- Home
- Astrology
- Astrology: 5 గ్రహాల్లో మార్పులు.. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. లేదంటే వివాదాలు తప్పవు
Astrology: 5 గ్రహాల్లో మార్పులు.. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. లేదంటే వివాదాలు తప్పవు
Astrology: అక్టోబర్‌లో ఒకేసారి ఐదు ప్రధాన గ్రహాల్లో మార్పులు జరుగుతున్నాయి. దీని ప్రభావం ఉద్యోగులు, వ్యాపార వర్గాలపై భారీగా పడే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. కెరీర్‌లో ఒత్తిడి, మిస్ కమ్యూనికేషన్ వంటివి జరిగే అవకాశం ఉంది.

బుధుడు, సూర్యుడు మార్పుతో..
అక్టోబర్ 2న బుధుడు కన్య రాశిలో ప్రవేశించాడు, 3న తులలోకి మారాడు. 17న సూర్యుడు తులలోకి చేరడంతో “నిచస్థ” స్థితిలోకి వెళ్తాడు. అంటే బుద్ధి, కమ్యూనికేషన్, అహం మూడు కూడా ఒకదానితో ఒకటి ఢీకొనే సమయం ఇది. చిన్న విషయాలు కూడా పెద్ద వివాదాలకు దారితీయవచ్చు.
సూచన: మాట్లాడే ముందు రెండు సార్లు ఆలోచించండి. ఈ కాలంలో నిశ్శబ్దం కూడా ఒక బలంగా మారవచ్చు.
కన్య రాశిలోకి వెళ్లనున్న శుక్రుడు
అక్టోబర్ 9న శుక్రుడు కన్య రాశిలోకి వెళ్తాడు. ఈ సమయంలో ఫ్యాషన్, సోషల్ మీడియా, ఆకర్షణ కంటే బాధ్యత, ప్రొఫెషనల్ ఫోకస్‌కి ప్రాధాన్యం పెరుగుతుంది. అయితే లగ్జరీపై అధిక ఖర్చు చేసే వారికి నష్టాలు తప్పవు. ఆర్థికంగా ఇబ్బందులు వచ్చే అవకాశ ఉంది.
సూచన: ఈ సమయంలో డబ్బును జాగ్రత్తగా వాడండి.
వృశ్చికంలోకి మంగళుడు
అక్టోబర్ 27న మంగళుడు తన స్వరాశి వృశ్చికంలోకి వెళ్తాడు. ఇది పవర్‌ఫుల్ కానీ ప్రమాదకర గోచారం. ఈ సమయంలో పని ప్రదేశంలో రాజకీయాలు పెరుగుతాయి. మీ ప్రతిభను తగ్గించే ప్రయత్నం జరిగే అవకాశాలు ఉంటాయి.
సూచన: ప్రతీ చిన్న విషయానికి కోపానికి రాకుండా ప్రశాంతంగా పని చేయండి. మౌనం, క్రమశిక్షణే విజయానికి మార్గం అవుతాయి.
కర్కాటక రాశిలోకి గురుడు
అక్టోబర్ 19న గురుడు కర్కాటక రాశిలోకి వెళ్తాడు. ఇది జ్ఞానం, అవకాశాలు, అదృష్టం ఇచ్చే స్థితి. ఈ సమయంలో నిజాయితీగా పనిచేసిన వారికి రివార్డ్, ప్రమోషన్ లేదా కొత్త జాబ్ అవకాశాలు రావచ్చు. కానీ భావోద్వేగంతో నిర్ణయాలు తీసుకుంటే నష్టం కూడా కలగవచ్చు.
సూచన: పనిలో ధర్మం, దయ రెండింటినీ సమతుల్యం చేయండి. గురు ప్రభావం మీ కర్మను సఫలీకృతం చేస్తుంది.
తుల రాశిలోకి సూర్యుడు
అక్టోబర్ 17న సూర్యుడు తుల రాశిలోకి వెళ్లి “నిచస్థ” స్థితిలోకి వెళ్తాడు. ఇది లీడర్‌షిప్ క్రైసిస్ పీరియడ్‌గా పరిగణిస్తారు. ఈ సమయంలో బాస్ లేదా సీనియర్లతో తగవులు, అసహనం దూరం పెట్టండి. వినమ్రతతో ఉంటే వారు మిమ్మల్ని ముందుకు నడిపిస్తారు.
సూచన: ఈ కాలంలో అహంకారం కాకుండా, వినమ్రతతో పాటు సహనం పాటించండి.
ఇవి పాటిస్తే మంచిది
* సోమవారం శివారాధన చేయండి (బుధ–సూర్య దోష నివారణకు).
* మంగళవారం హనుమాన్ చాలీసా చదవండి (మంగళ గ్రహ శాంతికి).
* గురువారం పసుపు దానాలు చేయండి (గురుని అనుగ్రహానికి).
గమనిక: పైన తెలిపిన విషయాలను పలువురు జ్యోతిష్య పండితులు, ఇంటర్నెట్ వేదికగా అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా అందించడమైంది. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.