- Home
- Andhra Pradesh
- Vande Bharat Sleeper: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఈ మార్గంలో మరో వందేభారత్ స్లీపర్
Vande Bharat Sleeper: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఈ మార్గంలో మరో వందేభారత్ స్లీపర్
Vande Bharat Sleeper: వందేభారత్ స్లీపర్ రైలు సేవలు మరిన్ని మార్గాల్లో అందుబాటులోకి వస్తున్నాయి. ఇందులో భాగంగా ముంబై–బెంగళూరు మధ్య రెండో వందేభారత్ స్లీపర్ రైలును తీసుకొచ్చేందుకు రైల్వే అధికారులు సిద్ధమవుతున్నారు.

వారానికి ఆరు రోజులు ప్రయాణం
ముంబై–బెంగళూరు వందేభారత్ స్లీపర్ రైలు వారంలో ఆరు రోజులు నడవనుంది. బెంగళూరు నుంచి సోమవారం, ముంబై నుంచి మంగళవారం రైలు సేవలు ఉండవు. బెంగళూరు నుంచి ప్రతి రోజు రాత్రి 10 గంటలకు రైలు బయల్దేరుతుంది. మరుసటి రోజు మధ్యాహ్నం 1:50 గంటలకు ముంబై చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ముంబై నుంచి రాత్రి 10:30 గంటలకు బయల్దేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 2:50 గంటలకు బెంగళూరు చేరుతుంది.
మొత్తం 16 గంటల ప్రయాణ సమయం
ముంబై–బెంగళూరు మధ్య ప్రస్తుతం నడుస్తున్న ప్రముఖ రైళ్లలో ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్ ఒకటి. ఈ రైలులో ప్రయాణానికి దాదాపు 22 గంటల సమయం పడుతుంది. కొత్తగా అందుబాటులోకి రానున్న వందేభారత్ స్లీపర్ రైలుతో ఈ ప్రయాణ సమయం సుమారు 16 గంటలకు తగ్గనుంది. అంటే ప్రయాణికులకు దాదాపు ఆరు గంటల వరకు సమయం ఆదా అయ్యే అవకాశం ఉంది. రాత్రి ప్రయాణించేలా సమయాలను నిర్ణయించడంతో ప్రయాణికులు నిద్రిస్తూ సుదూర ప్రయాణాన్ని పూర్తి చేయవచ్చు.
ఏపీలో రెండు స్టేషన్లలో హాల్ట్
ఈ రైలు ఆంధ్రప్రదేశ్ మీదుగా కూడా ప్రయాణించనుంది. రాష్ట్రంలోని అనంతపురం, గుంతకల్లు స్టేషన్లలో వందేభారత్ స్లీపర్ రైలు ఆగనుంది. దీంతో ఈ ప్రాంతాల నుంచి ముంబై, బెంగళూరు వెళ్లే ప్రయాణికులకు కొత్త రైలు సేవ ఉపయోగపడనుంది. ఏపీతో పాటు కర్ణాటక, మహారాష్ట్రలోని పలు ముఖ్యమైన నగరాలను ఈ రైలు కలుపుతుంది.
Bengaluru 🔁 Mumbai Sleeper Vande Bharat likely to hit the tracks this month!
• Bengaluru → Mumbai: 10:00 PM – 1:50 PM
• Mumbai → Bengaluru: 10:30 PM – 2:50 PM
• Journey time: ~16 hours
If these timings holds, it could become the fastest train between Bengaluru & Mumbai 🔥…— Trains of India 🇮🇳 (@trainwalebhaiya) October 2, 2026
ఈ స్టేషన్లలోనూ ఆగుతుంది
అనంతపురం, గుంతకల్లుతో పాటు రాయచూర్, కలబురగి, సోలాపూర్, పుణె, కల్యాణ్ స్టేషన్లలో కూడా రైలు ఆగనుంది. దీంతో మొత్తం మార్గంలో ముఖ్యమైన నగరాల ప్రయాణికులకు ఈ సేవ అందుబాటులో ఉంటుంది. వందేభారత్ స్లీపర్ రైలు అందుబాటులోకి వస్తే రాత్రి ప్రయాణం చేసేవారికి మెరుగైన సౌకర్యాలు లభించే అవకాశం ఉంది. అయితే రైలు ప్రారంభ తేదీ, ఛార్జీలు, పూర్తి టైమ్‌టేబుల్‌పై రైల్వే శాఖ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

