Zodiac signs: శని ప్రభావం.. ఆరు నెలలు ఈ రాశులకు కష్టాలు తప్పవు..!
శని తిరోగమనం నాలుగు రాశుల వారికి ఆరు నెలల పాటు కష్టాలు తేనుంది. ముఖ్యంగా ఆర్థికంగా, ఆరోగ్యంగా సమస్యలు రానున్నాయి.
- FB
- TW
- Linkdin
Follow Us

shani retrograde
జోతిష్యశాస్త్రం ప్రకారం శని గ్రహాన్ని కర్మఫల దాతగా పరిగణిస్తారు. మన కర్మల ఆధారంగా శని ఫలితాలు ఇస్తాడు. ప్రస్తుతం శని వక్ర గతిలో ప్రయాణిస్తున్నాడు. ఈ శని తిరోగమన పరిస్థితి నవంబర్ 28 వరకు కొనసాగుతుంది. ఈ ఆరు నెలల కాలం నాలుగు రాశుల వారికి కష్టకాలంగా మారనుంది.అనుకోని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. మరి, ఆ రాశులేంటో చూద్దామా...
1.మేష రాశి...
శని వక్రగతికి మేష రాశివారు చాలా ప్రభావితమౌతారు. ఈ సమయంలో వీరు కొత్త పనులు మొదలు పెట్టకపోవడం మంచిది.ఆకస్మికంగా ప్రయాణాలు చేయాల్సిరావచ్చు. అనేక ధన వ్యయాలు ఎదురౌతాయి. ముఖ్యంగా మానసిక ఒత్తిడి, ఆందోళన, నిరాశలాంటి ఆరోగ్య సమస్యలు కలగవచ్చు. కాబట్టి.. ధైర్యంగా ఎదుర్కోవాలి.
2.మీన రాశి...
మీన రాశివారికి శని వక్రగతికి కష్టకాలంగా సాగనుంది. శని ప్రభావం కారణంగా వీరికి ఆశించిన ఫలితాలు చాలా ఆలస్యం అవుతాయి. అనుకున్న సమయానికి అందకపోవచ్చు. ఆరోగ్య పరంగా జాగ్రత్తగా ఉండాలి. కొత్త పెట్టుబడులు, పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు శాంతంగా ఆలోచించండి.
3. ధనుస్సు రాశి
శని వక్రగతితో ధనుస్సు రాశివారికి ఆర్థిక నష్టాలు ఎదురయ్యే అవకాశముంది. అనవసర ఖర్చులు పెరుగుతాయి. తమ పేరు ప్రతిష్టలకు భంగం కలుగకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ అవసరం.
4. సింహ రాశి
సింహరాశివారికి ఈ కాలం చాలా ఒత్తిడితో నిండి ఉంటుంది. కోపాన్ని నియంత్రించుకోవాలి. శారీరక, మానసిక ఆరోగ్యం క్షీణించే ప్రమాదం ఉంది. కుటుంబ సభ్యుల సహకారం, పెద్దల సలహాలు తప్పనిసరి. శని పూజలు, ధ్యానం చేయడం ద్వారా ఉపశమనం పొందవచ్చు.
గమనిక: శని అనేది శిక్షించే గ్రహం కాదు, నేర్పించే గ్రహం. క్రమశిక్షణతో, ఓర్పుతో, ధర్మపథంలో నడుస్తూ మంచి కర్మలు చేస్తే శని అనుగ్రహం కూడా లభిస్తుంది.