ప్రశాంత్ కిషోర్, వై.ఎస్.షర్మిల సంకేతాలు: జగన్ కు దెబ్బేనా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే ఏడాదిలో షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. ఈ తరుణంలో ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.
ప్రశాంత్ కిషోర్, వై.ఎస్.షర్మిల సంకేతాలు: జగన్ కు దెబ్బేనా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో రెండు రోజులుగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.ఈ పరిణామాలు తెలుగుదేశం పార్టీ వర్గాల్లో జోష్ ను నింపాయి. ఈ పరిణామాలను అధికార యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్‌సీపీ) నిశితంగా పరిశీలిస్తుంది. 2019 నాడు ఈ ఇద్దరు వైఎస్ఆర్‌సీపీ వైపున్నారు. కానీ, ప్రస్తుతం వీరిద్దరూ ఆ పార్టీకి దూరంగా ఉన్నారు.
also read:పార్లమెంట్ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్: తొలి అభ్యర్ధిని ప్రకటించిన గులాబీ పార్టీ
ప్రశాంత్ కిషోర్, వై.ఎస్.షర్మిల సంకేతాలు: జగన్ కు దెబ్బేనా?
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడితో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఈ నెల 23న అమరావతిలో భేటీ అయ్యారు. సుమారు మూడు గంటల పాటు ఈ భేటీ సాగింది. ఈ భేటీలో తెలుగుదేశం పార్టీ నియమించుకున్న వ్యూహకర్త రాబిన్ శర్మ కూడ పాల్గొన్నారు. గతంలో కూడ చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ హైద్రాబాద్ లో భేటీ అయ్యారని ప్రచారం సాగుతుంది.
also read:ఆంధ్రప్రదేశ్ పై కాంగ్రెస్ ఫోకస్: వై.ఎస్. షర్మిలతో జగన్ కు చెక్ ?
ప్రశాంత్ కిషోర్, వై.ఎస్.షర్మిల సంకేతాలు: జగన్ కు దెబ్బేనా?
2019 ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేశారు.ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ప్రశాంత్ కిషోర్ పై అప్పట్లో చంద్రబాబు విమర్శలు చేశారు. 2024 ఏప్రిల్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దీంతో ఈ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రశాంత్ కిషోర్ టీమ్ టీడీపీకి సలహాలు ఇచ్చే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది.
also read:పార్లమెంట్ ఎన్నికలు 2024:రేవంత్ ముందున్న సవాళ్లు ఇవీ.
ప్రశాంత్ కిషోర్, వై.ఎస్.షర్మిల సంకేతాలు: జగన్ కు దెబ్బేనా?
మరో వైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి సోదరి వై.ఎస్. షర్మిల తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడి కుటుంబానికి గిఫ్ట్ పంపారు. ఈ గిఫ్ట్ విషయమై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. మరో వైపు వై.ఎస్. షర్మిలకు క్రిస్ మస్ ను పురస్కరించుకొని లోకేష్ కూడ గిఫ్ట్ పంపారు. ఇంత కాలం ఈ తరహా సంప్రదాయం లేదు. కానీ, ఎన్నికలకు ముందు ఈ పరిణామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారి తీసింది.
also read:ఆ ఐదు పార్లమెంట్ స్థానాల్లో గెలుపే టార్గెట్: తెలంగాణ కాంగ్రెస్ నేతల వ్యూహం
ప్రశాంత్ కిషోర్, వై.ఎస్.షర్మిల సంకేతాలు: జగన్ కు దెబ్బేనా?
గతంలో కూడ ఏనాడూ గిఫ్ట్ పంపని వై.ఎస్. షర్మిల చంద్రబాబు కుటుంబానికి ఇప్పుడు గిఫ్ట్ పంపడం ఆసక్తిగా మారింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డితో సోదరి వై.ఎస్. షర్మిలకు మధ్య గ్యాప్ ఉందని ప్రచారం సాగుతుంది.ఈ కారణంగానే వై.ఎస్. షర్మిల తెలంగాణలో వైఎస్ఆర్‌టీపీని ఏర్పాటు చేసింది. ఈ ఏడాది నవంబర్ 30న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వై.ఎస్. షర్మిల మద్దతు ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్‌టీపీ విలీనం చేసే ప్రక్రియ చివరి నిమిషంలో నిలిచిపోయింది.
also read:తెలంగాణ నుండి పోటీ: సోనియా కోసం ఆ మూడు స్థానాలపై కాంగ్రెస్ ఫోకస్
ప్రశాంత్ కిషోర్, వై.ఎస్.షర్మిల సంకేతాలు: జగన్ కు దెబ్బేనా?
రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో వై.ఎస్. షర్మిల క్రీయాశీలకంగా పనిచేసే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది. 2024 జనవరి మాసంలో వై.ఎస్. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది.
also read:పదేళ్లకు ఒకే వేదికపై బాబు, పవన్:ఆంధ్రప్రదేశ్‌లో 2014 రిజల్ట్స్ వస్తాయా?
ప్రశాంత్ కిషోర్, వై.ఎస్.షర్మిల సంకేతాలు: జగన్ కు దెబ్బేనా?
2019 ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్‌సీపీకి కీలకంగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్, వై.ఎస్. షర్మిలలు ప్రస్తుతం ఆ పార్టీకి దూరంగా ఉన్నారు. 2024లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేనలు కలిసి పోటీ చేయనున్నాయి.
also read:తెలంగాణపై బీజేపీ ఫోకస్: ఎంపీ టిక్కెట్ల కోసం బీజేపీ నేతల మధ్య పోటా పోటీ
ప్రశాంత్ కిషోర్, వై.ఎస్.షర్మిల సంకేతాలు: జగన్ కు దెబ్బేనా?
ఈ రెండు పార్టీలు ఉమ్మడి మేనిఫెస్టోను త్వరలోనే ప్రకటించనున్నారు. తిరుపతి, విజయవాడలో మరో రెండు సభలను కూడ ఏర్పాటు చేయనున్నారు.మరో వైపు ఈ కూటమిలో బీజేపీ చేరుతుందా లేదా అనేది రానున్న రోజుల్లో స్పష్టత రానుంది.ఈ కూటమిలో బీజేపీ చేరాలని పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నారు.కానీ ఈ విషయమై బీజేపీ నాయకత్వం ఇంకా స్పష్టత ఇవ్వలేదు.
also read:వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేల్లో టెన్షన్: 10 సర్వేలతోనే ఇంచార్జీల మార్పులు
ప్రశాంత్ కిషోర్, వై.ఎస్.షర్మిల సంకేతాలు: జగన్ కు దెబ్బేనా?
ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా నియమించుకున్నారనే ప్రచారంపై వైఎస్ఆర్‌సీపీ స్పందించింది. ప్రశాంత్ కిషోర్ బుర్రలో గుజ్జును వైఎస్ఆర్‌సీపీ ఉపయోగించుకుందన్నారు. ప్రశాంత్ కిషోర్ ను టీడీపీ ఉపయోగించుకున్నా ప్రయోజనం లేదని ఆ పార్టీ నేతలు తేల్చి చెప్పారు. వై.ఎస్. షర్మిల చంద్రబాబు కుటుంబానికి గిఫ్ట్ పంపడంపై మాత్రం ఆ పార్టీ నేతలు స్పందించలేదు.
also read:పోగోట్టుకొన్నచోటే:పార్లమెంట్ ఎన్నికలపై కేసీఆర్ ఫోకస్, ఎంపీలతో ముఖాముఖి