MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Astrology
  • Astrology Forecast: 3 రోజులు ఓపిక పడితే చాలు.. ఈ 6 రాశులవారి దశ మారిపోవడం ఖాయం!

Astrology Forecast: 3 రోజులు ఓపిక పడితే చాలు.. ఈ 6 రాశులవారి దశ మారిపోవడం ఖాయం!

Astrology Forecast: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం త్వరలో ద్విపుష్కర యోగం ఏర్పడనుంది. ఒక నిర్దిష్ట తిథి, వారం, నక్షత్రం కలిసినప్పుడు ఈ యోగం ఏర్పడుతుంది. ఈ యోగం వల్ల 6 రాశులవారికి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయని పండితులు చెబుతున్నారు. ఆ రాశులేవో చూద్దాం.

2 Min read
Author : Kavitha G
Published : Aug 06 2026, 03:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
ద్విపుష్కర యోగం
Image Credit : Chat GPT

ద్విపుష్కర యోగం

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని యోగాలు జీవితంలో ఊహించని మార్పులను తీసుకొస్తాయి. అలాంటి వాటిలో 'ద్విపుష్కర యోగం' చాలా ప్రత్యేకమైంది. ఈ యోగం సమయంలో మొదలుపెట్టే మంచి పనులు రెట్టింపు ఫలితాలనిస్తాయని, ఆగిపోయిన పనులు మళ్లీ విజయవంతం అవుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. పండితుల ప్రకారం ఆగస్టు 9న  ద్విపుష్కర యోగం ఏర్పడనుంది. ఈ యోగం 6 రాశులవారి జీవితాల్లో మంచి మార్పులు, రెట్టింపు అదృష్టం తీసుకురానుంది. మరి ఆ రాశులేవో, వారికి ఏ విషయాల్లో మంచి జరుగుతుందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
వృషభ రాశి- పనుల్లో వేగం
Image Credit : AI Image

వృషభ రాశి- పనుల్లో వేగం

ద్విపుష్కర యోగం ప్రభావం కారణంగా వృషభ రాశి వారికి చాలా కాలంగా ఆగిపోయిన పనులు మళ్లీ వేగం పుంజుకుంటాయి. వృత్తి, ఉద్యోగాలలో మీరు ఎదురుచూస్తున్న అవకాశం మళ్లీ లభించవచ్చు. గతంలో వదిలేసిన ప్రాజెక్టును మళ్లీ మొదలుపెడితే మంచి పురోగతి కనిపిస్తుంది. ఆర్థిక విషయాల్లో ఒత్తిడి తగ్గి, ఆదాయం పెరిగే అవకాశాలు ఏర్పడతాయి. వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి. ఈ సమయంలో చిన్న ప్రయత్నంతో కూడా పెద్ద విజయం అందుకుంటారు.

Related Articles

Related image1
Ketu Moon Conjunction: కేతు, చంద్రుల కలయికతో గ్రహణ యోగం.. ఈ 5 రాశులవారికి చుక్కలే!
Related image2
Telugu Saying: ధర తక్కువని కొంటే, దురద ఎక్కువైందట! పెద్దలు ఈ సామెత ఊరికే చెప్పలేదు!
37
మిథున రాశి– కొత్త అవకాశాలు
Image Credit : AI Image

మిథున రాశి– కొత్త అవకాశాలు

మిథున రాశివారికి ద్విపుష్కర యోగం కొత్త అవకాశాలను తీసుకువస్తుంది. వృత్తి, ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు లాభాలు కురిపిస్తాయి. చాలా కాలంగా ప్రయత్నిస్తున్న ఉద్యోగం, విదేశీ ప్రయాణం లేదా చదువుకు సంబంధించిన విషయాల్లో శుభవార్త వింటారు. కొత్త పరిచయాల ద్వారా ఊహించని లాభాలు పొందే అవకాశం ఉంది. ఇంటా బయటా మీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది.

47
సింహ రాశి – పనుల్లో పురోగతి
Image Credit : Pixabay

సింహ రాశి – పనుల్లో పురోగతి

ద్విపుష్కర యోగం సింహ రాశివారికి శుభ ఫలితాలనిస్తుంది. మీ ప్రతిభను ప్రదర్శించే అవకాశాలను పొందుతారు. గతంలో ఆగిపోయిన పనులు మళ్లీ ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయి. పనిచేసే చోట గౌరవం, ప్రశంసలు పెరుగుతాయి. కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు గతంలో ఎన్నడూ లేని విధంగా రాణిస్తాయి.  జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

57
తుల రాశి – ఆర్థికంగా అనుకూలం
Image Credit : AI Image

తుల రాశి – ఆర్థికంగా అనుకూలం

తుల రాశివారికి ద్విపుష్కర యోగం ఆర్థిక ప్రయోజనాలను అందిస్తుంది. గతంలో నిలిచిపోయిన డబ్బు చేతికి అందుతుంది. కొత్త ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు రావచ్చు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులకు అనుకూల సమయం. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది.

67
ధనుస్సు రాశి – కలలు నెరవేరే కాలం
Image Credit : AI Image

ధనుస్సు రాశి – కలలు నెరవేరే కాలం

ధనుస్సు రాశి వారు ఈ సమయంలో తమ చిరకాల కలలను నెరవేర్చుకోవడానికి ప్రయత్నించవచ్చు. వ్యాపారాలలో కొత్త ఒప్పందాలు, కస్టమర్లు లభించే అవకాశం ఉంది. కొత్త పెట్టుబడులు, ప్రణాళికల్లో మంచి పురోగతి చూస్తారు. వృత్తి, ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. కుటుంబంలో ఎప్పటి నుంచో ఉన్న సమస్యలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు.

77
మకర రాశి – స్థిరమైన వృద్ధి
Image Credit : Getty

మకర రాశి – స్థిరమైన వృద్ధి

మకర రాశి వారికి చాలా కాలంగా ఉన్న సమస్యలకు పరిష్కారం లభించే సమయం ఇది. ఆస్తి, ఉద్యోగం, డబ్బుకు సంబంధించిన ప్రయత్నాల్లో మంచి ఫలితాలు వస్తాయి. గతంలో చేజారిన అవకాశాలు మళ్లీ లభించే సూచనలు బలంగా ఉన్నాయి. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. కొన్ని అవకాశాలు భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా ఉంటాయి.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు!
Recommended image2
Vinayaka Chavithi 2026: వినాయక చవితి తర్వాత ఈ 4 రాశులవారి దశ తిరగడం ఖాయం!
Recommended image3
Ketu Gochar: 18 ఏళ్ల తర్వాత కేతు మాయాజాలం .. ఈ 5 రాశుల వారికి తిరుగులేని అదృష్టం, ధనయోగం!
Related Stories
Recommended image1
Ketu Moon Conjunction: కేతు, చంద్రుల కలయికతో గ్రహణ యోగం.. ఈ 5 రాశులవారికి చుక్కలే!
Recommended image2
Telugu Saying: ధర తక్కువని కొంటే, దురద ఎక్కువైందట! పెద్దలు ఈ సామెత ఊరికే చెప్పలేదు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved