అసెంబ్లీకి మాల్యాద్రి: బాపట్ల టీడీపీ ఎంపీ అభ్యర్ధిగా మాజీ ఐఎఎస్?
గుంటూరు జిల్లా బాపట్ల ఎంపీ శ్రీరాం మాల్యాద్రి వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయాలనే యోచనలో ఉన్నారని పార్టీలో ప్రచారం సాగుతోంది.
17

గుంటూరు జిల్లా బాపట్ల ఎంపీ శ్రీరాం మాల్యాద్రి వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయాలనే యోచనలో ఉన్నారని పార్టీలో ప్రచారం సాగుతోంది. దీంతో బాపట్ల ఎంపీ స్థానానికి కొత్త అభ్యర్ధులను చంద్రబాబునాయుడు పరిశీలిస్తున్నారు.

27
గుంటూరు జిల్లా బాపట్ల ఎంపీ స్థానం నుండి 2014 ఎన్నికల్లో శ్రీరాం మాల్యాద్రి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. అయితే వచ్చే ఎన్నికల్లో తాను ఎంపీ స్థానం నుండి కాకుండా అసెంబ్లీకే పోటీ చేయాలని మాల్యాద్రి భావిస్తున్నట్టు పార్టీలో చర్చ సాగుతోంది. ఇదే విషయాన్ని మాల్యాద్రి బాబుకు చెప్పినట్టు సమాచారం.

37
దీంతో గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని తాడికొండ అసెంబ్లీ స్థానం నుండి మాల్యాద్రిని బరిలోకి దింపాలని కూడ బాబు భావిస్తున్నారు. ఈ సమావేశంలో ఇదే విషయమై ప్రతిపాదన వచ్చినట్టుగా పార్టీ నేతలు చెబుతున్నారు.

47
వివాదరహితుడుగా ఉన్న మాల్యాద్రిని తెరమీదికి తీసుకురావడం వల్ల తాడికొండలో అసమ్మతికి చెక్ పెట్టే అవకాశం ఉందని టీడీపీ నాయకత్వం భావిస్తోంది. తాడికొండలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న శ్రవణ్‌కుమార్‌కు నామినేటేడ్ పదవి లేదా మరో రకంగా న్యాయం చేస్తానని చంద్రబాబు శ్రవణ్‌కుమార్ కు హామీ ఇచ్చినట్టు చెబుతున్నారు.

57
మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరిని ఎంపీ మాల్యాద్రి రాజకీయాల్లో తన గాడ్‌ఫాదర్‌గా చెబుతారు. దీంతో మాల్యాద్రిని ఎంపీ స్థానంలో కాకుండా అసెంబ్లీ స్థానంలో పోటీకి దింపే విషయమై బాబు చర్చించినట్టు సమాచారం.

67
పార్టీ అవసరాల రీత్యా మాల్యాద్రిని అసెంబ్లీకి మార్చాల్సిన పరిస్థితులు అనివార్యంగా మారాయని సుజనాకు చెప్పినట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. బాపట్ల ఎంపీ స్థానంలో కొత్త అభ్యర్థుల ఎంపిక కోసం బాబు ప్రయత్నాలు సాగిస్తున్నారు.

77
బాపట్ల ఎంపీ స్థానానికి శ్రవణ్ కుమార్ పేరును కూడ చంద్రబాబునాయుడు పరిశీలిస్తున్నారు.మరో వైపు ఓ మాజీ ఐఎఎస్ అధికారి పేరును కూడ ఈ స్థానం కోసం పరిశీలిస్తున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. తాడికొండ అసెంబ్లీ సెగ్మెంట్ అభ్యర్ధిని ఫైనల్ చేసిన తర్వాత బాపట్ల ఎంపీ సీటుపై తేల్చనున్నారు.

Latest Videos