పెరుగుతుంది. ఉద్యోగులు మెరుగైన కంపెనీకి, ఉన్నత స్థానానికి మారే అవకాశం ఉంది. నిరుద్యోగులతో పాటు ఉద్యోగంలో ఉన్నవారికి కూడా విదేశీ ఆఫర్లు వస్తాయి. దాంపత్య జీవితం సంతోషంగా సాగుతుంది. చిన్న ప్రయత్నం చేసినా విజయం సాధిస్తారు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి సొంత నిర్ణయాలతో లాభాలు.. నిరుద్యోగులకు ఉద్యోగాలు!
Recommended image2
Jupiter Transit: గురు, విష్ణుల కలయికతో పవర్ ఫుల్ యోగం.. ఈ 3 రాశులకు రాజభోగం!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ప్రయాణాలలో ప్రమాద సూచనలు.. జాగ్రత్త అవసరం!
Related Stories
Recommended image1
Birth Stars: ఈ నక్షత్రాల్లో పుట్టినవారు కెరీర్‌లో టాప్.. వీళ్లను ఎవరూ ఆపలేరు!
Recommended image2
Zodiac Signs: ఈ 5 రాశులవారు ఈ రంగు డ్రెస్సులు వేసుకోవడం అస్సలు మంచిదికాదు.. ఎందుకో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved