ఒత్తిడి: జగన్ వదిలిన బాణం వైఎస్ షర్మిల లోక్‌సభ బరిలోకి...

First Published 11, Mar 2019, 1:50 PM

పార్లమెంట్ లో పార్టీ తరపున ఏపీ ప్రజల వాణిని బలంగా వినిపించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల వేటలో పడింది. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భారీ సంఖ్యలో పార్లమెంట్ స్థానాలు కైవసం చేసుకుంటామని ధీమాలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంట్ ప్రధాని ఎంపికలో కీలక పాత్ర పోషించాలని ఉవ్విళ్లూరుతోంది. 

పార్లమెంట్ లో పార్టీ తరపున ఏపీ ప్రజల వాణిని బలంగా వినిపించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల వేటలో పడింది. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భారీ సంఖ్యలో పార్లమెంట్ స్థానాలు కైవసం చేసుకుంటామని ధీమాలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంట్ ప్రధాని ఎంపికలో కీలక పాత్ర పోషించాలని ఉవ్విళ్లూరుతోంది.  అంతేకాదు పార్లమెంట్ లో ఏపీ వాయిస్ ను బలంగా వినిపించాలని ప్లాన్ చేస్తోంది.

2014 ఎన్నికల్లో గెలిచిన ఎంపీ అభ్యర్థుల్లో ఒకరిద్దరు మినహా అంతగా నోరు విప్పిన పరిస్థితి లేదు. వైసీపీ తొలిసారిగా పార్లమెంట్ లో అడుగుపెట్టినప్పుడు అరకు ఎంపీ కొత్తపల్లి గీత మాత్రం ఓ రేంజ్ లో వాడుకున్నారు.  అయితే ఆమె పార్టీ వీడి టీడీపీకి అనుబంధంగా మెలగడం, ఆ తర్వాత సొంతంగా పార్టీ పెట్టుకోవడం జరిగిపోయింది

ఇకపోతే రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అప్పుడప్పుడు ఒక్కోసారి అలా మెరిపించేవారు. అయితే పార్లమెంట్ బయట మాత్రం మాటల తూటాలు పేల్చేవారు కానీ లోపల మాత్రం మౌనవ్రతం పాటించేవారు.  అయితే 2019 పార్లమెంట్ ఎన్నికల్లో పార్లమెంట్ లో ఏపీ వాణిని బలంగా వినిపించే అభ్యర్థి కోసం వైసీపీ వ్యూహరచన చేస్తోంది. పార్లమెంట్ లో వైసీపీ వాయిస్ బలంగా వినిపించడమే కాదు ఆ క్రెడిట్ వైఎస్ జగన్ కుటుంబానికే దక్కేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి

ఇప్పటికైనా అర్థమైందనుకుంటా...వైఎస్ జగన్ సోదరి షర్మిళనే పార్లమెంట్ బరిలోకి దించితే ఎలా ఉంటుంది అనే కోణంలో ఆలోచిస్తున్నారట. వైఎస్ జగన్ కజిన్ వైఎస్ అవినాష్ రెడ్డి కడప పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పటికీ అతను తెరవెనుక రాజకీయం చేస్తారే తప్ప తెరముందుకు రారని ప్రచారం ఉంది

వైఎస్ అవినాష్ రెడ్డి ఏం చేసినా సైలెంట్ గా చేసుకుపోతారని నేరుగా తెరపైకి రారని సమాచారం. అలాంటి పరిస్థితుల్లో పార్లమెంట్ లో వైసీపీ వాయిస్ బలంగా వినిపించడంతోపాటు పోరాటాల క్రెడిట్ వైఎస్ కుటుంబానికే దక్కాలంటే వైఎస్ షర్మిలను బరిలోకి దించాలని కొందరు నేతలు జగన్ కు సూచిస్తున్నారట

వైసీపీ అధినేత వైఎస్ జగన్ జైల్లో ఉన్నప్పుడు మరో ప్రజాప్రస్థానం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పర్యటించారు. వైఎస్ జగన్ అన్న వదిలిన బాణాన్ని అంటూ పర్యటించారు. మరోప్రజాప్రస్థానం పేరుతో చేపట్టిన పాదయాత్రకు విశేష స్పందన లభించింది. వైసీపీకి అన్నీ తానై వ్యవహరించారు.  అన్ని జిల్లాల ప్రజలు షర్మిళకు జన నీరాజనం పలికారు. అయితే ఆ ఎన్నికల్లో వైఎస్ షర్మిళ పోటీ చేస్తారంటూ ప్రచారం జరిగినప్పటికీ ఆమె పోటీ చెయ్యలేదు

అయితే వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ జగన్ తల్లి వైఎస్ విజయమ్మ విశాఖపట్నం పార్లమెంట్ కు పోటీచేసి ఓటమిపాలయ్యారు.  అయితే 2019 ఎన్నికల్లో ఆమె పోటీ చెయ్యడం లేదని తెలుస్తోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఎంపీ అభ్యర్థులపై కీలక కసరత్తు చేపడుతున్నారు వైఎస్ జగన్. ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిల పోటీ అంశం ప్రధానంగా పార్టీల్లో చర్చకు వస్తున్నట్లు తెలుస్తోంది

వైఎస్ షర్మిళకు ప్రజలు బ్రహ్మరథం కడతారని ఆమెను పార్లమెంట్ కు పంపించాలంటూ జగన్ పై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. రాబోయే ఎన్నికల్లో వైఎస్ షర్మిళను కడప పార్లమెంట్ నుంచి కానీ కర్నూలు పార్లమెంట్ నుంచి గానీ పోటీ చెయ్యించాలని ఒత్తిడి తెస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.  అయితే షర్మిల పోటీపై వైఎస్ జగన్ ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది

2014 పార్లమెంట్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గౌరవాధ్యక్షురాలు, వైఎస్ జగన్ తల్లి వైఎస్ విజయమ్మ ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి హరిబాబు చేతిలో ఓటమిపాలయ్యారు.  ఆమె ఓటమి వైసీపీతోపాటు, వైఎస్ జగన్ కుటుంబంపై తీవ్ర ప్రభావం చూపింది. వైసీపీ గౌరవాధ్యక్షురాలు ఓటమి చెందడం తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది వైసీపీ

మరోవైపు తల్లిని గెలిపించుకోలేకపోయిన వ్యక్తి ప్రతిపక్ష నేతగా ఉన్నారంటూ టీడీపీ విమర్శలు చేసింది.  వైఎస్ విజయమ్మ ఓటమిని గుర్తుకు తెచ్చుకుంటున్న వైఎస్ జగన్ తన తల్లి ఓటమి చెందడంతో మళ్లీ తన సోదరిని దించాలా అంటూ ప్రశ్నించినట్లు తెలుస్తోంది

కడప పార్లమెంట్ అభ్యర్థిగా త న సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి ఉండగా షర్మిళను దించితే కుటుంబం పరంగా విబేధాలు తలెత్తే అవకాశం ఉందని తెలుస్తోంది.  వైఎస్ షర్మిల బరిలోకి దిగితే తాను పోటీకి దూరంగా ఉంటానని వైఎస్ అవినాష్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేసినట్లు తెలుస్తోంది

మరోవైపు కర్నూలు పార్లమెంట్ విషయంలో షర్మిళ పోటీపై మిశ్రమ స్పందన వస్తోంది. ఇప్పటి వరకు కర్నూలు పార్లమెంట్ టికెట్ కోసం ఆశించిన అభ్యర్థులను తప్పించడం భావ్యమా అన్న కోణంలో ఆలోచిస్తున్నారు.  కర్నూలు పార్లమెంట్ పై కన్నేసిన వైఎస్ జగన్ బలమైననేతను బరిలోకి దించాలని యోచిస్తున్నారు

గత ఎన్నికల్లో కర్నూలు, నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గాల్లో వైసీపీ విజయం సాధించింది. అంతేకాదు కర్నూలు జిల్లా రాజకీయాలను తీవ్ర ప్రభావం చూపే మాజీ కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి టీడీపీ పార్లమెంట్ అభ్యర్థిగా బరిలోకి దించుతున్న నేపథ్యంలో ఆమెను దించడం అనవసరమంటున్నారు

ఆమె గెలిస్తే పర్వాలేదని ఒక వేళ విజయమ్మలా ఓడిపోతే పార్టీ పరంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ఈ పరిణామాల నేపథ్యంలో షర్మిళ పోటీపై వైఎస్ జగన్ అంతగా సానుకూలంగా లేరని తెలుస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైఎస్ జగన్ తన సోదరి షర్మిళ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్నది వేచి చూడాల్సిందే