Zodiac signs: 2026లో ఇతరుల చేతిలో మోసపోయే రాశులు ఇవే..!
Zodiac signs: 2026 సంవత్సరంలో గ్రహ గమనాలు, ముఖ్యంగా రాహు-కేతువుల సంచారం, శని దేవుడి మార్పుల వల్ల కొన్ని రాశుల వల్ల కొన్ని రాశులవారు ఇతరులను అతిగా నమ్మి ఆర్థికంగా లేదా వ్యక్తిగతంగా మోసపోయే అవకాశం ఉంది.

1.మీన రాశి..
2026లో రాహువు మీన రాశిలోనే సంచరిస్తున్నాడు. దీని వల్ల ఈ రాశివారు ఎక్కువగా భ్రమల్లో బతికేస్తూ ఉంటారు. దీంతో.. వీరిని ఇతరులు సులభంగా మోసం చేసే అవకాశం ఉంది. కొత్తగా పరిచయమైన వ్యక్తులు మిమ్మల్ని మాటలతో బుట్టలో వేసుకునే అవకాశం ఉంది. మీ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని డబ్బు అడిగే అవకాశం ఉంది. అందుకే, ఈ రాశివారు ఈ ఏడాది.. పెద్ద మొత్తంలో డబ్బులు ఎవరికీ అప్పుగా ఇవ్వకండి. అదేవిధంగా ఎవరికీ షూరిటీ సంతకాలు కూడా పెట్టకండి
సింహ రాశి...
సింహ రాశివారికి 7వ స్థానంలో రాహువు ప్రభావం ఉండటం వల్ల భాగస్వామ్య వ్యాపారాల్లో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది ఈ రాశివారు ఇతరుల చేతిలో ఈజీగా మోసపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. బిజినెస్ పార్టనర్లు లేదా చాలా కాలంగా మీతో ఉన్న స్నేహితులే మీకు తెలియకుండా వెన్నుపోటు పొడిచే అవకాశం ఉంది. కాబట్టి.. ఈ ఏడాది ఈ రాశివారు వ్యాపార లావాదేవీలు అన్నీ పేపర్ మీద క్లియర్ గా ఉండేలా చూసుకోవాలి.గుడ్డిగా ఎవరినీ నమ్మద్దు.
కుంభ రాశి...
కుంభ రాశి వారికి ఏలినాటి శని ప్రభావం కొనసాగుతోంది. ఇది మిమ్మల్ని మానసిక ఒత్తిడికి గురి చేసే అవకాశం ఉంది. కాబట్టి.. వీరు ఈ ఏడాది అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇతరులు మిమ్మల్ని ఈజీగా మోసం చేసే అవకాశం ఉంది. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చని ఎవరైనా చెబితే నమ్మి..ఇన్వెస్ట్ చేయకండి. ఆన్ లైన్ మోసాలు లేదా ఫేక్ స్కీమ్స్ వల్ల నష్టపోయే అవకాశం ఉంది.
మిథున రాశి...
రాహు-కేతువుల ప్రభావం వల్ల మీ ఆలోచనల్లో స్పష్టత తక్కువగా ఉంటుంది. ఈ ఏడాది ఈ రాశివారు తొందరగా మోసపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ లేదా ఆస్తి వ్యవహారాల్లో మధ్యవర్తులను నమ్మి మోసపోయే అవకాశం ఉంది. డాక్యుమెంట్లు సరిగా చూడకుండా ఏ అగ్రిమెంట్ పై సంతకం చేయకండి. ఈ ఏడాది ఈ రాశివారు ప్రతి విషయానికి ఒకటికి రెండుసార్లు ఇంట్లోని పెద్దలతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకోండి.

