MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • Weather Update: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. రాబోయే 3 రోజులు దంచికొట్టనున్న వానలు

Weather Update: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. రాబోయే 3 రోజులు దంచికొట్టనున్న వానలు

Weather Update: తెలుగు రాష్ట్రాల్లో రానున్న 3 రోజులు ఉరుములు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రాలు హెచ్చరించాయి. ఏ ఏ ప్రాంతాల్లో వానలు పడనున్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 27 2026, 09:09 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తెలుగు రాష్ట్రాల్లో మారిన వాతావరణం: వచ్చే 3 రోజులు వర్షాలే వర్షాలు
Image Credit : Gemini

తెలుగు రాష్ట్రాల్లో మారిన వాతావరణం: వచ్చే 3 రోజులు వర్షాలే వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో క్లైమేట్ ఒక్కసారిగా యూటర్న్ తీసుకుంది. సెప్టెంబర్ 27 నుంచి 29 వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అక్కడక్కడా దంచికొట్టే వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ చెప్పింది. కేవలం వానలే కాదు, ఉరుములు, మెరుపులు, ఇంకా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల స్పీడ్‌తో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రాలు అలర్ట్ చేశాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
తెలంగాణ జిల్లాలకు అలర్ట్
Image Credit : chatgpt

తెలంగాణ జిల్లాలకు అలర్ట్

తెలంగాణ విషయానికి వస్తే, సెప్టెంబర్ 27, 28 తేదీల్లో చాలా జిల్లాల్లో వాతావరణం ఫుల్ కూల్‌గా మారబోతోంది.

• సెప్టెంబర్ 27: కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో గాలివానతో పాటు ఉరుములు, మెరుపులు పడే అవకాశం ఉంది.

• సెప్టెంబర్ 28: జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది.

• సెప్టెంబర్ 29: ఈ రోజు వర్షాల తీవ్రత కాస్త తగ్గి, అక్కడక్కడా నార్మల్ జల్లులు పడే ఛాన్స్ ఉంది. అయితే ఈ రోజుకి ఏ ప్రత్యేక హెచ్చరికలు లేవు.

35
ఏపీ తీరం వెంట బలమైన గాలులు
Image Credit : Gemini

ఏపీ తీరం వెంట బలమైన గాలులు

ఆంధ్రప్రదేశ్, యానాం పరిసర ప్రాంతాల్లో కూడా రాబోయే మూడు రోజులు వాతావరణం మారనుంది.

కోస్తాంధ్ర, యానాం: ఇక్కడ సెప్టెంబర్ 27, 28, 29 తేదీల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయి. ముఖ్యంగా సముద్ర తీరం వెంట గాలి వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు, కొన్నిచోట్ల గరిష్ఠంగా 50 కిలోమీటర్ల వరకు వెళ్లే ఛాన్స్ ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

• రాయలసీమ: ఇక్కడ సెప్టెంబర్ 27, 28 తేదీల్లో ఉరుములు, మెరుపులతో కూడిన చినుకులు లేదా మోస్తరు వర్షాలు పడొచ్చు. కానీ సెప్టెంబర్ 29న మాత్రం ఉరుముల భయం లేదు, కేవలం వేగంగా గాలులు మాత్రమే వీస్తాయి.

45
గోదావరి వరద ఉధృతి: అప్రమత్తంగా ఉన్న అధికారులు
Image Credit : Gemini

గోదావరి వరద ఉధృతి: అప్రమత్తంగా ఉన్న అధికారులు

ఇప్పటికే కురిసిన భారీ వర్షాలు, వాయుగుండం ఎఫెక్ట్‌తో కొన్ని ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో శ్రీకాకుళం, అల్లూరి, పోలవరం జిల్లాల్లో మళ్ళీ పిడుగులతో కూడిన వానలు పడే సూచనలు ఉన్నాయి. ఎగువన పడుతున్న వర్షాల వల్ల గోదావరి నదికి వరద ప్రవాహం పెరుగుతోంది.

ధవళేశ్వరం బ్యారేజి దగ్గర ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో సుమారు 5.19 లక్షల క్యూసెక్కులుగా నమోదు కాగా, ఇది 8-9 లక్షల క్యూసెక్కులకు చేరే ఛాన్స్ ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) అధికారులు తెలిపారు. ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కోవడానికి కేంద్ర, రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగాలు ఆల్రెడీ రెడీగా ఉన్నాయి. పొంగిపొర్లుతున్న వాగులు, కాజ్‌వేలు దాటవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.

55
నైరుతి రుతుపవనాలు దెబ్బకొట్టాయి?
Image Credit : Gemini

నైరుతి రుతుపవనాలు దెబ్బకొట్టాయి?

నిజానికి ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు అనుకున్నంత స్థాయిలో వర్షాలను ఇవ్వలేకపోయాయి. ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షపాతం తగ్గినా, రీసెంట్‌గా బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వల్ల ఆ లోటు 20 శాతం నుంచి 15 శాతానికి తగ్గింది. ఇప్పుడు నైరుతి ఉపసంహరణ రేఖ ఉత్తర భారతదేశం వైపుగా సాగుతోంది. ఈశాన్య మధ్యప్రదేశ్ పరిసరాల్లో ఉన్న వాయుగుండం బలహీనపడి సాధారణ అల్పపీడనంగా మారుతోంది.

ఇక రాబోయే రోజుల్లో ఈశాన్య రుతుపవనాల ముందు వీచే తూర్పు గాలుల వల్ల అక్టోబర్ 3 నుంచి 10 మధ్యలో దక్షిణ తెలంగాణ జిల్లాల్లో మళ్లీ వర్షాలు పడొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వాతావరణం
ఆంధ్ర ప్రదేశ్
తెలంగాణ
హైదరాబాద్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
శ్రీవారి రూ. 300 టికెట్లు ఎందుకు దొర‌క‌డం లేదు, ఆన్‌లైన్ బుకింగ్‌లో స‌మ‌స్య ఏంటి.?
Recommended image2
Laddu ATM: ఈ ఏటీఎం నుంచి లడ్డూలు వస్తాయి.. ఎక్క‌డుంది, ఎలా ప‌ని చేస్తుందంటే.?
Recommended image3
Janasena Party : పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్.. జనసేనలోకి వైసిపి సీనియర్లు, వంగవీటి రాధ సంగతేంటి?
Related Stories
Recommended image1
Top 10 Hardest Languages: ప్రపంచంలో నేర్చుకోవడానికి అత్యంత కష్టమైన టాప్ 10 భాషలు ఏంటో తెలుసా?
Recommended image2
Post Office vs SBI: రూ. 10 వేలు దాస్తే ₹17 లక్షలా? పోస్ట్ ఆఫీస్ vs ఎస్బీఐ.. ఎందులో ఎక్కువ లాభం వస్తుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved