జంప్ జిలానీలు: వైసిపి నుంచి ఒకరు ఔట్, ముగ్గురు ఇన్

First Published 6, Mar 2019, 5:41 PM

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. రాజకీయ భవిష్యత్ కోసం స్తబ్ధుగా ఉన్న పార్టీ నేతలు గోడలు దూకేందుకు రెడీ అవుతున్నారు. వారితోపాటు కొంతమంది టికెట్ల సర్దుబాటు నేపథ్యంలో పార్టీలు జంప్ చేస్తున్నారు. దీంతో ఏపీ రాజకీయాలు రంజుగా ఉన్నాయి. 

ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే వలసలు చేరేందుకు నేతలు ముహూర్తం కుదుర్చుకున్నారు. మార్చి 9న వైసీపీ, టీడీపీలోకి భారీ వలసలు ఉన్నాయి. ముఖ్యంగా బిగ్ షాట్ లు పార్టీలు మారుతున్నారు.

మార్చి 9న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గౌరు సుచరిత తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. అదే రోజు గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, టీడీపీ వ్యవస్థాపక సభ్యుడు దాసరి జై రమేష్, ఆయన సోదరుడు మాజీ ఎమ్మెల్యే దాసరి వెంకట బాలవర్థనరావులు వైసీపీ గూటికి చేరనున్నారు. అంటే వైసీపీ నుంచి ఒకరు అవుట్ అవ్వగా ముగ్గురు ఇన్ అన్న మాట.

గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తెలుగుదేశం పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల్లో టికెట్ కేటాయించే అవకాశం లేకపోవడంతో ఆయన పార్టీ వీడాలని నిర్ణయించుకున్నారు.

దీంతో మంగళవారం తెలుగుదేశం పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ నెల 9న వైసీపీలో చేరేందుకు ముహుర్తం ఖరారు చేసుకున్నా రు. టీడీపీకి రాజీనామా చేస్తున్న ట్లు పార్టీ అధినేత, సీఎం చంద్రబాబుకు లేఖ పంపారు. శాసనసభ్యత్వానికి చేసిన రాజీనామాను శాసనసభ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావుకు పంపించారు.

టీడీపీలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో తాను టీడీపీలో కొనసాగాలా లేక వైసీపీలో చేరాలా అన్న అంశంపై మోదుగుల ఊగిసలాడుతున్నారు. అయితే టికెట్ ఇచ్చేది లేదని చంద్రబాబు పరోక్షంగా సంకేతాలివ్వడంతో ఇక ఆయన సైకిల్ దిగిపోయారు.

2009 ఎన్నికల్లో టీడీపీ నుంచి నరసరావుపేట ఎంపీగా మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల్లో కూడా ఎంపీగా పోటీ చెయ్యాలని భావించినా చంద్రబాబు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చెయ్యాలని సూచించారు. దీంతో అయిష్టంగానే అసెంబ్లీకి పోటీ చేసి గెలుపొందారు.

ఇకపోతే తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా గుర్తింపు తెచ్చుకున్న దాసరి జై రమేష్ సైతం తెలుగుదేశం పార్టీని వీడేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. ఇటీవలే తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పిన దాసరి జై రమేష్ ఈనెల 9న వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు.

వైఎస్ జగన్ ను కలిసిన సమయంలో దాసరి జై రమేష్ తెలుగుదేశం పార్టీపైనా చంద్రబాబు నాయుడుపైనా కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అభివృద్ధికి ఎన్నో విధాలుగా సహాయ సహకారాలందించానని, పార్టీ ఫండ్‌ రూపంలో ఎంతో సొమ్మును ధారాదత్తం చేశానని, కానీ ఆ పార్టీలో మా కుటుంబానికి సరైన ప్రాధాన్యం లేదని ఆరోపించారు.

తన సోదరుడు డాక్టర్‌ దాసరి వెంకటబాలవర్ధనరావు ఎన్నో ఏళ్లుగా తెలుగుదేశం పార్టీకి నిబద్ధతతో కూడిన నాయకుడిగా సేవలందించారని, ఆయనకు కూడా ఆ పార్టీలో సముచిత స్థానం లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ నెల 9వ తేదీ అమరావతి రాజధాని తాడేపల్లిలో వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి స్వగృహంలో పార్టీ తీర్థంపుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. దాసరి జై రమేష్ విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా రాబోయే ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.

బుధవారం పార్టీ కార్యకర్తలతో సమావేశమైన జైరమేష్‌, ఆయన సోదరుడు దాసరి వెంకట బాల వర్థనరావులు కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అన్న జై రమేష్ తీసుకున్న నిర్ణయానికే తాను కట్టుబడి ఉన్నానని తెలిపారు. ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో తాను పార్టీ నియమనిబంధనలకు కట్టుబడి పని చేశానని చెప్పుకొచ్చారు.

అయితే ఈనాడు చంద్రబాబు నాయుడు తమను పక్కనపెట్టి అవకాశవాద రాజకీయాలకు తెరలేపుతున్నారన్నారని ఆరోపించారు. తాను కూడా తెలుగుదేశం పార్టీలో ఇమడలేకపోతున్నానని, త్వరలోనే పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి, వైసీపీలో చేరనున్నట్లు ప్రకటించారు.

రానున్న ఎన్నికల్లో ఓడిపోతామేమోన్న భయంతో ఆయన కుటిల రాజకీయాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడం తథ్యమని జగన్ సీఎం కావడం ఖాయమంటూ జోస్యం చెప్పారు. పార్టీ అభివృద్ధికి పాటుపడిన వారిని పక్కనపెట్టి అనర్హులను అందలమెక్కించటం చంద్రబాబుకు అలవాటేనని దుయ్యబట్టారు దాసరి సోదరులు.

ఇకపోతే కర్నూల్ జిల్లా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, ఆమె భర్త వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్ రెడ్డి మార్చి 9న తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేసి వారు 9న సైకిలెక్కాలని నిర్ణయించుకున్నారు.

కాటసాని రాంభూపాల్ రెడ్డికే వచ్చే ఎన్నికల్లో వైసీపీ టిక్కెట్టును ఇవ్వనున్నట్టు సంకేతాలు రావడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే గౌరు చరిత దంపతులు అసంతృప్తికి గురయ్యారు. గౌరు దంపతులకు ఎమ్మెల్సీ పదవిని ఇవ్వనున్నట్టు జగన్ హామీ ఇచ్చారు. దీంతో  మనస్తాపానికి గురైన గౌరు దంపతులు వైసీపీకి గుడ్ బై చెప్పారు. మెుత్తానికి మార్చి9న వైసీపీని ఒకరు వీడుతుంటే ముగ్గురు  కీలక నేతలు వైసీపీలో చేరుతున్నారు.