MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • School Holidays : ఇక మురసు తుపాను బీభత్సమే.. మంగళవారం ఈ ఏడు జిల్లాల్లో స్కూళ్లకి సెలవు

School Holidays : ఇక మురసు తుపాను బీభత్సమే.. మంగళవారం ఈ ఏడు జిల్లాల్లో స్కూళ్లకి సెలవు

మురసు సైక్లోన్ ఇవాళ రాత్రి లేదా రేపు తెల్లవారుజామున తీరం దాటే అవకాశాలున్నాయి. దీంతో ఈదురుగాలులు, వర్షాల తీవ్రత పెరగనున్న నేపథ్యంలో పలు జిల్లాల్లో మంగళవారం కూడా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం.

3 Min read
Author : Arun Kumar P
Published : Nov 02 2026, 08:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
మురసు తుపాను ఎఫెక్ట్... ఈ జిల్లాల్లో స్కూళ్లకి సెలవులు
Image Credit : chatgpt

మురసు తుపాను ఎఫెక్ట్... ఈ జిల్లాల్లో స్కూళ్లకి సెలవులు

Cyclone Murasu : బంగాళాఖాతంలో ఏర్పడుతున్న తుపానులు ఆంధ్ర ప్రదేశ్ ను అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటికే అర్నబ్ తుపాను నానా బీభత్సం సృష్టించింది... ఇప్పుడు మురసు తుపాను కల్లోలం కొనసాగుతోంది. ఇంకా ఈ తుపాను సముద్రంలోనే ఉంది... కానీ పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు మొదలయ్యాయి. ఈ తుపాను కూడా ఏపీలోనే తీరం దాటి బలమైన ఈదురుగాలులు, అత్యంత భారీ వర్షాలతో మరోసారి బీభత్సం సృష్టించనుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా తుపాను తీవ్రత ఎక్కువగా ఉండనున్న జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటిస్తోంది ప్రభుత్వం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఈ ఏడు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు
Image Credit : chatgpt

ఈ ఏడు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు

మురసు తుపాను సముద్రంలో ఉండగానే భారీ వర్షాలు మొదలయ్యాయి... ఇక తీరం దాటాక ఈదురుగాలులు, వర్షాల తీవ్రత మరింత పెరగనుందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరిస్తోంది. ప్రస్తుతం నెల్లూరుకు 80 కిమీ, కావలికి 90 కిమీ, ఒంగోలుకు 120 కిమీ, బాపట్లకు 150కిమీ, తిరుపతికి 160కిమీ, మచిలీపట్నంకు 190కిమీ దూరంలో ఈ తుపాను కేంద్రీకృతమై ఉంది. ఇవాళ (నవంబర్ 2, సోమవారం) రాత్రి లేదా రేపు (నవంబర్ 3,మంగళవారం) తెల్లవారుజామున ఒంగోలు సమీపంలో తీరాన్ని దాటే అవ‌కాశం ఉందని... ఈ సమయంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని APSDMA ఎండి ప్రఖర్ జైన్ సూచించారు.

ఈ తుపాను ప్రభావం ప్రధానంగా దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలపై ఉంటుందని APSDMA ప్రకటించింది. ఈ ప్రాంతాల్లో నవంబర్ 3 (మంగళవారం) బలమైన ఈదురుగాలులతో కూడిన భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. దీంతో ఇప్పటికే బాపట్ల, నెల్లూరు జిల్లాల్లో విద్యాసంస్థలకు మంగళవారం సెలవు ప్రకటించారు అధికారులు. తాజాగా కృష్ణా, ఎన్టిఆర్, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోను విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం. వర్ష తీవ్రతను బట్టి మిగతా జిల్లాల్లోనూ సెలవుపై కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులు నిర్ణయం తీసుకుంటారు.

34
ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Image Credit : gemini

ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

మురసు తుపాను ప్రభావంతో సోమవారం రాత్రి పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం,నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ వాఖ ప్రకటించింది. రేపు, ఎల్లుండి (మంగళ, బుధవారం) రెండ్రోజులు ఈ వర్షాలు కొనసాగనున్నాయని హెచ్చరించింది. తుపాను తీరం దగ్గరకు వచ్చేకొద్ది ఈదురుగాలలు, వర్షాల తీవ్రత పెరుగుతుంది... కాబట్టి ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని APSDMA MD ప్రఖర్ జైన్ సూచించారు.

తుపాను తీరం దాటే సమయంలో 100-120 కిమీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని హెచ్చరించింది. భారీ వర్షాలు, ఈదురుగాలుల వల్ల ప్రమాదాలకు ఆస్కారం ఉంటుందని... కాబట్టి అత్యవసరం సహాయం కోసం మనమిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 కు లేదంటే టోల్ ఫ్రీ నెంబర్ 112 లేదా 1070 లేదా 18004250101 కు సంప్రదించవచ్చని APSDMA ప్రకటించింది.

44
తెలంగాణలోనూ భారీ వర్షాలు
Image Credit : Gemini AI

తెలంగాణలోనూ భారీ వర్షాలు

మురసు తుపాను తీరం దాటిన తర్వాత అంటే రేపు (నవంబర్ 3, మంగళవారం) నల్గొండ, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది... ఈ రెండు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాలే కాదు బలమైన ఈదురుగాలులు (గంటకు 50-70 కిలోమీటర్ల వేగంతో) వీస్తాయంటూ వెదర్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో ప్రమాదకరమైన వర్షాలు కురిసే అవకాశాలున్న ఈ జిల్లాల్లో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా విద్యాసంస్థలకు సెలవు ఇచ్చే అవకాశాలున్నాయి.

సూర్యాపేట, మహబూబ్ నగర్, వనపర్తి జిల్లాల్లోనూ భారీ వర్షాలు, అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది వాతావరణ కేంద్రం. ఇక భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది... ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తాయంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

సైక్లోన్ మురసు ప్రభావంతో తెలంగాణవ్యాప్తంగా నవంబర్ 3, 4, 5 తేదీల్లో అంటే మంగళ, బుధ, గురువారం మూడ్రోజులు భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలంగాణ వెదర్ మ్యాన్ హెచ్చరిస్తున్నారు. నవంబర్ 3 మధ్యాహ్నం నుండి నవంబర్ 4 రాత్రి వరకు కుండపోత వర్షాలుంటాయని అంటున్నారు. ముఖ్యంగా నల్గొండ, నాగర్ కర్నూల్, సూర్యాపేట, వనపర్తి జిల్లాల్లో 100 నుండి 130 మిల్లిమీటర్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని వెదన్ మ్యాన్ అంచనా వేస్తున్నారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆంధ్ర ప్రదేశ్
ఏషియానెట్ న్యూస్
 
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
1st ODI • NZ vs IND 2026
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Cyclone Murasu : దూసుకొస్తున్న మురసు తుపాను.. శాటిలైట్స్ తీసిన భయంకరమైన ఫోటోలివే..!
Recommended image2
Cyclone Murasu: మురసు అంటే ఏమిటి? ఈ తుపాను ఎప్పుడు ఆంధ్రప్రదేశ్‌ను వదులుతుంది
Recommended image3
Vande Bharat Sleeper: ఏపీకి తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Related Stories
Recommended image1
School Holidays : తెలంగాణపైనా మురసు తుపాను అటాక్.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్, స్కూళ్లకి సెలవులు
Recommended image2
School Holidays: మురసు తుపాను ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved