- Home
- Astrology
- Varahina Dosham : తనకంటే పెద్దవయసు అమ్మాయిని అబ్బాయి పెళ్లిచేసుకోవచ్చా..? జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతోంది?
Varahina Dosham : తనకంటే పెద్దవయసు అమ్మాయిని అబ్బాయి పెళ్లిచేసుకోవచ్చా..? జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతోంది?
Varahina dosham : పెళ్ళిచేసుకునే అబ్బాయి కంటే అమ్మాయి వయసు ఎక్కువగా ఉంటే ఏమవుతుంది? జ్యోతిష్యం ప్రకారం కలిగే దోషాలేంటి? వీటివల్ల కలిగే అనర్ధాలేమిటి?

పెళ్లాడే అమ్మాయి కంటే అబ్బాయి ఎందుకు పెద్దవాడై ఉండాలి?
Varahina dosham: గతంలో పెళ్లి అంటే శాస్త్రోక్తంగా జరిగేది... కాబట్టి ప్రతిదీ పెద్దలు నిర్ణయించి అన్నీ బాగుంటేనే పెళ్లి చేసేవారు. కానీ కాలం మరింది... ఇప్పుడు అమ్మాయి, అబ్బాయి ప్రేమించుకుని పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. వారి పెళ్లికి అంగీకరించి మండపంలో అక్షింతలు వేసి ఆశీర్వదించడం తప్ప పెద్దలు చేయడానికి ఏమీ ఉండటంలేదు. కులమతాలు, జాతకాలు కలవకపోయినా సరే.. చివరికి అబ్బాయి కంటే అమ్మాయి పెద్దదైనా మనసులు కలిశాయి కాబట్టి పెళ్లి చేసుకుంటున్నారు. కానీ ఇలా తనకంటే వయసులో పెద్దదైన అమ్మాయిని అబ్బాయి పెళ్లాడటంవల్ల అనేక సమస్యలు ఉంటాయని... జ్యోతిష్య శాస్త్రం కూడా ఇలాంటివి అంగీకరించదని పండితులు చెబుతున్నారు.
వయసులో పెద్ద అమ్మాయిని పెళ్లాడితే కలిగో దోషమేంటి?
పెళ్ళిచేసుకోబోయే అమ్మాయి వయసు తనకంటే రెండేళ్ళు చిన్నగా ఉండేలా చూసుకోవాలని అబ్బాయిలకు సూచిస్తున్నారు పండితులు. ఇంత తేడా కుదరకపోతే కనీసం సమాన వయసుగల అమ్మాయిని ఎంచుకోవాలట... కానీ వయసులో తనకంటే పెద్ద అమ్మాయిని పెళ్లిచేసుకుంటేమాత్రం ‘వరహీన లేదా వంధ్యా దోషం’ తప్పదని హెచ్చరిస్తున్నారు. దీనివల్ల కొత్త జీవితంలో సమస్యలు ఎదురవుతాయని అంటున్నారు.
ఏమిటీ వరహీన దోషం?
వరహీన దోషాన్ని జ్యోతిష్యశాస్త్రంలో వంధ్యా దోషం అనికూడా పిలుస్తారు. ఇది అనేక కారణాల వల్ల ఏర్పడుతుంది... ఇందులో ఒకటి భార్యాభర్తల మధ్య వయసు తేడా. అబ్బాయి కంటే అమ్మాయి వయసులో పెద్దదై ఉంటే ఈ దోషం ఉంటుందని... దీనివల్ల సంసారంజీవితం సాఫీగా సాగదని పండితులు చెబుతున్నారు. ఈ దోషంవల్ల అబ్బాయిలే కాదు అమ్మాయిలు ఇబ్బందులు పడతారు.. కాబట్టి పెళ్లి సమయంలో ఇద్దరూ జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలని అంటున్నారు జ్యోతిష్య నిపుణులు.
వరహీన దోషానికి నివారణ లేదా?
ఈ వరహీన దోషం వల్ల దంపతులకు సంతానయోగం ఉండదు... దోష నివారణకు పూజలు చేసినా కొందరికి ఫలితం ఉండకపోవచ్చని చెబుతున్నారు. కాబట్టి ఈ దోషం ఉండకూడదంటే ఆ కాలంలో పెద్దలు చెప్పినట్లుగానే వయసులో చిన్నదైన అమ్మాయినే పెళ్లాడాలి. అప్పుడే దోషాలు లేకుండా సంతాన యోగం కలుగుతుందని, సంసార జీవితంలో ఇతర సమస్యలు కూడా ఉండవని పండితులు అంటున్నారు.
వితండవాదం చేస్తే ఏం చేయలేం?
అయితే కొందరు సచిన్ తనకంటే వయసులో పెద్దదైన అంజలిని పెళ్లాడలేదా? అభిషేక్ బచ్చన్ కూడా ఐశ్వర్యరాయ్ ని పెళ్లాడాడుగా? వాళ్లు పిల్లాపాపలతో హ్యాపీగానే ఉన్నారుగా.. అలాంటప్పుడు కేవలం మాకే దోషం కలుగుతుందా? అని వితండవాదం చేసేవారు ఉంటారు... అలాంటివారికి ఏమీ చెప్పలేమని జ్యోతిష్య పండితులు అంటున్నారు. జ్యోతిష్యాన్ని నమ్మించే మంచి ఫలితాలుంటాయి... కాబట్టి వీటిని పాటించాలి... లేదంటే జీవితంలో సమస్యలు తప్పవంటున్నారు పండితులు.
గమనిక
ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం, సాధారణ జ్యోతిష్య అంచనాల ఆధారంగా రాయబడింది. దీని కచ్చితత్వాన్ని ఏషియానెట్ తెలుగు నిర్ధారించదు. పూర్తి వివరాలకు జ్యోతిష్యులను సంప్రదించడం మంచిది.