Astro Tips: ఇలా చేస్తే మీ అప్పులన్నీ తీరిపోతాయి..!
ప్రతి మంగళవారం మీ ఇంట్లో వినాయకుడి ముందు నెయ్యి దీపం వెలిగించాలి. అలా వెలిగించి, గణేశుడి మంత్రాన్ని జంపించాలి. ఇలా ప్రతి మంగళవారం చేయడం వల్ల అప్పులు తీరిపోయే అవకాశం ఉంది.

అప్పుల బాధ తీరాలంటే..
అప్పుల బాధతో బాధపడేవారు మనలో చాలా మందే ఉంటారు.ఆ అప్పులు తీర్చేందుకు చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ, కొన్ని వచ్చిన సంపాదన అంతా ఖర్చులకే అయిపోతూ ఉంటుంది. మరో పక్క తీసుకున్న అప్పు వడ్డీతో కలిపి పెరిగిపోతూ ఉంటుంది. మీరు కూడా ఇలా అప్పుల సమస్యతో బాధపడుతున్నట్లయితే.. జోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని పనులు చేయడం వల్ల ఆ అప్పుల ఊభి నుంచి బయటపడే అవకాశం ఉంది.
గణేశుడి పూజ
ఆర్థిక స్థిరత్వం, అప్పుల బాధ నుంచి విముక్తి పొందాలంటే హిందూ సంప్రదాయాలలో అనేక శాస్త్రోక్త పద్దతులు ఉన్నాయి. మంగళవారాల్లో గణేశుడిని పూజించడం వల్ల ద్వారా జీవితంలో అడ్డంకులను తొలగించవచ్చని నమ్ముతారు. దాని కోసం ప్రతి మంగళవారం మీ ఇంట్లో వినాయకుడి ముందు నెయ్యి దీపం వెలిగించాలి. అలా వెలిగించి, గణేశుడి మంత్రాన్ని జంపించాలి. ఇలా ప్రతి మంగళవారం చేయడం వల్ల అప్పులు తీరిపోయే అవకాశం ఉంది.
సూర్య నమస్కారం..
ప్రతి ఉదయం సూర్యోదయ సమయంలో సూర్యుడికి నీళ్లు సమర్పించి, కృతజ్ఞతలు తెలపడం ద్వారా సానుకూల శక్తులు వృద్ధి చెంది ఆర్థికంగా అభివృద్ధి సాధించవచ్చు. అలాగే, గురువారాల్లో గురు బీజ మంత్రాన్ని జపించడం, అవసరమైన రత్నాలను (ఉదా: పసుపు నీలమణి, ఎర్ర పగడపు) ధరించడం ద్వారా గ్రహబలాన్ని పొందవచ్చు.ఇలా చేయడం వల్ల కూడా ఆర్థికంగా మెరుగుపడతారు.
ఉపవాసం..
ఏకాదశి రోజున ఉపవాసం చేయడం వల్ల కూడా చాలా మంచి జరుగుతుంది. మనం కోరుకున్నది జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. శివుడికి రుద్రాభిషేకం చేయడం ద్వారా మనశ్శాంతి , ఆర్థిక ఒత్తిడుల నుంచి ఉపశమనం పొందవచ్చని నమ్మకం. శనివారాల్లో శనిదేవుని ముందు నెయ్యి దీపం వెలిగించి శని చాలీసా లేదా శని మంత్రాలు పఠించడం ద్వారా ఆర్థిక కష్టాలు తగ్గుతాయని చెబుతారు.
లక్ష్మీ దేవి ఆరాధాన..
గురువారాల్లో దానధర్మం చేయడం, లక్ష్మీ దేవిని ప్రతి రోజు మంత్రాలతో ఆరాధించడం సంపద , శ్రేయస్సును ఆకర్షించేందుకు ఉపయోగపడుతుంది. చివరగా, ఇంటి లేదా కార్యాలయ పరిసరాలను శుభ్రంగా, గాలివాటానికి అనుకూలంగా ఉంచడం, ఉప్పు నీటితో నేలను తుడవడం వంటి నిత్యచర్యలు సానుకూల శక్తి ప్రవాహాన్ని నిర్వహించడంలో దోహదపడతాయి. వీటిని రెగ్యులర్ గా ఫాలో అవ్వడం వల్ల ఆర్థిక సమస్యలు తగ్గి, సంపద పెరిగే అవకాశం ఉంటుంది.