MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Andhra Pradesh
  • IMD Rain Alert : ఒకేసారి ఉపరితల ఆవర్తనం, ద్రోణి ఎటాక్.. ఈ తెలుగు జిల్లాల్లో వర్ష బీభత్సం కంటిన్యూ

IMD Rain Alert : ఒకేసారి ఉపరితల ఆవర్తనం, ద్రోణి ఎటాక్.. ఈ తెలుగు జిల్లాల్లో వర్ష బీభత్సం కంటిన్యూ

IMD Rain Alert : తెెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. సడన్ గా వర్షాలు మొదలై ఎండల తీవ్రత తగ్గింది… ఈ రోజంతా చల్లని వాతావరణం కొనసాగింది. మరి రేపు వాతావరణం ఎలా ఉంటుందంటే.. 

3 Min read
Author : Arun Kumar P
Published : May 27 2026, 06:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే వర్షాలు..
Image Credit : Gemini AI

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే వర్షాలు..

IMD Rain Alert : ఇప్పటికే రుతుపవనాలు భారతదేశం చుట్టూ సముద్రంలో విస్తరించాయి... మరో రెండుమూడు రోజుల్లో తీరప్రాంతాలను తాకే అవకాశాలున్నాయి. అంటే జూన్ ఆరంభంలో ఎండల తీవ్రత తగ్గి వర్షాలు జోరందుకోనున్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. కానీ అంతకంటే ముందే తెలుగు రాష్ట్రాలను వర్షాలు పలకరించాయి... నిన్న (మే 26, మంగళవారం) నుండి జోరువానలు కురుస్తున్నాయి.

రోహిణి కార్తె వేళ ఎండలు మండిపోతాయని అనుకుంటుంటే వాతావరణం వర్షాలకు అనుకూలంగా మారింది... చల్లగా ఆహ్లాదకరంగా ఉంది. ఉత్తర తమిళనాడు పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం, దక్షిణ తెలంగాణ వరకు ద్రోణి విస్తరించి ఉన్నట్లు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. అందువల్లే రుతుపవనాల కంటే ముందే వర్షాలు మొదలయ్యాయని తెలిపారు. వీటి ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ లో రేపు (మే 28, గురువారం) కూడా పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఈ ఏపీ జిల్లాల్లో వర్షాలే వర్షాలు..
Image Credit : chatgpt

ఈ ఏపీ జిల్లాల్లో వర్షాలే వర్షాలు..

ఆంధ్ర ప్రదేశ్ లో ఇవాళ కురిసినట్లే రేపు కూడా వర్షాలు కురుస్తాయని APSDMA వెల్లడించింది. ముఖ్యంగా బాపట్ల, మార్కాపురం, ప్రకాశం, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఇక అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, గుంటూరు, పల్నాడు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, తిరుపతి జిల్లాల్లో చెదురుమదురు జల్లులు కురిసే అవకాశాలున్నాయట. కాబట్టి ఈ జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది.

35
పిడుగుల బారిన పడకుండా జాగ్రత్తలు
Image Credit : Gemini AI

పిడుగుల బారిన పడకుండా జాగ్రత్తలు

  • చెట్ల కింద అస్సలు నిలబడకండి. వర్ష సమయంలో చెట్లు ఎక్కువగా ఉండే రోడ్లపై ప్రయాణం కూడా ప్రమాదకరమే.
  • విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లకు దూరంగా ఉండండి.
  • పెద్ద పెద్ద హోర్డింగ్స్ (ఫ్లెక్సీల) కింద ఆశ్రయం పొందవద్దు.
  • ఉరుములు, మెరుపులు వచ్చేటప్పుడు సురక్షితమైన భవనాల్లోకి వెళ్లండి.
  • వర్షం కురిసే సమయంలో బయటకు రావద్దు.
45
ఏపీలో మళ్లీ మండుటెండలు..
Image Credit : AI

ఏపీలో మళ్లీ మండుటెండలు..

వర్షాలతో వాతావరణం చల్లబడినా ఇది తాత్కాలికమైన ఊరటే... మళ్లీ ఎండలు జోరందుకుంటాయని APSDMA హెచ్చరించింది. రేపు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఎండల తీవ్రత పెరుగుతుందని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. తీవ్ర వడగాల్పుల హెచ్చరికలు జారీ చేశారు. 119 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 155 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు.

రేపటి అంచనా ఉష్ణోగ్రతలు:

45°C - 46°C : శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, పోలవరం, కాకినాడ, కోనసీమ, ఉమ్మడి గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు.

43°C- 44°C : అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, నెల్లూరు, ప్రకాశం.

40°C - 42°C : రాయలసీమ జిల్లాలు.

ఇవాళ్టి గరిష్ఠ ఉష్ణోగ్రతలు : పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో 41.8 డిగ్రీలు, ఏలూరు జిల్లా కుక్కునూరు, పోలవరం జిల్లా కూనవరంలో 41.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

55
తెలంగాణలో వర్షాలు..
Image Credit : Gemini AI

తెలంగాణలో వర్షాలు..

తెలంగాణలో కూడా రేపు (గురువారం, మే 28) వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ వర్షాలకు గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా తోడై ప్రమాదకరంగా మారతాయని హెచ్చరించింది వాతావరణ విభాగం.

ఇక భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, సూర్యాపేట, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ , కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది.

రాజధాని హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని తెలిపింది. సాయంత్రం లేదా రాత్రి వేళల్లో కొన్నిచోట్ల ఈదురుగాలులతో (గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో) కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయట. ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు ఉంటాయని.. మే 2 వరకు ఈ వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణకేంద్రం ప్రకటించింది.

0900 यूटीसी पर आधारित तेलंगाना का 7-दिवसीय पूर्वानुमान (शाम) 1730 बजे IST पर जारी किया गया/7-day forecast(EVENING) of TELANGANA based on 0900 UTC issued at 1730 hours IST Dated : 27/05/2026 @TelanganaCS @DCsofIndia @IASassociation @TelanganaDGP @TelanganaCMO @GHMCOnline @HYDTP pic.twitter.com/hObrmyJsWz

— Meteorological Centre, Hyderabad (@metcentrehyd) May 27, 2026

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
వాతావరణం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Recommended image2
Now Playing
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu
Recommended image3
Now Playing
స్టూడెంట్స్ మాటలకూ పొట్టపగిలేలా నవ్వుతున్న Chandrababu | Asianet Telugu
Related Stories
Recommended image1
IMD Rain Alert : ఆల్రెడీ ఇక్కడ గాలివాన బీభత్సం ... కొద్దిసేపట్లో ఈ జిల్లాల్లోనూ అల్లకల్లోలమే
Recommended image2
IMD Rain Alert : ఈ రెండ్రోజులూ భారీ వర్షాలే.. ఈ పది జిల్లాల్లో పవర్ ఫుల్ వానలు, ఇక అతలాకుతలమే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved