MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • Laddu ATM: ఈ ఏటీఎం నుంచి లడ్డూలు వస్తాయి.. ఎక్క‌డుంది, ఎలా ప‌ని చేస్తుందంటే.?

Laddu ATM: ఈ ఏటీఎం నుంచి లడ్డూలు వస్తాయి.. ఎక్క‌డుంది, ఎలా ప‌ని చేస్తుందంటే.?

Laddu ATM: సాధార‌ణంగా ఏటీఎంల నుంచి డ‌బ్బులు వ‌స్తాయ‌ని తెలిసిందే. అయితే ఏటీఎం మిషిన్ నుంచి ల‌డ్డూలు వ‌చ్చే స‌రికొత్త టెక్నాల‌జీని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇంత‌కీ ల‌డ్డుల ఏటీఎం ఎక్క‌డుంది.? ఇది ఎలా ప‌నిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

2 Min read
Author : Narender Vaitla
Published : Sep 26 2026, 04:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
విజయవాడ ఇంద్రకీలాద్రిపై ‘లడ్డూ ఏటీఎం’..
Image Credit : Bhakthi Nilayam/YT

విజయవాడ ఇంద్రకీలాద్రిపై ‘లడ్డూ ఏటీఎం’..

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గ ఆల‌యంలో భక్తుల సౌకర్యార్థం కొత్త సాంకేతిక సేవ అందుబాటులోకి వచ్చింది. అమ్మవారి లడ్డూ ప్రసాదాన్ని సులభంగా పొందేందుకు అధికారులు ప్రత్యేకంగా లడ్డూ వెండింగ్ మెషిన్‌ (లడ్డూ ఏటీఎం)ను ఏర్పాటు చేశారు. కొండ దిగువన ఉన్న సెంట్రల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన ఈ యంత్రాన్ని దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్, ఆలయ ఛైర్మన్ రాధాకృష్ణ, ఈవో శీనా నాయక్ కలిసి ప్రారంభించారు. దసరా శరన్నవరాత్రుల నేపథ్యంలో భక్తుల రద్దీ పెరగనున్న నేపథ్యంలో ఈ సదుపాయాన్ని తీసుకొచ్చారు. సాధారణ రోజుల్లోనూ భక్తులకు ఇది ఉపయోగపడేలా ఏర్పాటు చేశారు. ప్రసాదం కోసం ప్రత్యేక కౌంటర్ల వద్ద ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం లేకుండా సాంకేతిక పరిజ్ఞానంతో లడ్డూలను తీసుకునే అవకాశం కల్పించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
యూపీఐతో చెల్లింపు.. ఆప్షన్ ఎంచుకుంటే లడ్డూలు
Image Credit : Asianet News

యూపీఐతో చెల్లింపు.. ఆప్షన్ ఎంచుకుంటే లడ్డూలు

ఈ లడ్డూ ఏటీఎంలో భక్తులు నగదు కాకుండా యూపీఐ ద్వారా డిజిటల్ చెల్లింపు చేయవచ్చు. యంత్రంలో అందుబాటులో ఉన్న ఆప్షన్లను ఎంచుకుని అవసరమైన ప్రసాదాన్ని పొందే విధానాన్ని రూపొందించారు. ప్రస్తుతం రూ.100, రూ.200, రూ.300, రూ.400 విలువైన బాక్సులను అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. ఒక్కో రూ.100 బాక్సులో ఆరు లడ్డూలు ఉంటాయి. భక్తులు తమకు కావాల్సిన బాక్సుల సంఖ్యను ఎంపిక చేసుకుని, యూపీఐ చెల్లింపు పూర్తిచేసిన తర్వాత ప్రసాదాన్ని పొందవచ్చు. ఆలయ సిబ్బంది సహాయం అవసరం లేకుండానే ఈ ప్రక్రియను పూర్తి చేసేలా యంత్రాన్ని రూపొందించారు.

35
రూ.6 లక్షలతో ఏర్పాటు..
Image Credit : Bhakthi Nilayam/YT

రూ.6 లక్షలతో ఏర్పాటు..

కనకదుర్గ దేవస్థానంలో తొలిసారిగా ఈ తరహా ప్రసాదం వెండింగ్ మెషిన్‌ను ఏర్పాటు చేసినట్లు దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ తెలిపారు. సుమారు రూ.6 లక్షల వ్యయంతో యంత్రాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం దీనిని ప్రయోగాత్మకంగా ఉప‌యోగిస్తున్నామ‌ని, పనితీరును పరిశీలించిన తర్వాత భక్తుల రద్దీ అధికంగా ఉండే ఇతర ప్రధాన ఆలయాల్లోనూ ఇలాంటి యంత్రాలను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు.

ఆలయాల్లో డిజిటైజేషన్, ఆటోమేషన్‌ను మరింత విస్తరించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని కమిషనర్ తెలిపారు. ముఖ్యంగా రద్దీ ఎక్కువగా ఉండే సమయాల్లో భక్తులకు సేవలను వేగంగా అందించేందుకు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. అయితే పండుగ రోజుల్లో యంత్రం ద్వారా ప్రసాదం పంపిణీకి పరిమితులు ఉండే అవకాశం ఉందని చెప్పారు.

45
దళారులను నమ్మొద్దు.. అధికారిక మార్గాల్లోనే సేవా టికెట్లు
Image Credit : our own

దళారులను నమ్మొద్దు.. అధికారిక మార్గాల్లోనే సేవా టికెట్లు

ఆలయ దర్శనాలు, ఆర్జిత సేవల టికెట్ల విషయంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని దేవాదాయ శాఖ కమిషనర్ సూచించారు. మధ్యవర్తులు, థర్డ్ పార్టీ వ్యక్తులను నమ్మి పూజా టికెట్లు కొనుగోలు చేయవద్దని కోరారు. పారదర్శకత కోసం సేవలను డిజిటల్ విధానంలో అందిస్తున్నామని చెప్పారు. ఆర్జిత సేవా టికెట్లను ఆన్‌లైన్ విధానం లేదా ‘మనమిత్ర’ ద్వారా మాత్రమే పొందాలని స్పష్టం చేశారు. దేవస్థానం అధికారికంగా అందించే సేవలను మాత్రమే ఉప‌యోగించుకోవాల‌ని సూచించారు. ఇతర వ్యక్తులను సంప్రదించాల్సిన అవసరం భక్తులకు లేదని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

55
దసరా ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు.. సామాన్య భక్తుడికే ప్రాధాన్యం
Image Credit : our own

దసరా ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు.. సామాన్య భక్తుడికే ప్రాధాన్యం

ఇంద్రకీలాద్రిపై జరగనున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో, వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమగ్ర కార్యాచరణను సిద్ధం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. భక్తుల రద్దీకి అనుగుణంగా దర్శనాలు, ప్రత్యక్ష పూజలు, ప్రసాదం పంపిణీ వంటి అంశాలపై నిర్ణయాలు తీసుకుంటామని కమిషనర్ పేర్కొన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చిన సందర్భంలో అందరికీ వీలైనంత సౌకర్యవంతంగా దర్శనం కల్పించడమే ప్రధాన లక్ష్యమన్నారు. దసరా ఉత్సవాల సమయంలో వివిధ శాఖలు సమన్వయంతో పనిచేస్తాయని, సామాన్య భక్తుడి సౌకర్యానికే అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఆంధ్ర ప్రదేశ్
ఆధ్యాత్మిక విషయాలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Janasena Party : పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్.. జనసేనలోకి వైసిపి సీనియర్లు, వంగవీటి రాధ సంగతేంటి?
Recommended image2
IMD Weather Update : ఈ ప్రాంతాల్లో 200-300 మి.మీ వర్షపాతమా..! ప్రమాద హెచ్చరికలు జారీచేసే స్థాయిలో వానలే..!
Recommended image3
Weather Update: తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్.. మరో 2 రోజులు దంచికొట్టనున్న భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు బిగ్ అలర్ట్
Related Stories
Recommended image1
ఎవరో ఏదో అంటున్నార‌ని మనసు పాడు చేసుకుంటున్నారా.? ఈ కథ చదివితే భారం తగ్గడం ఖాయం
Recommended image2
Bank Strike: ఆదివారం బ్యాంకులు ఓపెన్‌.. ఎన్ని గంటలు పని చేస్తాయంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved