కాల్వకు ఎసరు: సీటు కోసం జేసీ అల్లుడు పట్టు

First Published 12, Mar 2019, 12:44 PM

అనంతపురం జిల్లాలోని రాయదుర్గం అసెంబ్లీ సీటును మంత్రి కాల్వ శ్రీనివాసులుకు కేటాయించడాన్ని నిరసిస్తూ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మెట్టు గోవింద్ రెడ్డిలు ఇండిపెండెంట్లుగా పోటీ చేస్తామని చెబుతున్నారు. 

అనంతపురం జిల్లాలోని రాయదుర్గం అసెంబ్లీ సీటును మంత్రి కాల్వ శ్రీనివాసులుకు కేటాయించడాన్ని నిరసిస్తూ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మెట్టు గోవింద్ రెడ్డిలు ఇండిపెండెంట్లుగా పోటీ చేస్తామని చెబుతున్నారు. దీంతో వారిని బుజ్జగించేందుకు టీడీపీ నాయకత్వం రంగంలోకి దిగింది.

అనంతపురం జిల్లాలోని రాయదుర్గం అసెంబ్లీ స్థానం నుండి  2014 అసెంబ్లీ ఎన్నికల్లో కాలువ శ్రీనివాసులు టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. వాస్తవానికి ఈ నియోజకవర్గానికి జేసీ దివాకర్ రెడ్డి బంధువు దీపక్ రెడ్డి ఆ సమయంలో ఇంచార్జీగా ఉన్నాడు.

kaluva mettu govinఇదే అసెంబ్లీ నియోజకవర్గం నుండి మెట్టు గోవింద్ రెడ్డి కూడ ఆ ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్టును ఆశించారు. కానీ, బోయ సామాజిక వర్గానికి చెందిన కాలువ శ్రీనివాసులుకు చంద్రబాబునాయుడు రాయదుర్గం టిక్కెట్టును కేటాయించారు.dreddy

రాయదుర్గం అసెంబ్లీ నియోజకవర్గంలో బోయ సామాజికవర్గానికి చెందిన ఓటర్లు గెలుపు ఓటములపై ప్రభావం చూపనున్నారు. దీంతో గత ఎన్నికల్లో చంద్రబాబునాయుడు కాలువ శ్రీనివాసులుకు టిక్కెట్టు కేటాయించారు.

గత ఎన్నికల సమయంలో రాయదుర్గం అసెంబ్లీ టిక్కెట్టు కోసం దీపక్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు. ఆ ఎన్నికల సమయంలోనే జేసీ దివాకర్ రెడ్డి, ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డిలు కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో చేరారు. జేసీ దివాకర్ రెడ్డికి అనంతపురం ఎంపీ స్థానాన్ని,  ప్రభాకర్ రెడ్డికి తాడిపత్రి అసెంబ్లీ స్థానాన్ని చంద్రబాబునాయుడు కేటాయించారు.

జేసీ సోదరులకు అల్లుడైన దీపక్ రెడ్డికి కూడ రాయదుర్గం టిక్కెట్టును కోరారు. అయితే ఒకే కుటుంబానికి మూడు టిక్కెట్లు కేటాయించే విషయమై బాబు పునరాలోచన పడ్డారు. దీంతో రాయదుర్గం సీటును కాలువకు కేటాయించారు.

ఆ ఎన్నికల సమయంలో ఎమ్మెల్సీ ఇస్తామని దీపక్ రెడ్డికి బాబు హామీ ఇచ్చారు.ఈ హామీ మేరకు చంద్రబాబునాయుడు ఎమ్మెల్సీ  పదవిని ఇచ్చారు. గత ఎన్నికల్లో ఈ స్థానం నుండి కాలువ శ్రీనివాసులుకు బాబు చివరి నిమిషంలో టిక్కెట్టు ఇచ్చారు. ఆ ఎన్నికల్లో కాలువ శ్రీనివాసులు విజయం సాధించారు. ఆ తర్వాత బాబు కేబినెట్‌లో ఆయన కొనసాగుతున్నారు.

మరోవైపు ఇదే స్థానం నుండి కాలువ శ్రీనివాసులుకు బాబు టిక్కెట్టును కేటాయించారు.దీంతో ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి,  మాజీ ఎమ్మెల్సీ మెట్టు గోవింద్ రెడ్డిలు ఈ స్థానం నుండి పోటీ చేయాలని భావిస్తున్నారు. కాలువకు టిక్కెట్టు కేటాయించడాన్ని నిరసిస్తూ పోటీకి దిగుతామని ఈ ఇద్దరు నేతలు ప్రకటించారు.

దీంతో దీపక్ రెడ్డితో జేసీ దివాకర్ రెడ్డి భేటీ అయ్యారు. మెట్టు గోవింద్ రెడ్డితో మంత్రి కాలువ శ్రీనివాసులు మంగళవారం నాడు భేటీ అయ్యారు. పోటీ చేయాలనే ప్రతిపాదనను విరమించుకోవాలని  వీరిద్దరికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.  కొద్దిసేపట్లోనే తన భవిష్యత్తు కార్యాచరణను వెల్లడించనున్నట్టు మెట్టు గోవింద్ రెడ్డి ప్రకటించారు.

loader