తిలక్ వర్మకు ప్రాణాంతక వ్యాధి.. ఏమిటీ 'రాబ్డోమయోసిస్'? దీని లక్షణాలేంటి?
Tilak Varma : ఆసియా కప్ 2025 తో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న హైదరబాదీ క్రికెటర్ తిలక్ వర్మ ప్రాణాంతక వ్యాధి రాబ్డోమయోసిస్ తో బాధపడ్డాడట… అసలు ఏమిటీ వ్యాది? లక్షణాలేమిటి?

తిలక్ వర్మ సక్సెస్ వెనక ఇంత కష్టం దాగుందా..!
Tilak Varma : టీమిండియా క్రికెటర్.. అందులోనూ మన తెలుగువాడు... అందుకే తిలక్ వర్మ అంటే తెలుగోళ్లకు అంత అభిమానం. అతడు ఐపిఎల్ లో ఆడినా... ఆసియా కప్ లో ఆడినా సపోర్ట్ చేస్తుంటారు. సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన తిలక్ ఈ స్థాయికి ఎదగడం వెనక ఎన్నో కష్టాలు, మరెన్నో త్యాగాలున్నాయి. ఎంతో ఇష్టపడే క్రికెట్ కోసం అతడు ప్రాణాలమీదకు కూడా తెచ్చుకున్నాడట... ఈ విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించాడు తిలక్.
తిలక్ వర్మకు ప్రాణాంతక వ్యాధి
టీమిండియా క్రికెటర్ తిలక్ వర్మ ఇటీవల బ్రేక్‌ఫాస్ట్ విత్ ఛాంపియన్స్ పేరిట గౌరవ్ కపూర్ నిర్వహించే ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2022 ఐపిఎల్ తర్వాత తాను ఎదుర్కొన్న అనారోగ్య సమస్యలను గుర్తుచేసుకున్నారు. దేశవాళి క్రికెట్ లో భాగంగా బంగ్లాదేశ్ A టీమ్ తో ఓ మ్యాచ్ ఆడుతుండగా తన పరిస్థితి దారుణంగా మారిందని... ఒక్కసారిగా చేతులు, కాళ్ల కండరాలు గట్టిపడి కదలలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. చివరికి చేతివేళ్లు కూడా కదపలేని పరిస్థితి... గ్లౌజ్ కట్ చేసి తీయాల్సి వచ్చిందని తిలక్ వర్మ తెలిపారు.
అయితే హాస్పిటల్లో వైద్య పరీక్షల అనంతరం తనకు 'రాబ్డోమయోసిస్' అనే అరుదైన వ్యాధి అని తేలిందని తిలక్ వెల్లడించాడు. శరీరానికి మరీముఖ్యంగా కండరాలను అధిక ఒత్తిడికి గురిచేస్తే అవి బిగుసుకుపోతాయని... ఇదిప్రాణాంతకంగా కూడా మారవచ్చని డాక్టర్లు చెప్పినట్లు తిలక్ వెల్లడించాడు. ఇలాంటి క్లిష్ట సమయంలో తనకు బిసిసిఐ, ముంబై ఇండియన్స్ యాజమాన్యం అండగా నిలిచిందని తిలక్ వర్మ తెలిపాడు.
అయితే ఫిట్ నెస్ పై ఎక్కువ శ్రద్ద పెట్టడంవల్లే ఈ సమస్య తలెత్తిందని తిలక్ వర్మ తెలిపాడు. అసలు విశ్రాంతి అన్నదే లేకుండా ఉంటే మైదానంలో లేదంటే జిమ్ లో ఉండేవాడినని... దీంతో శరీరంపై తీవ్ర ఒత్తిడి పెరిగి కండరాల సమస్య వచ్చిందన్నాడు తిలక్.
Tilak Varma Revealed After His First IPL in 2022 How He was Diagnosed With Rhabdomyolysis. How Akash Ambani & BCCI Helped Him. Few Hour Here n There Ded Stage! Later on He Cameback in IPL Played One Of The Magnificent Knock Against RCB in IPL 2023. An Insane Story Man 🫡. [ BWC ] pic.twitter.com/HE4crZD4Nt
— яιşнí. (@BellaDon_3z) October 23, 2025
ఏమిటీ రాబ్డోమయోసిస్ వ్యాధి
ఈ వ్యాధి ఎక్కువగా క్రీడాకారులు, సైనిక సిబ్బందిలో కనిపిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కండరాల నొప్పితో పాటు బిగుసుకుపోయి కదిలించలేని పరిస్థితి వస్తుందని చెబుతున్నారు. దీనివల్ల మూత్రపిండాలు దెబ్బతినే పరిస్థితులు ఏర్పడుతుంది.
తీవ్రమైన శారీరక శ్రమ, విపరీతమైన వ్యాయామం ద్వారా కండరాలపై అదిక ఒత్తిడి కలిగించడంవల్ల ఈ వ్యాధి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. కొన్నిరకాల మాదకద్రవ్యాలు కూడా కండరాల పనితీరును దెబ్బతీసి ఈ వ్యాధికి కారణం అవుతాయని చెబుతున్నారు. ఇలాంటి అరుదైన వ్యాధి బారినపడ్డారు తిలక్ వర్మ.
తిలక్ వర్మ జీవితాన్ని మార్చేసిన ఆసియా కప్ ఫైనల్
2022 సీజన్ నుండి తిలక్ ముంబై ఇండియన్స్ మిడిల్ ఆర్డర్‌కు వెన్నెముకగా ఉన్నాడు. 51 ఇన్నింగ్స్‌లలో 37.47 సగటు, 144.41 స్ట్రైక్ రేట్‌తో 1,499 పరుగులు చేశాడు, ఇందులో ఎనిమిది అర్ధ సెంచరీలు ఉన్నాయి.
ఇటీవల ఆసియా కప్‌లో తిలక్ అద్భుతంగా రాణించాడు. ఆరు ఇన్నింగ్స్‌లలో 71.00 సగటు, 131కి పైగా స్ట్రైక్ రేట్‌తో 213 పరుగులు చేశాడు. భారత్ తరపున రెండవ అత్యధిక స్కోరు, మొత్తం మీద ఆసియా కప్ 2025 టోర్నీలో నాల్గవ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఫైనల్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై 69* పరుగులతో అజేయంగా నిలిచి మ్యాచ్ గెలిపించి హీరో అయిపోయాడు. దేశ ప్రధాని, రాష్ట్రపతి నుండి సామాన్య క్రికెట్ ఫ్యాన్ వరకు అతడిని పొగడ్తలతో ముంచెత్తారు.
తిలక్ వర్మ వ్యక్తిగత జీవితం
తిలక్ వర్మ అసలుపేరు నంబూరి ఠాకూర్ తిలక్ వర్మ... ఇతడు 2002 నవంబర్ 8న జన్మించాడు. తల్లిదండ్రులు గాయత్రీదేవి, నాగరాజు. క్రికెట్ పై అతడికున్న ఆసక్తిని గమనించిన పేరెంట్స్ ఆ దిశగా ప్రోత్సహించారు... చిన్నప్పటినుండి హైదరాబాద్ లింగంపల్లిలోని లేగల క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందాడు. హైదరాబాద్ తరపున రంజీ క్రికెట్ లో 2018, ఐపిఎల్ లో 2022 లో ముంబై ఇండియన్స్ తరపున ఆరంగేట్రం చేశారు. ఇలా అంచెలంచెలుగా ఎదిగి భారత జట్టులో చోటు సంపాదించుకున్నాడు... ఇప్పుడు టీమిండియా రెగ్యులర్ సభ్యుడిగా మారిపోయాడు తిలక్.