MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • Cyclone Murasu : దూసుకొస్తున్న మురసు తుపాను.. శాటిలైట్స్ తీసిన భయంకరమైన ఫోటోలివే..!

Cyclone Murasu : దూసుకొస్తున్న మురసు తుపాను.. శాటిలైట్స్ తీసిన భయంకరమైన ఫోటోలివే..!

బంగాళాఖాతంలో ఏర్పడిన మురసు తుపాను ఆంధ్ర ప్రదేశ్ తీరంవైపు దూసుకొస్తోంది. దీని కదలికలను ఇండియాకు చెందిన ఇన్శాట్-3డీఎస్ సహా మూడు శాటిలైట్లు ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తున్నాయి. ఇవి తీసిన ఫోటోలు ఇలా ఉన్నాయి..

2 Min read
Author : Arun Kumar P
Published : Nov 02 2026, 06:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
బంగాళాఖాతంలో మురసు తుపాను బీభత్సం
Image Credit : IMD Website

బంగాళాఖాతంలో మురసు తుపాను బీభత్సం

బంగాళాఖాతంలో ఏర్పడిన 'మురసు' తుపాను ఆంధ్రప్రదేశ్ వైపు వేగంగా దూసుకొస్తోంది. ప్రస్తుతం ఈ తుపాను నెల్లూరుకు 80 కిమీ, కావలికు 90 కిమీ, ఒంగోలుకు 120 కిమీ, బాపట్లకు 150కిమీ, తిరుపతికు 160కిమీ, మచిలీపట్నంకు 190కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇవాళ (నవంబర్ 2, సోమవారం) రాత్రి లేదా రేపు (నవంబర్ 3,మంగళవారం) తెల్లవారుజామున ఒంగోలు సమీపంలో తీరాన్ని దాటే అవ‌కాశం ఉందని... ఈ సమయంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) ఎండి ప్రఖర్ జైన్ సూచించారు.

అయితే ప్రస్తుతం పశ్చిమమధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఈ అరసు తుపానును పలు ఇండియన్ శాటిలైట్లు నిశితంగా గమనిస్తున్నాయి. ఎప్పటికప్పుడు తుపాను కదలికలను ఫోటోలు తీసి పంపిస్తున్నాయి. ఇలా INSAT-3DS శాటిలైట్ తీసిన ఫోటోల్లో దట్టమైన మేఘాలు, తుపాను ఆకారం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
అంతరిక్షం నుంచి మురసు తుపాను
Image Credit : IMD Website

అంతరిక్షం నుంచి మురసు తుపాను

ఇండియాకు చెందిన INSAT-3DS శాటిలైట్ లోని 'థర్మల్ ఇన్‌ఫ్రారెడ్' కెమెరా నవంబర్ 2 ఉదయం 10:00 నుంచి 10:27 గంటల మధ్య కొన్ని ఫోటోలు తీసింది. ఆంధ్రా తీరాన్ని ఆనుకుని ఉన్న బంగాళాఖాతంలో దట్టమైన మేఘాలు కమ్ముకున్నట్లు ఈ ఫోటోల్లో స్పష్టంగా తెలుస్తోంది. తుపాను చుట్టూ ఉన్న మేఘాలు దాని తీవ్రతను చూపిస్తున్నాయి. దక్షిణ భారతదేశం, దాన్ని ఆనుకుని ఉన్న సముద్ర ప్రాంతం అంతా ఈ మేఘాలు వ్యాపించి ఉన్నాయి.

34
తీరం దాటే సమయంలో అల్లకల్లోలం తప్పదా?
Image Credit : Gemini

తీరం దాటే సమయంలో అల్లకల్లోలం తప్పదా?

నవంబర్ 2 ఉదయం 8:30 గంటల సమయానికి మురసు తుపాను గంటకు 22 కి.మీ వేగంతో పశ్చిమ-వాయువ్య దిశగా కదిలిందని ఐఎండీ (IMD) తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 14.1°N అక్షాంశం, 81.4°E రేఖాంశం వద్ద ఈ తుపాను కేంద్రీకృతమై ఉంది.

ఈ తుపాను వాయువ్య దిశగా కదులుతూ.. నెల్లూరు, నర్సాపురం మధ్య (ఒంగోలుకు దక్షిణంగా) తీవ్ర తుపానుగా తీరం దాటనుంది. నవంబర్ 2 రాత్రి 11:30 నుంచి నవంబర్ 3 తెల్లవారుజామున 4:00 గంటల మధ్య ఇది తీరాన్ని తాకుతుంది. ఆ సమయంలో గంటకు 100 నుంచి 110 కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తాయి. ఒక్కోసారి గాలి వేగం 120 కి.మీ కూడా దాటొచ్చని అధికారులు హెచ్చరించారు.

44
అప్రమత్తమైన రెస్క్యూ టీమ్స్
Image Credit : Gemini

అప్రమత్తమైన రెస్క్యూ టీమ్స్

ఇటీవలే వచ్చిన 'అర్నబ్ ' తుపాను ఆంధ్ర ప్రదేశ్ లో అల్లకల్లోలం సృష్టించింది… కనీసం వారంరోజులు కూడా గడవకముందే 'మురసు' తుపాను వచ్చింది. ఇలా వరుస తుపానులు తూర్పు తీర ప్రాంత ప్రజలను భయపెడుతున్నాయి.

తాజా తుపానుతో విపత్తు నిర్వహణ సంస్థలు అప్రమత్తం అయ్యాయి. తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే పనులు వేగవంతం చేశారు. భారీ వర్షాలు, సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉండటంతో ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.

వాతావరణ నిపుణులు థర్మల్ ఇన్‌ఫ్రారెడ్ ఫోటోల ద్వారా మేఘాల కదలికలను ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తున్నారు. ఆంధ్రాలోని పలు ప్రాంతాల్లో బలమైన గాలులు, భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున తీర ప్రాంత ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆంధ్ర ప్రదేశ్
ఏషియానెట్ న్యూస్
వాతావరణం
 
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
1st ODI • NZ vs IND 2026
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd TEST • SA vs AUS
Result
SASA
329 & 387
AUSAUS
429 & 111
SA won by 176 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Cyclone Murasu: మురసు అంటే ఏమిటి? ఈ తుపాను ఎప్పుడు ఆంధ్రప్రదేశ్‌ను వదులుతుంది
Recommended image2
Vande Bharat Sleeper: ఏపీకి తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Recommended image3
School Holidays: మురసు తుపాను ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు
Related Stories
Recommended image1
Cyclone Murasu : ఏపీనే కాదు తెలంగాణను వదలని మురసు తుపాను.. ఇక కుండపోత వర్షాలే, ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
Recommended image2
Cyclone Murasu: మురసు అంటే ఏమిటి? ఈ తుపాను ఎప్పుడు ఆంధ్రప్రదేశ్‌ను వదులుతుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved