మాకొద్దీ ఎంపీ టికెట్లు: చంద్రబాబు బేజారు, ఎందుకిలా...

First Published 9, Mar 2019, 4:38 PM

మాకొద్దీ ఎంపీ టికెట్లు: చంద్రబాబు బేజారు, ఎందుకిలా...

అమరావతి: లోకసభకు పోటీ చేయడానికి తెలుగు తమ్ముళ్లు విముఖత ప్రదర్శిస్తున్నారు. కారణాలేమైనా పలువురు సిట్టింగ్ ఎంపీలు కూడా అసెంబ్లీ వైపు చూస్తున్నారు. దీంతో లోకసభకు అభ్యర్థులను ఎంపిక చేయడం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి సమస్యగా మారింది.

అనకాపల్లి పార్లమెంటు సభ్యుడు అవంతి శ్రీనివాస్ వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడంతో అక్కడ అభ్యర్థి కోసం చంద్రబాబు అన్వేషణ ప్రారంభించారు. పార్టీలోకి రావడానికి సిద్ధపడిన కొణతాల రామకృష్ణను పోటీకి దించాలని భావించారు. అయితే, ఆయన అందుకు ఇష్టపడడం లేదని అంటున్నారు. దీంతో ఆ సీటుకు అడారి ఆనంద్ కుమార్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు చెబుతున్నారు.

అమలాపురం పార్లమెంటు సభ్యుడు పండుల రవీంద్రబాబు కూడా వైసిపిలో చేరారు. దాంతో అమలాపురం లోకసభ సీటు కోసం అభ్యర్థిని అన్వేషించాల్సిన పరిస్థితిలో చంద్రబాబు పడ్డారు. అయితే, దివంగత నేత, లోకసభ మాజీ స్పీకర్ జిఎంసి బాలయోగి కుమారుడు హరీష్ మాథూర్ ను ఇక్కడి నుంచి పోటీకి దింపాలని చంద్రబాబు నిర్ణయించారు

నరసాపురం లోకసభ స్థానం నుంచి టీడీపి అభ్యర్థిగా పోటీ చేయాల్సిన రఘురామకృష్ణమ రాజు ఇటీవలే వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారువైసిపి నుంచి రఘురామ రాజు పోటీ చేసే అవకాశాలున్నాయి. దీంతో బిజెపి సిట్టింగ్ ఎంపీ గోకరాజు గంగరాజు సోదరుడు గోకరాజు రామరాజు (రామం) పార్టీలో చేర్చుకుని, అక్కడి నుంచి పోటీకి దింపాలనే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. అది సాధ్యమవుతుందా అనేది అనుమానంగానే ఉంది.

విశాఖపట్నం నుంచి పోటీ చేయడానికి బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ ఆసక్తి చూపుతున్నారు. విశాఖ జిల్లాలోని భిమిలీ నుంచి నారా లోకేష్ పోటీకి దిగుతున్నందున భరత్ కు టికెట్ ఇవ్వడానికి చంద్రబాబు సిద్ధంగా లేరు. విశాఖ నుంచి సబ్బం హరిని పోటీకి దింపే యోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది.

రాజమండ్రి సిట్టింగ్ పార్లమెంటు సభ్యుడు మురళీమోహన్ తాను పోటీ చేయబోనని ప్రకటించారు. కాకినాడ సిట్టింగ్ పార్లమెంటు సభ్యుదడు తోట నరసింహం తాను లోకసభకు పోటీ చేయబోనని స్పష్టంగానే చెప్పేశారు. అందుకు ఆయన అనారోగ్యాన్ని కారణంగా చూపుతున్నారు

కర్నూలు పార్లమెంటు సీటుకు కాంగ్రెసు నుంచి వలస వచ్చిన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని ఎంపిక చేయడం దాదాపుగా ఖరారైనట్లే. సూర్యప్రకాష్ రెడ్డి కూడా పార్లమెంటుకు పోటీ చేయడానికి సిద్దంగా ఉన్నారు. టీడీపి నేతల నుంచి ఆయన అభ్యర్థిత్వం పట్ల వ్యతిరేకత కూడా రావడం లేదు.

కడప పార్లమెంటు సీటుకు పోటీ చేసేందుకు రాష్ట్ర మంత్రి ఆదినారాయణ రెడ్డి ఒప్పుకోవాల్సిన అనివార్యతలో పడ్డారు. రామసుబ్బారెడ్తితో వివాదం కారణంగా ఆయన జమ్మలమడుగు సీటును వదులుకుని లోకసభకు పోటీ చేయాల్సి వస్తోంది. ఇది చంద్రబాబు నిర్ణయమే తప్ప ఆదినారాయణ రెడ్డి ఇష్టపడి లోకసభ సీటు కోరుకుంది కాదు

స్పష్టంగా తిరిగి పోటీ చేసే అభ్యర్థులు మాత్రం చాలా తక్కువ మంది ఉన్నారు. గుంటూరు నుంచి గల్లా జయదేవ్, విజయవాడ నుంచి కేశినేని నాని తిరిగి లోకసభకు ఏ మాత్రం వెనకాడకుండా పోటీ చేయడానికి సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది

ఏ మాత్రం అవకాశం చిక్కినా లోకసభకు కాకుండా అసెంబ్లీకి పోటీ చేయాలనే జాబితాలో మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, కింజారపు రామ్మోహన్ నాయుడు ఉన్నట్లు భావిస్తున్నారు. అనంతపురం నుంచి జెసి దివాకర్ రెడ్డి తనయుడు పవన్ పేరును ఖరారు చేశారు. అయితే, ఏ మాత్రం అవకాశం ఉన్నా అసెంబ్లీకి పోటీ చేయాలనే ఆలోచనలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది

బిజెపితో టీడీపి తెగదెంపులు చేసుకున్న నేపథ్యంలో ఎంపీలుగా పోటీ చేసి గెలిచి చేసేదేమీ లేదనే అభిప్రాయంతో ప్రస్తుత సిట్టింగ్ ఎంపీలు చాలా మంది ఉన్నట్లు చెబుతున్నారు. తిరిగి నరేంద్ర మోడీయే ప్రధాని అవుతారనే ఉద్దేశంతో ఢిల్లీలో తిరిగి ఆందోళనలు చేయడం ఏమీ సాధించలేదనే అపవాదును మూట గట్టుకోవడం ఎందుకని వారు విముఖత ప్రదర్సిస్తున్నట్లు తెలుస్తోంది.

వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ తీవ్రమైన పోటీ ఇస్తున్నప్పటికీ ఏదో విధంగా చంద్రబాబు టీడీపిని రాష్ట్రంలో గెలిపిస్తారని ఎక్కువ మంది టీడీపి నాయకులు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో శాసనసభకు పోటీ చేస్తే మంత్రి పదవులైనా దక్కుతాయనే ఆశతో ఉన్నట్లు చెబుతున్నారు.