MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Andhra Pradesh
  • IMD Rain Alert : ఉపరితల ఆవర్తనంతోనే జోరువానలు, ఇప్పుడు ద్రోణి కూడా.. ఈ ప్రాంతాల్లో పెను బీభత్సమే

IMD Rain Alert : ఉపరితల ఆవర్తనంతోనే జోరువానలు, ఇప్పుడు ద్రోణి కూడా.. ఈ ప్రాంతాల్లో పెను బీభత్సమే

IMD Rain Alert :  ఇప్పటికే ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి… ఇప్పుడు ద్రోణి కూడా తోడయ్యింది. దీంతో వర్షబీభత్సం పెరిగే అవకాశాలున్నాయిని  ఇరురాష్ట్రాల వాతావరణ శాఖలు హెచ్చరిస్తున్నాయి. 

2 Min read
Author : Arun Kumar P
Published : Mar 23 2026, 10:12 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు వర్షాలు
Image Credit : X/APSDMA

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు వర్షాలు

IMD Rain Alert : వేసవికాలంలో కూడా తెలుగు రాష్ట్రాలను వర్షాలు వదిలిపెట్టడంలేదు. గత వారమంతా వర్షాలు కురిశాయి.. ఇవి ఈ వారం కూడా కొనసాగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మరో రెండుమూడు రోజులు ఎండల తీవ్రత తక్కువగా ఉంటుంది.. ఆకాశం మేఘాలతో కప్పేసి ఆహ్లాదకర వాతావరణం ఉంటుందట. సాయంత్రం వేళల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోతుందని... ఉరుములు మెరుపులు, పిడుగులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
ఉపరితల ఆవర్తనానికి తోడైన ద్రోణి..
Image Credit : Gemini AI

ఉపరితల ఆవర్తనానికి తోడైన ద్రోణి..

ఆంధ్ర ప్రదేశ్ విషయానికి వస్తే... ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఇవాళ (సోమవారం, మార్చి 23న) ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) ప్రకటించింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

37
ఏపీకి పిడుగుల ప్రమాదం..తస్మాత్ జాగ్రత్త
Image Credit : Gemini AI

ఏపీకి పిడుగుల ప్రమాదం..తస్మాత్ జాగ్రత్త

బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కూడా కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. ఇలా వర్షాలు కురిసే సమయంలో పిడుగులు పడే ప్రమాదం ఉంటుంది... అలాగే ఈదురుగాలులతో కొమ్మలు విరిగిపడతాయి... కాబట్టి ప్రజలెవ్వరూ చెట్లకింద ఉండరాదని హెచ్చరిస్తోంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసేటపుడు పొలాల్లో, బహిరంగ ప్రదేశాల్లో కూడా ఉండరాదని.. సురక్షితమైన భవనాల్లో తలదాచుకోవాలని APSDMA సూచించింది.

47
ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్
Image Credit : Gemini AI

ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్

తెలంగాణ విషయానికి వస్తే నల్గొండ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయంటూ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే భద్రాద్రి కొత్తగూడెం, జనగాం, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, నాగర్ కర్నూల్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నేడు (మార్చి 23న) తెలంగాణలోని చాలాప్రాంతాల్లో పొడి వాతావరణమే ఉంటుందని వెల్లడించింది.

57
తెలంగాణలో రేపు మళ్లీ జోరువానలు..
Image Credit : Asianet News

తెలంగాణలో రేపు మళ్లీ జోరువానలు..

మార్చి 24న (మంగళవారం) అంటే రేపు తెలంగాణలో మళ్లీ వర్షాలు జోరందుకుంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కోమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ఈ వర్షాలకు ఉరుములు మెరుపులు, గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు తోడై ప్రమాదకంగా మారే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

67
ఈ జిల్లాల్లోనే అత్యధిక వర్షపాతం..
Image Credit : X/APSDMA

ఈ జిల్లాల్లోనే అత్యధిక వర్షపాతం..

ఇదిలావుంటే మార్చి 22న అంటే నిన్న ఆదివారం వర్షాలు కురిశాయి... అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాల్లో 2.1 మి.మీ వర్షపాతం నమోదయ్యింది. జిల్లాలవారిగా ఆదివారం కురిసిన సగటు వర్షపాతం చూసుకుంటే రంగారెడ్డిలో 0.4, నల్గొండలో 0.7, ఖమ్మంలో 0.6, భద్రాద్రి కొత్తగూడెంలో 0.6, జనగాం, మేడ్చల్ మల్కాజ్ గిరిలో 0.1 చొప్పున వర్షపాతం నమోదయ్యింది.

77
ఆదివారం అత్యధిక వర్షపాతం నమోదైన టాప్ 10 ప్రాంతాలు...
Image Credit : X/Warangal Weatherman

ఆదివారం అత్యధిక వర్షపాతం నమోదైన టాప్ 10 ప్రాంతాలు...

  • యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో అత్యధికంగా 14.8 మి.మీ వర్షపాతం నమోదయ్యింది.
  • యాదాద్రి భువనగిరి ఆత్మకూరులో 13.5 మి.మీ
  • నల్గొండ జిల్లా మర్రిగూడలో 11.7 మి.మీ
  • ఖమ్మం జిల్లా యెర్రుపాలెంలో 11.0 మి.మీ
  • నల్గొండ జిల్లా శాలిగౌరారంలో 5.1 మి.మీ
  • రంగారెడ్డి జిల్లా కడ్తాల్ లో 4.8 మి.మీ
  • రంగారెడ్డి జిల్లా కందుకూరులో 4.4 మి.మీ
  • యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో 4.1 మి.మీ
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకపల్లెలో 3.6 మి.మీ
  • నల్గొండ జిల్లా చండూరులో 3.3 మి.మీ

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆంధ్ర ప్రదేశ్
తెలంగాణ
వాతావరణం
హైదరాబాద్
విజయవాడ
విశాఖపట్నం
తిరుపతి
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
😂 Student Hilarious Reply To Nara Lokesh |లోకేష్ కే పంచు వేసిన బుడ్డోడు | Asianet News Telugu
Recommended image2
Weather Update: తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ బిగ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
Recommended image3
Now Playing
మారనున్న తిరుమల రూపురేఖలు సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం | CM Chandrababu Naidu Tirumala Visite
Related Stories
Recommended image1
IMD Rain Alert : ఉత్తరాంధ్ర తీరంలో ఉపరితల ఆవర్తనం.. ఈ జిల్లాల్లో డేంజర్ వానలు, బిఅలర్ట్
Recommended image2
IMD Rain Alert: ఉరుములు, మెరుపులు, వ‌డ‌గండ్ల వాన‌లు.. వ‌చ్చే 24 గంట‌లు అత్యంత జాగ్ర‌త్త అవ‌స‌రం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved