MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Zodiac Signs: ఈ రాశుల అబ్బాయిలకు ధనవంతురాలైన అమ్మాయి భార్యగా వస్తుంది!

Zodiac Signs: ఈ రాశుల అబ్బాయిలకు ధనవంతురాలైన అమ్మాయి భార్యగా వస్తుంది!

ప్రతి అబ్బాయి తనకు మంచి భార్య రావాలని కోరుకుంటాడు. అందమైన, గుణవంతురాలైన, ధనవంతురాలైన భార్య వస్తే జీవితం సంతోషంగా సాగిపోతుందని నమ్ముతాడు. జ్యోతిష్యం ప్రకారం కొన్ని రాశుల అబ్బాయిలకు ధనవంతురాలైన అమ్మాయి భార్యగా వస్తుందట. మరి ఆ రాశులేంటో చూద్దామా… 

2 Min read
Author : Kavitha G
Published : Oct 13 2025, 02:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ధనవంతురాలైన భార్యను పొందే రాశులు
Image Credit : istockphoto

ధనవంతురాలైన భార్యను పొందే రాశులు

పెళ్లి బంధం చాలా ప్రత్యేకమైనది. ఈ బంధంలో డబ్బు, ప్రేమ, అనుబంధం అన్నీ ముఖ్యమే. మంచి గుణంతో పాటు ధనవంతురాలైన భార్య వస్తే జీవితంలో కష్టాలకు చోటుండదని చాలామంది అబ్బాయిలు అనుకుంటారు. కానీ అందరికీ అది సాధ్యం కాకపోవచ్చు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల అబ్బాయిలకు ఇది సాధ్యమే. గ్రహ స్థితులు, శుక్రుడు, గురువు వంటి శుభగ్రహాల అనుకూలత వల్ల ధనవంతురాలైన అమ్మాయి వారికి భార్యగా వస్తుందట. అదృష్టవంతులయ్యే అవకాశం ఇస్తుందట. మరి ఆ రాశులు ఏంటో తెలుసుకుందామా…

25
వృషభ రాశి
Image Credit : our own

వృషభ రాశి

వృషభ రాశి వారు శుక్రుడి పాలనలో ఉంటారు. వీరు విలాసవంతమైన జీవితాన్ని ఇష్టపడతారు. సహజంగానే వీరు స్థిరంగా ఆలోచించే వ్యక్తులు, జీవితంలో భద్రత, సౌఖ్యం వీరికి చాలా ముఖ్యం. అంతేకాదు ఈ రాశివారు తమ జీవిత భాగస్వామిగా బలమైన కుటుంబ నేపథ్యం ఉన్న వారిని ఎంచుకునే అవకాశాలు ఎక్కువ. వీరి నిజాయతీ, స్థిరమైన స్వభావం.. ధనవంతులైన మహిళలను ఆకర్షిస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. 

Related Articles

Related image1
Venus Transit: త్వరలో శుక్రుడి సంచారం.. ఈ 3 రాశులకు లక్ష్మీ యోగం.. పట్టిందల్లా బంగారమే!
Related image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న అవకాశం దక్కుతుంది!
35
సింహ రాశి
Image Credit : our own

సింహ రాశి

సింహ రాశివారు సూర్యుని పాలనలో ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు స్వాభిమాన బలంతో పాటు నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఈ స్వభావం ఇతరులను ఆకర్షించే మంత్రంలా పనిచేస్తుంది. సింహరాశి వారు విలాసాలు, గొప్పదనం, గౌరవం వంటి విషయాలకు అధిక ప్రాధాన్యం ఇస్తారు. వీరి ధైర్యం, భాగస్వామిని గౌరవించే తీరు ధనవంతులైన మహిళలను ఆకర్షిస్తుంది.

45
తుల రాశి
Image Credit : our own

తుల రాశి

తుల రాశి శుక్రుడి పాలనలో ఉంటుంది. వీరి చక్కని మాటతీరు, ఆహ్లాదకరమైన స్వభావం ధనవంతులైన మహిళలను ఆకర్షిస్తుంది. తుల రాశి వారు బంధాలను చక్కగా కలపుకొని వెళ్తారు. వీరిని ఆకర్షించే భాగస్వాములు కూడా బలమైన ఆర్థిక స్థితిలో ఉండే వ్యక్తులే ఎక్కువ. వీరి జీవనశైలికి సరిపడే భాగస్వామిని గ్రహ యోగాలే కలుపుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.

55
మకర రాశి
Image Credit : our own

మకర రాశి

మకర రాశి అబ్బాయిలు క్రమశిక్షణ, ఉన్నత లక్ష్యాలను కలిగి ఉంటారు. వీరి అంకితభావం, బాధ్యతాయుతమైన స్వభావం ధనవంతులైన మహిళలను ఆకర్షిస్తుంది. భాగస్వామిని గౌరవించడం, దీర్ఘకాలిక బంధాన్ని కోరుకోవడం వల్ల వీరికి ధనవంతురాలైన భార్య దొరికే అవకాశం ఎక్కువని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
బంధుత్వం

Latest Videos
Recommended Stories
Recommended image1
Saturn Combust: శని అస్తమయం.. ఈ 4 రాశులవారికి రెట్టింపు అదృష్టం, ఆదాయం!
Recommended image2
Mercury Transit: బుధుడి వక్ర గమనం వల్ల, ఈ 3 రాశుల వారు ఆర్థికంగా దూసుకెళ్లిపోతారు
Recommended image3
Sun Moon Conjunction: సూర్య చంద్ర యుతి.. హోలీ తర్వాత ఈ రాశులకు టెన్షన్లు తప్పవు..!
Related Stories
Recommended image1
Venus Transit: త్వరలో శుక్రుడి సంచారం.. ఈ 3 రాశులకు లక్ష్మీ యోగం.. పట్టిందల్లా బంగారమే!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న అవకాశం దక్కుతుంది!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved