MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • Tirupati Tourism: తిరుమల తిరుపతి సమీపంలో తప్పక చూడాల్సిన టాప్-7 పుణ్యక్షేత్రాలు

Tirupati Tourism: తిరుమల తిరుపతి సమీపంలో తప్పక చూడాల్సిన టాప్-7 పుణ్యక్షేత్రాలు

Tirupati Tourism: ఆంధ్రప్రదేశ్ అనేక పర్యాటక ప్రాంతాలకు గమ్యస్థానంగా ఉంది. మరీ ముఖ్యంగా తిరుపతిలో చూడాల్సిన పర్యాటక ప్రాంతాలు చాలానే ఉన్నాయి. వాటిలో తిరుమల ప్రతి సంవత్సరం కోట్లాది భక్తులను ఆకర్షిస్తుంది. తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర ఆలయం ప్రపంచంలోని అత్యంత పవిత్రమైన, అత్యధిక మంది సందర్శించబడే హిందూ దేవాలయంగా గుర్తింపు సాధించింది. తిరుపతిలో కేవలం కళియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఒక్కటే కాదు..  సమీపంలో ఇక్కడ చూడాల్సిన పర్యాటక ప్రాంతాలు చాలానే ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.  

2 Min read
Mahesh Rajamoni
Published : Apr 02 2025, 09:30 PM IST| Updated : Apr 02 2025, 09:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Tirupati Tourism: Tirumala Tirupati Devasthanams

Tirupati Tourism: Tirumala Tirupati Devasthanams

1. శ్రీ వెంకటేశ్వర ఆలయం 

తిరుపతిలో ఉన్న ప్రధాన ఆధ్యాత్మిక ప్రదేశం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర ఆలయం. ఏడాది పాటు అనేక ఉత్సవాలు జరుపుకుంటూ కోట్లాది మంది భక్తులు సందర్శించే గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా ఉంది. శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఇక్కడ కోలువై ఉన్నారు. తిరుమలలోని ఏడు కోండలపైన వెలసిన ఈ ఆలయం చుట్టూ ఉన్న ప్రాంతాల పర్యాటక దృశ్యాలు అద్భుతంగా ఉంటూ ఆహ్లాదాన్ని పంచుతాయి.
 

27
Tirupati Tourism: Tiruchanur Sri Padmavati Ammavaari Temple

Tirupati Tourism: Tiruchanur Sri Padmavati Ammavaari Temple

2. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం 

తిరుపతి పట్టణం నుంచి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీ పద్మావతి అమ్మవారు కోలువైన ఈ ఆలయం ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం, చారిత్రక ప్రదేశం. తిరుపతి వెళ్లే భక్తులు తప్పక దర్శించవలసిన ప్రదేశాలలో ఇది ఒకటి. 

37
Tirupati Tourism: Kapila Teertham

Tirupati Tourism: Kapila Teertham

3. కపిల తీర్థం: 

కపిల తీర్థం అనేది తిరుమల కొండల పక్కన ఉన్న ఒక పవిత్ర జలపాతం, శివాలయం. ఇక్కడ కపిల మహర్షి సాధన చేశారని నమ్ముతారు. తిరుపతికి సుమారు 5 కిలోమీటర్లు దూరంలో ఉండే ఈ ప్రాంతం శివరాత్రి రోజుల్లో భక్తులతో కిటకిటలాడుతుంది. పర్యాటకులు, భక్తులకు శాంతియుత, ఎంతో ఆహ్లాదకరమైన అనుభూతిని పంచుతుంది.

47
Tirupati Tourism: Sri Govindharaja swamy temple

Tirupati Tourism: Sri Govindharaja swamy temple

4. శ్రీ గోవిందరాజస్వామి ఆలయం 

తిరుపతి నగరంలో ఉన్న ఈ శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో శ్రీమహావిష్ణువు కోలువైవున్నాడు. ఈ ఆలయం చారిత్రకంగా ఎంతో ప్రాముఖ్యతను కలిగివుంది. ఈ ఆలయ రాజగోపురం ఎంతో ప్రసిద్ధి చెందింది. భక్తులు ఈ ఆలయాన్ని తిరుమలకు వెళ్లేముందు సందర్శిస్తారు.

57
Tirupati Tourism: Srikalahasti Temple

Tirupati Tourism: Srikalahasti Temple

5. శ్రీకాళహస్తి ఆలయం: 

తిరుపతికి సమీపంలో ఉంటే శ్రీకాళహస్తి ఆలయం దేశంలోని గొప్ప శివాలయాల్లో ఒకటి. ఇది తిరుపతి నుంచి సుమారు 38 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం. ఇక్కడ శివుడు కాళహస్తేశ్వరుడుగా కోలువై ఉన్నాడు. దీనిని "కాళహస్తి" అని కూడా పిలుస్తారు. ఈ ఆలయాన్ని ఒక్కసారి సందర్శిస్తే మన పాపాలు అన్ని పోయి శుభం కలుగుతుందని నమ్ముతారు.

67
Tirupati Tourism: Sri Kalyana Venkateshwara Swamy Temple

Tirupati Tourism: Sri Kalyana Venkateshwara Swamy Temple

6. శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం 

శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం తిరుపతికి 12 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. శ్రీనివాస మంగాపురంలోని ఆ ఆలయంలో శ్రీ వేంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకున్న తర్వాత 6 నెలలు ఇక్కడ ఉన్నారని భక్తుల నమ్మకం. కొత్త వివాహ జంటలు ఎక్కువగా వస్తుంటారు. దీంతో వారి జీవితం సుఖ సంతోషాలతో ముందుకు సాగుతుందని నమ్ముతారు.

77
Tirupati Tourism: the Parasurameswara Swamy Temple of Gudimallam

Tirupati Tourism: the Parasurameswara Swamy Temple of Gudimallam

7. గుడిమల్లం పరశురామేశ్వరాలయం 

తిరుపతికి సుమారు 20 కిలో మీటర్ల దూరంలో ఉన్న గుడిమల్లం పరశురామేశ్వరాలయం భారతదేశంలోని పురాతన శివాలయాలలో ఒకటి. ఇక్కడ ఉన్న శివలింగం చాలా ప్రత్యేకమైనది. ఈ లింగంపై పరశురాముడు, గణపతి, ఇతర దేవతల ఆకృతులు ఉంటాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
తిరుపతి
ప్రయాణం
హిందూ పండుగలు
ఆంధ్ర ప్రదేశ్
ఆధ్యాత్మిక విషయాలు
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved