MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Andhra Pradesh
  • Weather Update: ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన.. బంగాళాఖాతంలో అల్పపీడనంతో ఈ ప్రాంతాల్లో వర్షాలు

Weather Update: ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన.. బంగాళాఖాతంలో అల్పపీడనంతో ఈ ప్రాంతాల్లో వర్షాలు

Weather Update: బంగాళాఖాతంలో అల్పపీడనంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మే 16న అండమాన్ తీరానికి నైరుతి రుతుపవనాలు చేరనున్నాయని ఐఎండీ అంచనా వేసింది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : May 14 2026, 08:02 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వర్షాలు వచ్చేస్తున్నాయ్.. మే 16న రుతుపవనాల ఎంట్రీ! ఆ జిల్లాల వారికి దబిడి దిబిడే
Image Credit : Gemini AI

వర్షాలు వచ్చేస్తున్నాయ్.. మే 16న రుతుపవనాల ఎంట్రీ! ఆ జిల్లాల వారికి దబిడి దిబిడే

తెలుగు రాష్ట్రాల ప్రజలకు అటు ఎండలు, ఇటు వానలు డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్నాయి. ఒకవైపు భానుడు భగభగమంటుంటే, మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాతావరణాన్ని కూల్ చేసేందుకు రెడీ అవుతోంది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తాజా బులిటెన్ ప్రకారం.. రానున్న ఐదు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణం విచిత్రంగా మారబోతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మే 16న రుతుపవనాల గ్రాండ్ ఎంట్రీ
Image Credit : Asianet News

మే 16న రుతుపవనాల గ్రాండ్ ఎంట్రీ

వేసవి తాపంతో అల్లాడిపోతున్న వారికి ఇది నిజంగా గుడ్ న్యూస్. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల రాకకు లైన్ క్లియర్ అయ్యింది. మే 16వ తేదీ నాటికి ఇవి దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయి. 

అంటే దేశంలోకి వర్షాకాలం ఎంట్రీ ఇవ్వడానికి ముహూర్తం ఫిక్స్ అయినట్లే. ప్రస్తుతం పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న బలమైన అల్పపీడనం సముద్ర మట్టానికి సుమారు 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉండటంతో వర్షాలు పడేందుకు వాతావరణం అనుకూలంగా మారింది.

35
తెలంగాణలో వానలు.. అంతలోనే వడగాల్పులు
Image Credit : Getty

తెలంగాణలో వానలు.. అంతలోనే వడగాల్పులు

తెలంగాణలో వాతావరణం కాస్త మిక్స్డ్ గా ఉండబోతోంది. మే 14న రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసే ఛాన్స్ ఉంది. అయితే, మరో నాలుగు రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు 2 నుండి 3 డిగ్రీలు పెరిగే ఛాన్స్ కూడా ఉంది.

భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయి. మే 15-16 తేదీల్లో జయశంకర్ భూపాలపల్లి, ములుగులో గంటకు 40-50 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ అంచనా వేసింది.

ఇక ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. మే 15 నుంచి ఇక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉంది. మే 17 నాటికి కరీంనగర్, పెద్దపల్లికి కూడా ఇవి విస్తరిస్తాయని ఐఎండీ అంచనా వేసింది.

45
ఏపీలో ఎండల సెగ.. రాయలసీమలో పిడుగుల భయం
Image Credit : Gemini AI

ఏపీలో ఎండల సెగ.. రాయలసీమలో పిడుగుల భయం

ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి మరీ హాట్‌గా ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు చేరుకునే అవకాశం ఉందని APSDMA హెచ్చరించింది. అల్లూరి సీతారామరాజు జిల్లా, పోలవరం ప్రాంతాల్లో తీవ్రమైన వడగాల్పులు వీస్తాయని చెప్పింది.

నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో మే 15, 16 తేదీల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. రాయలసీమ జిల్లాల్లో మే 15, 16 తేదీల్లో అక్కడక్కడా పిడుగులు పడే ఛాన్స్ ఉంది. వర్షం పడే సమయంలో పొలాల్లో ఉండేవారు, ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

55
జాగ్రత్తలు తీసుకోండి
Image Credit : Gemini AI

జాగ్రత్తలు తీసుకోండి

వాతావరణం ప్రతికూలంగా ఉన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

1. వర్షం పడేటప్పుడు చెట్ల కింద గానీ, విద్యుత్ స్తంభాల దగ్గర గానీ నిలబడకండి.

2. ఎండలు తీవ్రంగా ఉన్నప్పుడు బయటకు వెళ్తే గొడుగు, మంచినీళ్ల బాటిల్ వెంట తీసుకెళ్లండి.

3. పిడుగులు పడే అవకాశం ఉన్నప్పుడు ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగం తగ్గించడం మంచిది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వాతావరణం
అమరావతి
హైదరాబాద్
ఆంధ్ర ప్రదేశ్
తెలంగాణ
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Schools Bandh : తీవ్ర వాయుగుండం లోడింగ్, ఇక కుండపోత వర్షాలే... ఈ జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు
Recommended image2
Now Playing
Chaganti Amazed By The Children Wonderful Performance | Nara Lokesh | Asianet News Telugu
Recommended image3
Now Playing
ఈ ఏజ్ లో బాబుగారు ఎలా కష్టపడుతున్నారో చూడండి | Asianet News Telugu
Related Stories
Recommended image1
RCB vs KKR: కోహ్లీ విశ్వరూపం.. 10వ సెంచరీతో కేకేఆర్ పని ఫినిష్! పాయింట్ల పట్టికలో ఆర్‌సీబీ నెంబర్ వన్!
Recommended image2
Heart Shaped Glass Bridge: ప్రేమికులకు పండగే.. హార్ట్ షేప్ లో తెలంగాణ ఫస్ట్ గ్లాస్ బ్రిడ్జి! ఎక్కడంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved