MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Andhra Pradesh
  • Vegetable Price : ఒక్క రూపాయికే కిలో టమాటా... ఎక్కడో తెలుసా..?

Vegetable Price : ఒక్క రూపాయికే కిలో టమాటా... ఎక్కడో తెలుసా..?

Tomato Price : అటు రైతులకు కిలో టమాటాకు కేవలం రూపాయి, రెండ్రూపాయల ధర వస్తోంది... ఇటు వినియోగదారులకు రూ.10-20 ధరకు కిలో టమాటా లభిస్తోంది. మధ్యలో వ్యాపారులు లాభాలను ఎంజాయ్ చేస్తున్నారు. 

2 Min read
Author : Arun Kumar P
Published : Mar 24 2026, 10:16 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
నష్టాల్లో టమాటా రైతులు...
Image Credit : Asianet News

నష్టాల్లో టమాటా రైతులు...

Vegetable Price : 'అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని' అన్నట్లుంది ప్రస్తుతం రైతుల పరిస్థితి. మార్కెట్లో టమాటా ధర రూ.20-30 వరకు పలుకుతోంది... కానీ ఎంతో కష్టపడి వాటిని పండించే రైతులకు మాత్రం రూపాయి, రెండ్రూపాయల ధర లభిస్తోంది. చివరకు మార్కెట్ కు తరలిద్దామంటే కూలీ, రవాణా ఖర్చులు కూడా రావడంలేదు. అందుకే కొందరు రైతులు పొలాల్లో, మరికొందరు రైతులు రోడ్ల పక్కన టమాటా పంటను పోసేస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కేవలం రూపాయికే కిలో టమాటా...
Image Credit : Asianet News

కేవలం రూపాయికే కిలో టమాటా...

ఆంధ్ర ప్రదేశ్ లో టమాటా పంటను ఎక్కువగా పండిస్తుంటారు. అయితే తాజాగా టామాటా ధర చూసి రైతులు ఆందోళనకు గురవుతున్నారు. నంద్యాల జిల్లా ప్యామిలి మార్కెట్ లో కిలో టమాటా కేవలం రూపాయి పలికింది. కొందరు రైతుల టమాటా పంట రూ.2, రూ.3 కి కిలో పలికింది. ఇదే మంచిధరగా భావించి వ్యాపారుల దగ్గర రైతులు డబ్బులు తీసుకోవాల్సి వచ్చింది.

ఓ రైతు 25 కిలోల చొప్పున 100 కు పైగా టమాటా బాక్సులను ప్యామిలి మార్కెట్ కు తీసుకెళ్లాడు. బాక్సుకు రూ.30 చొప్పున అతడికి కేవలం రూ.3 వేల వచ్చాయి. ఇందులో కమీషన్ పోను రూ.2 వేలు మాత్రమే రైతు చేతికి వచ్చాయి. అయితే టమాటా తెంపిక కూలీలు, రవాణా ఖర్చులు రూ.2 వేలకు పైనే అవుతాయి. అంటే ఆ టమాటా రైతుకు లాభం రావడం కాదు చేతినుండి డబ్బులు ఖర్చు చేయాల్సి వచ్చింది. ఇదీ ప్రస్తుతం టమాటా రైతుల పరిస్థితి.

Related Articles

Related image1
Today Gold Rate: ఉగాది తర్వాత మళ్లీ పెరిగిన ధరలు....గ్రాముపై ఎంతంటే..?
Related image2
Now Playing
Iran Israel War: తెలుగు రాష్ట్రాల్లో గుడ్ల ధరలు ఎంతో తెలుసా? | Eggs, Chicken Price | Asianet Telugu
35
మార్కెట్ల వారిగా టమాటా ధరలు...
Image Credit : freepik

మార్కెట్ల వారిగా టమాటా ధరలు...

ప్రస్తుతం నంద్యాల జిల్లా ప్యామిలిలో అతి తక్కువగా కేవలం రూ.1 నుండి రూ.3 వరకు టమాటా ధర పలుకుతోంది. అలాగే అనంతపురం జిల్లా ఉరవకొండ మార్కెట్లో కూడా ఇదే పరిస్థితి... కేవలం రూ.2-3 ధర మాత్రమే ఉంది. రాష్ట్రంలో ప్రధానమైన టమాటా మార్కెట్ మదనపల్లిలో కాస్త నయం... కిలో టమాటా ధర రూ.7 ఉంది. ఇదే చిత్తూరు జిల్లా పలమనేరు మార్కెట్లో మాత్రం రూ.3-5 పలుకుతోంది.

తెలంగాణలో కూడా టమాటా ధరలు భారీగా పతనం అయ్యాయి. హైదరాబాద్ లో టమాటా రైతులకు కేవలం రూ.3 నుండి రూ.5 కిలో ధర లభిస్తోంది. అదే వ్యాపారులు రూ.12 నుండి రూ.15 కి అమ్ముతున్నారు. అంటే పండించిన రైతుల కంటే వ్యాపారులే ఎక్కువ లాభం పొందుతున్నారు.

45
మార్కెట్ లో టమాటా ధర ఎంతుంది..?
Image Credit : Asianet News

మార్కెట్ లో టమాటా ధర ఎంతుంది..?

ఆరుగాలాలు కష్టపడి టమాటా పండించిన రైతులకు ధర లేదు.. కానీ మార్కెట్ లో మాత్రం మంచి ధర ఉంది. విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో వ్యాపారులు కిలో టమాటా ధర రూ.10-20 వరకు ఉంది. హైదరాబాద్ లో కూడా ఇదే ధర ఉంది. చిన్నచిన్న పట్టణాల్లో మాత్రం మరింత తక్కువ ధర పలుకుతోంది.

55
ఇతర కూరగాయాల ధరలు...
Image Credit : Google Gemini AI

ఇతర కూరగాయాల ధరలు...

ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో పచ్చిమిర్చి భగ్గుమంటోంది... కిలో రూ.45 పలుకుతోంది. ఇక బెండకాయలు రూ.35, వంకాయలు రూ.15, కాకరకాయ రూ.23, బీరకాయ రూ.30, బీన్స్ రూ.40-50, క్యారెట్ రూ.20, దొండకాయ రూ.30-35, చిక్కుడు రూ.40, క్యాప్సికం రూ.40, ఆలుగడ్డ రూ.18, దోసకాయ రూ.15, సొరకాయ రూ.15 కిలో పలికింది.

ఇక ఉల్లిపాయల ధరలు స్థిరంగా ఉన్నాయి. కిలో రూ.15 నుండి రూ.20 కి లభిస్తున్నాయి. రూ.100 కి ఐదారుకిలోల ఉల్లిపాయలు కూడా లభిస్తున్నాయి. ఇవి నిల్వ ఉంటాయి కాబట్టి ఒకేసారి కొనిపెట్టుకోవడం మంచిది… భవిష్యత్ లో ధర పెరిగినాా పెద్దగా ప్రాబ్లం ఉండదు. 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
వ్యవసాయం (Vyavasayam)
ఆంధ్ర ప్రదేశ్
తెలంగాణ
హైదరాబాద్
విజయవాడ
విశాఖపట్నం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
Chilakaluripet Road Incident: ప్రైవేట్ బస్సు - ఆటో ఢీ.. 7 గురు మృతి! | Asianet Telugu
Recommended image2
AP Road Accident : చిలకలూరిపేట రోడ్డు ప్రమాదానికి కారణమేంటో తెలుసా?
Recommended image3
Now Playing
జగన్ ను ఇమిటేట్ చేసిన లోకేష్ | Nara Lokesh Imitates YS Jagan | Asianet News Telugu
Related Stories
Recommended image1
Today Gold Rate: ఉగాది తర్వాత మళ్లీ పెరిగిన ధరలు....గ్రాముపై ఎంతంటే..?
Recommended image2
Now Playing
Iran Israel War: తెలుగు రాష్ట్రాల్లో గుడ్ల ధరలు ఎంతో తెలుసా? | Eggs, Chicken Price | Asianet Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved