వాతావరణం:ఈ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్.. అస్సలు బయటకు రావొద్దు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ రోజు అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. ఆదిలాబాద్,కొమురంభీమ్,మంచిర్యాల,నిర్మల్,కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. భారత వాతావరణ శాఖ (IMD) తాజా వివరాల ప్రకారం.. బంగ్లాదేశ్ పైన గాలితో కూడిన సుడి తిరుగుతోంది. మధ్య ప్రదేశ్‌పై మరో ద్రోణి ఉంది. ఈ ద్రోణి మధ్య ప్రదేశ్ నుంచి తమిళనాడు వరకూ ఉంది. మరో ద్రోణి విదర్భ నుంచి కేరళ వరకూ ఉంది. ఈ పరిస్థితుల వల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, యానాం, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరిలో వర్షాలు పడే అవకాశాలూ ఉన్నాయి.
- FB
- TW
- Linkdin
Follow Us
)
మండు టెండలు
తెలంగాణలో 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్,కొమురంభీమ్,మంచిర్యాల,నిర్మల్,కామారెడ్డి మెదక్ జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. దీంతో ఈ జిల్లాల ప్రజలు మధ్యాహ్నం వేళ అస్సలు బయటకు రావొద్దని అధికారులు సూచించారు. జగిత్యాల,కరీంనగర్,నిజామాబాద్,పెద్దపల్లి.. సిరిసిల్ల జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. దీంతో ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు సూచించారు.
ఉత్తరాది రాష్ట్రాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, గుజరాత్‌లలో తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదు కావొచ్చని తెలిపింది. రెండు రోజులపాటు అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయని వివరించింది. మరో ఆరు రోజులపాటు వడగాలులు ఉంటాయని హెచ్చరించింది.
హైదరాబాద్, విశాఖపట్నం వాతావరణం
ఏపీ, తెలంగాణలో బుధవారం రోజంతా మేఘాలు ఉంటాయి. తెలంగాణలో ఉదయం హైదరాబాద్ పరిసరాల్లో జల్లులు కురిసే అవకాశం ఉంది. సాయంత్రం మళ్లీ హైదరాబాద్ పరిసరాల్లో వర్షం పడే అవకాశం ఉంది. అది జల్లుల రూపంలో ఉండొచ్చు. అయితే తెలంగాణలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ లేదు. వాతావరణం మాత్రం మేఘాలతో ఉంటుంది.
వర్షాలకు అవకాశం
ఇవి నైరుతీ రుతుపవనాల వల్ల పడుతున్న వర్షాలు కావు. అకాల వర్షాలు అందువల్ల మేఘాలలో రాపిడి ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల వారం పాటూ పిడుగులు కూడా పడతాయని IMD చెప్పింది. ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ సమయంలో గాలి వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు ఉంటుందనీ, ఒక్కోసారి గంటకు 50 కిలోమీటర్లు కూడా ఉంటుందని తెలిపింది.