ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024: తెలుగుదేశం, వైఎస్ఆర్‌సీపీకి కీలకం, దెబ్బేనా?
2024 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై అధికార,విపక్షాలు కేంద్రీకరించాయి. ఈ ఎన్నికలను ఈ రెండు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024: తెలుగుదేశం, వైఎస్ఆర్‌సీపీకి కీలకం, దెబ్బేనా?
2024లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు తెలుగుదేశం, వైఎస్ఆర్‌సీపీకి కీలకమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.2024 ఏప్రిల్ మాసంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. అయితే నిర్ణీత షెడ్యూల్ కంటే ముందుగానే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది. దరిమిలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీ పార్టీలు ఎన్నికలకు సన్నద్దమౌతున్నాయి.
also read:ఆంధ్రప్రదేశ్‌లో పూర్వ వైభవం కోసం: వై.ఎస్. షర్మిలతో కాంగ్రెస్ స్కెచ్ మామూలుగా లేదుగా.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024: తెలుగుదేశం, వైఎస్ఆర్‌సీపీకి కీలకం, దెబ్బేనా?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విబజన 2014లో జరిగింది. ఆవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారిగా తెలుగుదేశం పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంది. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారానికి దూరమైంది. 2019 ఎన్నికల్లో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్‌సీపీ) విజయం సాధించింది.
also read:పార్లమెంట్ ఎన్నికలు 2024: తెలంగాణకు అమిత్ షా, ఆ స్థానాలే టార్గెట్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024: తెలుగుదేశం, వైఎస్ఆర్‌సీపీకి కీలకం, దెబ్బేనా?
2024లో జరిగే ఎన్నికల్లో అధికారాన్ని దక్కించుకోవడంపై తెలుగుదేశం పార్టీ ఫోకస్ పెట్టింది. 2024లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేనలు కలిసి పోటీ చేయనున్నాయి. ఈ కూటమిలోకి బీజేపీ వస్తుందా రాదా అనే విషయమై రానున్న రోజుల్లో తేలనుంది.
also read:ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ,జనసేన పొత్తు: బీజేపీ దారెటు?
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024: తెలుగుదేశం, వైఎస్ఆర్‌సీపీకి కీలకం, దెబ్బేనా?
2024 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి రాకుండా అడ్డుకోగలిగితే ఆ పార్టీ మనుగడ కష్టమయ్యే అవకాశం ఉందని వైఎస్ఆర్‌సీపీ నాయకత్వం భావిస్తుంది. ఇప్పటికే చంద్రబాబుకు 73 ఏళ్ల వయస్సు ఉంది. ఒకవేళ 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకపోతే మరో ఐదేళ్ల పాటు వేచి చూడాలి.
also read:ప్రశాంత్ కిషోర్, వై.ఎస్.షర్మిల సంకేతాలు: జగన్ కు దెబ్బేనా?
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024: తెలుగుదేశం, వైఎస్ఆర్‌సీపీకి కీలకం, దెబ్బేనా?
2029 ఎన్నికల నాటికి చంద్రబాబు వయస్సు 78 ఏళ్లు. అప్పటికి చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో చురుకుగా పాల్గొనే అవకాశం ఉండకపోవచ్చనే అభిప్రాయంతో ప్రత్యర్థి పార్టీ నేతలు అంచనాతో ఉన్నారు. చంద్రబాబు తరహాలో వ్యూహత్మకంగా ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో నారా లోకేష్ మరింతగా రాటుదేలాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు
also read:ఆంధ్రప్రదేశ్ పై కాంగ్రెస్ ఫోకస్: వై.ఎస్. షర్మిలతో జగన్ కు చెక్ ?
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024: తెలుగుదేశం, వైఎస్ఆర్‌సీపీకి కీలకం, దెబ్బేనా?
2019లోనే తెలుగుదేశం పార్టీ అధికారానికి దూరం కావడంతో ఆ పార్టీ నేతలపై పలు కేసులు నమోదయ్యాయి. చంద్రబాబు సహా ఆ పార్టీ కీలక నేతలపై కేసులను వైఎస్ఆర్‌సీపీ సర్కార్ మోపిందని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తుంది. 2024లో తెలుగుదేశం అధికారంలోకి రాకుండా నిరోధించగలిగితే తమ పార్టీ భవిష్యత్తుకు ఢోకా ఉండదని వైఎస్ఆర్‌సీపీ నాయకత్వం భావిస్తుంది.
also read:ఆ ఐదు పార్లమెంట్ స్థానాల్లో గెలుపే టార్గెట్: తెలంగాణ కాంగ్రెస్ నేతల వ్యూహం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024: తెలుగుదేశం, వైఎస్ఆర్‌సీపీకి కీలకం, దెబ్బేనా?
2024 అసెంబ్లీ ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాల్లో విజయం కోసం వైఎస్ఆర్‌సీపీ వ్యూహలు రచిస్తుంది. చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పంతో పాటు అన్ని నియోజకవర్గాలపై కూడ వైఎస్ఆర్‌సీపీ వ్యూహత్మకంగా ముందుకు వెళ్తుంది.
also read:తెలంగాణ నుండి పోటీ: సోనియా కోసం ఆ మూడు స్థానాలపై కాంగ్రెస్ ఫోకస్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024: తెలుగుదేశం, వైఎస్ఆర్‌సీపీకి కీలకం, దెబ్బేనా?
2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీని అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలని తెలుగుదేశం పార్టీ కూడ పావులు కదుపుతుంది. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేనలు కలిసి పోటీ చేయనున్నాయి.ఈ కూటమిలో బీజేపీ చేరుతుందా లేదా అనేది ఇంకా స్పష్టత రాలేదు.
also read:తెలంగాణపై బీజేపీ ఫోకస్: ఎంపీ టిక్కెట్ల కోసం బీజేపీ నేతల మధ్య పోటా పోటీ
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024: తెలుగుదేశం, వైఎస్ఆర్‌సీపీకి కీలకం, దెబ్బేనా?
2019 ఎన్నికల తర్వాత బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకుంది.అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్‌సీపీ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలనే ఉద్దేశ్యంతోనే తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేయనున్నట్టుగా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీని అధికారంలోకి రాకుండా కట్టడి చేయగలిగితే ఆ పార్టీ మనుగడ కష్టమేననే అభిప్రాయంతో ప్రత్యర్థి పార్టీ నేతలున్నారు.
దీంతో ఈ దిశగా తెలుగుదేశం పార్టీ నేతలు వ్యూహరచన చేస్తున్నారు.తమపై తప్పుడు కేసులు బనాయించిన పోలీసులు, వైఎస్ఆర్‌సీపీ నేతల పేర్లను రాసుకుంటున్నట్టుగా పలుమార్లు బహిరంగంగానే లోకేష్ ప్రకటించారు. టీడీపీ అధికారంలోకి వస్తే వీరిపై తెలుగుదేశం చర్యలు తీసుకొనే అవకాశాలను కొట్టిపారేయలేమనే చర్చ కూడ సాగుతుంది.దీంతో తెలుగుదేశం, వైఎస్ఆర్‌సీపీలకు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి రావడం కీలకంగా మారింది.
also read:వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేల్లో టెన్షన్: 10 సర్వేలతోనే ఇంచార్జీల మార్పులు